వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జ్యోతిషాన్ని నమ్మే వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది... ఎందుకు?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews

Click here to see the BBC interactive

జీవితం గురించి జ్యోతిషం వైపు చూస్తున్న వారి సంఖ్య ఇప్పుడు విపరీతంగా పెరుగుతోంది. ఇందుకు అనేక అంశాలు దోహదం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు మీద బెంగతో రాశిఫలాల్లో జాతకాలు చూసుకోవటానికి జనం మొగ్గుచూపుతున్నారు.

చార్మ్ టోరెస్.. కెనడాలోని టొరంటోలో జ్యోతిష్కురాలు. కోవిడ్ మహమ్మారి మొదలైనప్పటి నుంచీ ఆమె ఇంటర్నెట్ సేవలు పొందేవారి సంఖ్య పెరిగిపోయింది. ముఖాముఖి సంప్రదింపులు నిలిపివేసినప్పటికీ.. వందలాది మంది క్లయింట్లతో వర్చువల్ సెషన్లు నిర్వహిస్తున్నారు. వారిలో ఎక్కువ మంది ఉత్తర అమెరికా వాసులు. ఫిలిప్పీన్ ఆదివాసులు కూడా సంప్రదిస్తున్నారు. తమ జాతకాలు చూడాలని కోరుతున్నవారిలో తన వంటి మిలీనియల్స్ ఎక్కువగా ఉన్నారు.

కొందరు తమ ఆప్తులను కరోనావైరస్ వల్ల కోల్పోయారు. ఇంకొందరు ఉద్యోగాలు పోవటంతో కొత్త కెరీర్ కోసం అన్వేషిస్తున్నారు. మరికొందరు ఇంటి దగ్గర సమయం గడుపుతున్నారు. అయితే.. మద్దతు కావాలని, మానవ సంబంధాలు నెలకొల్పుకోవాలని, తమ గురించి తాము తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.

మహమ్మారి కారణంగా జీవితాలు ఒక్కసారిగా స్తంభించిపోవటంతో.. జనం తమతో తాము కూర్చుని తమ జీవితం ఏమిటి, తమ ఆలోచనలు ఏమిటి అనేది అంచనా వేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయని టెరెస్ విశదీకరిస్తున్నారు.

మహమ్మారికి ముందు సంవత్సరాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా పశ్చిమ జ్యోతిషంలో పునరుజ్జీవనం వంటిది మొదలైంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు, కోస్టార్, సాంక్చురీ వంటి ఆస్ట్రాలజీ యాప్‌లకు తోడు.. ట్రంప్ పాలన, బ్రెగ్టిట్ పరిణామాలతో తలెత్తిన అస్థిర పరిస్థితులతో యువతలో జాతకాలపై ఆసక్తి పెరిగింది. 2020 మహమ్మారి దీనికి ఆజ్యం పోసింది.

బర్త్ చార్ట్ (జాతకం), ఆస్ట్రాలజీ (జ్యోతిషం) కోసం సెర్చ్ చేయటం 2020లో ఐదేళ్ల గరిష్టానికి చేరిందని గూగుల్ ట్రెండ్స్ చెప్తోంది. లాక్‌డౌన్‌లో వ్యాపారం బాగా పెరిగిందని చాలా మంది ప్రొఫెషనల్ జ్యోతిష్కులు చెప్తున్నారు.

2020 ఏడాదిలో నెలవారీ యాక్టివ్ యూజర్ల విషయంలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన యాప్ టిక్‌టాక్.. కొత్త తరానికి రాశిఫలాల భాషను పరిచయం చేసింది. ఇంతకుముందు తెలియని యువ, విభిన్న జ్యోతిష్క యోధులు సోషల్ మీడియాలో ఆవిష్కృతులయ్యారు.

గతంలో జ్యోతిషం మీద ఆసక్తి లేనివారు ఎంతోమంది ఇప్పుడు మార్గదర్శనం కోసం నక్షత్రాలను ఆశ్రయించటంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా మందికి గత ఏడాది ఎన్నో భౌతిక సౌకర్యాలు కరువయ్యాయి. ఆలింగనాలు అరుదయ్యాయి. ఉద్యోగాలు పోయాయి. మానవ విషాదానికి సంబంధించి ప్రతి రోజూ కొత్త వార్తలు వస్తూ ఉన్నాయి.

''ప్రతి ఒక్కరితోనూ, ప్రతి దానితోనూ సంబంధాలు తెగిపోయినట్లు మనం భావించిన సమయంలో.. మనం జీవితానికి మరింతగా అనుసంధానం కావటానికి, మనకన్నా గొప్పదైన దానితో అనుసంధానం కావటానికి జ్యోతిషంలో ఒక మార్గం ఉంది’’ అని టోరెస్ నమ్ముతారు.

జ్యోతిషం మీద ఆసక్తి పెరగటానికి ఇటువంటి భావన ఒక కారణం కావచ్చేమో. అయితే.. సాంకేతిక పరిజ్ఞానంతో వినూత్న ఆవిష్కరణలు, మారుతున్న మిలీనియన్లు, జనరేషన్-Z తరం నమ్మకాలు వంటి ఇతర అంశాలు మహమ్మారి కన్నా ముందుగానే దీనికి భూమికను ఏర్పాటుచేశాయి.

సైన్సూ కాదు.. మతమూ కాదు...

అమెరికా 'సైకిక్ సర్వీసెస్’ పరిశ్రమ (జ్యోతిషం, జాతక ఫలాలు చెప్పే సేవల రంగం) పరిమాణం 220 కోట్ల డాలర్లుగా ఉందని 2019 ఐబిస్‌వరల్డ్ నివేదిక అంచనా వేసింది. 2020లో దీనిపై ఆసక్తి విపరీతంగా పెరిగిందంటే దాని అర్థం.. ఈ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతున్నట్లే.

''ఒక అర్థం వెదుక్కోవాలని, విధి గతులను కనుక్కోవాలని, ఈ పరిస్థితుల్లో నుంచి బయటపడతామని తెలుసుకోవటానికి.. జనం చాలా ఆతృతగా ఉన్నారని నేను అనుకుంటున్నా’’ అని న్యూయార్క్ సిటీకి చెందిన రచయిత కారొలీన్ గోల్డ్‌స్టీన్ (28) పేర్కొన్నారు.

''జ్యోతిషం స్వాభావికంగా నక్షత్ర రాశుల ఆవృతాలను అనుసరిస్తుంది. అంటే.. జ్యోతిషాన్ని చూసినపుడు ఇటువంటి పరిణామాలు గతంలోనూ సంభవించాయని తెలుసుకోవచ్చు. ఇది ఎల్లప్పుడూ విశిష్టమైన క్షణమే.. కానీ ఇప్పుడు జరుగుతున్నదానికి ఎల్లప్పుడూ గతంలో ఇలాగే జరిగిన ఉదంతం కూడా ఉంటుంది. అది నాకు ఉపశమనాన్ని ఇస్తుందని నేను అనుకుంటా’’ అని ఆమె వివరించారు.

జ్యోతిషం మీద ఆసక్తి కలిగిన కొత్తవారు ముందుగా తెలుసుకోవాలనేది జాతకం (బర్త్ చార్ట్). దినపత్రికల్లో వచ్చే రాశి ఫలాల కన్నా మరిన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని భావిస్తారు. ఒక వ్యక్తి పుట్టిన క్షణంలో ఆకాశంలో నక్షత్రాల స్థితిగతుల మ్యాప్ రచించి.. ఆ మనిషి వ్యక్తిత్వం, లక్ష్యం, జీవన గమనాలపై వాటి ప్రభావాలను క్రోడీకరిస్తారు.

ఈ తరహా కన్సల్టేషన్లు వ్యక్తిగతంగా ఉంటాయి. సంక్లిష్టంగా ఉంటాయి. సూర్యచంద్రులు, గ్రహాలు, నక్షత్రాల స్థితిగతులను పరిశీలించాలి.

గోల్డ్‌స్టీన్ ఈ జాతకఫలాల వ్యవస్థ మీద కొన్నేళ్ల కిందట ఆసక్తి కలిగింది. జ్యోతిషం ద్వారా ప్రపంచాన్ని చూసే దృక్కోణం ఆసక్తికరంగా మారుతుందని చాలా మంది లాగే ఆమె కూడా భావిస్తారు. ''ఇది ఎప్పుడూ ఒకటే సత్యం అని చెప్పదు. మీ సొంత వాస్తవాన్ని మీరు అర్థం చేసుకోవటానికి అవసరమైన భాషను అది అందిస్తుంది. ఇది పుస్తకం కాదు.. ఇదొక భాష’’ అని ఆమె అభివర్ణించారు.

ప్యూ రీసెర్చ్ సెంటర్ అంచనా ప్రకారం.. అమెరికన్ మిలీనియల్స్‌లో 60 శాతం మందికి పైగా న్యూ ఏజ్ ఆధ్యాత్మికతను విశ్వసిస్తున్నారు. అయితే.. వీరికి ముందు తరాల వారిలో దేవుడిని విశ్వసించే వారు, జీవితంలో మతం ఒక ముఖ్యమైన భాగమని నమ్మేవారి కన్నా ఇది తక్కువే.

సాంత్వన కోసం నక్షత్రాలవైపు చూపు...

చాలా మందికి జ్యోతిషంలో నమ్మకం అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఆత్మపరిశీలనకు ఉపయోగపడే ఒక పనిముట్టు. తమ భావాలు, సంఘర్షణలను తమకన్నా పెద్దదైన ఏదో అంశంలో భాగంగా చూడటానికి ఒక మార్గం.

''ఇది సౌకర్యం కలిగిస్తుంది. జరుగుతున్నదానిని అర్థం చేసుకోవటానికి సాయపడుతుంది. ఇదేదో చెడ్డ విషయం కాదు’’ అంటారు లండన్‌కు చెందిన సైకాలజిస్ట్, మై ఆన్‌లైన్ థెరపీ సహ వ్యవస్థాపకురాలు ఎలెనా టూరోని.

సంప్రదాయ కౌన్సెలింగ్‌తో పాటు జ్యోతిషం, ఇతర ప్రత్యామ్నాయ సహాయ రూపాలను ఇంత మంది జనం ఎందుకు ఆశ్రయిస్తున్నారో ఆమె అర్థం చేసుకున్నారు. అయితే ఏదో ఒక సమాచారం మీదే ఆధారపడరాదని ఆమె అప్రమత్తం చేస్తున్నారు.

''అనిశ్చితి అనేది మానవ అనుభవంలో ఒక భాగం. మన నియంత్రణలో లేని ఎన్నో అంశాలు జీవితంలో ఉన్నాయని అంగీకరించటం కష్టం కావచ్చు. ఇక కోవిడ్, లాక్‌డౌన్‌లతో జనం మరింత ఎక్కువగా అనిశ్చితిని ఎదుర్కోవాల్సి వచ్చింది’’ అని ఆమె వివరిస్తున్నారు.

లండన్‌కు చెందిన జ్యోతిష్కురాలు హనీ ఆస్ట్రో.. తను విద్యార్థిగా చదువుకున్న మానసికశాస్త్రం, కౌన్సెలింగ్ ఇప్పుడు క్లయింట్లతో పనిచేయటంలో ఉపయోగపడుతోందని చెప్తున్నారు. ''నాతో మాట్లాడిన తర్వాత అదో చికిత్స కార్యక్రమంలా ఉందని చెప్తుంటారు’’ అని ఆమె పేర్కొన్నారు.

ఏప్రిల్ నెలలో తనను సంప్రదించాలనుకునే వారి విజ్ఞప్తులు అకస్మాత్తుగా పెరిగాయని.. ఇప్పుడు ప్రతి నెలా దాదాపు 80 మంది దాదాపు 80మంది క్లయింట్లు వస్తున్నారని చెప్పారు.

తారా పథంలో...

కొందరు జ్యోతిష్కులు డబ్బు సంపాదన కోసం ఈ రంగంలోకి వస్తున్నప్పటికీ.. చాలా మంది ఫాలోయర్లు ఉన్న వారు తమ నైపుణ్యాలను డబ్బుగా మలచుకోవటానికి కొత్త మార్గాలను కనుగొంటున్నారు.

చనీ నికొలస్.. నెల వారీగా పది లక్షలకు పైగా పాఠకులు ఉన్నారు. ఆమె తన రచనలను 'యు వెర్ బోర్న్ ఫర్ దిస్’ పేరుతో ఒక పుస్తకంగా ముద్రించారు. అది మొదటి వారంలోనే 14,000 కాపీలకు పైగా అమ్ముడయింది. నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కూడా చేసుకున్నారు. ప్రత్యేకంగా చనీ పేరుతో యాప్ కూడా ప్రారంభించారు.

లాస్ ఏంజెలెస్ కేంద్రంగా ఉన్న ఆమె కంపెనీ ఇప్పుడు ముగ్గురు డైరెక్టర్ స్థాయి ఉద్యోగులను నియమించుకుంటోంది. వారికి ఒక్కొక్కరికి సంవత్సరానికి 1,00,000 డాలర్ల కన్నా ఎక్కువే జీతంగా ఇస్తోంది.

ఇక ఇటీవల టిక్‌టాక్‌లో అత్యంత సీరియస్ జ్యోతిష్కురాలి’గా పేరుపడ్డ మారెన్ ఆల్ట్‌మన్.. యూట్యూబ్‌లో కొన్ని డజన్ల వీక్షణల నుంచి కేవలం పది నెలల్లో టిక్‌టాక్‌లో పది లక్షల మందికి పైగా ఫాలోయర్ల స్థాయికి చేరుకున్నారు.

ఆమె ఇటీవలి కాలంలో బిట్‌కాయిన్ ధరలు, అమెరికా స్టాక్ మార్కెట్ కదలికల గురించి నక్షత్రాలు చెప్తున్న జోస్యం ఏమిటనే సమాచారానికి ప్రసిద్ధిగాంచారు. తన వారం వారం లైవ్‌స్ట్రీమ్‌లకు కొన్ని వేల మంది ఫీజులు చెల్లిస్తున్నట్లు ఆమె చెప్పారు.

కరోనా కాలంలో కొత్తగా జ్యోతిషం మీద ఆసక్తి కనబరుస్తున్న వారు.. కరోనా అనంతర కాలంలో ఒక స్థాయి సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్న తర్వాత కూడా జాతకాల మీద ఆసక్తిని కొనసాగిస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది.

బ్రెన్నాన్ చెప్పినట్లు.. పశ్చిమ ప్రపంచంలో జ్యోతిషం మీద ప్రజాసక్తి అలలు అలలుగా వచ్చింది. 2000 సంవత్సరాల మధ్యలో.. ఈ రంగంలో ఆసక్తి కనబరిచే యువత చాలా తక్కువగా ఉందని కొందరు జ్యోతిష్కులు ఆందోళన చెందేవారు.

ఇప్పటికైతే.. ఆధునిక జీవితం ఆధ్యాత్మికంగా పెద్ద మద్దతు ఇవ్వలేని పరిస్థితుల్లో.. సోషల్ మీడియా ఆల్గోరిథమ్‌ల సాయంతో ఆసక్తి ఉన్నవారిని చేరుతున్న జ్యోతిషం ఇంకా వృద్ధి చెందుతుందనే అనిపిస్తోంది.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
The number of people who believe in astrology is growing exponentially
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X