వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒకప్పటి ప్రాణాంతక వింత వ్యాధి, మళ్లీ భయపెడుతోంది

దశాబ్దాల తర్వాత స్కార్లెట్ ఫీవర్ యూకేతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యాధి పరిష్కారానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దశాబ్దాల తర్వాత స్కార్లెట్ ఫీవర్ యూకేతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యాధి పరిష్కారానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.

2014 ప్రారంభంలో మెల్లిగా ప్రారంభమైంది. 2016 నాటికి ఇది ఎక్కువయింది. 620 ప్రాంతాల్లో 19,000కు పైగా కేసులను గుర్తించారు. ముఖ్యంగా పాఠశాలలు, నర్సరీలలో గుర్తించారు.

The Once Deadly Scarlet Fever Is Making a Weird Comeback Around The World

గ్రూప్ ఏ స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కారణంగా ఈ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వస్తే గొంతులో మంట, జ్వరం, తలనొప్పి, వాపు తదితర లక్షణాలు ఉంటాయి.

ఈ లక్షణాలు చూస్తే భయంకరంగా ఉండకపోవచ్చు. కానీ ఈ వ్యాధి కారణంగా 20వ శతాబ్ధంలోని తొలి దశాబ్దంలో ఇంగ్లాండ్, వేల్స్ తదితర ప్రాంతాల్లో 36వేల మంది చనిపోయారు. స్కార్లెట్ ఫీవర్‌కు వ్యాక్సిన్ లేదు.

2016లో లక్ష మందిలో 33.2 కేసులు గుర్తించారు. ఇప్పటి వరకు 1967లో ఎక్కువ కేసులు గుర్తించారు. అప్పుడు 19వేలకు పైగా కేసులు గుర్తించారు. స్కార్లెట్ ఫీవర్ లక్షణాలు గుర్తించినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

స్కార్లెట్ జ్వరం లేదా స్కార్లెట్ ఫీవర్ అనేది స్ట్రెప్టోకోకస్ పయోజీన్స్‌‌చే విడుదల చేయబడ్డ విషపదార్ధాల వలన వచ్చే ఒక అంటు వ్యాధి.

ఒకప్పుడు ప్రాణాంతకమైన ఈ వ్యాధి ఇప్పుడు యాంటిబయోటిక్స్‌తో చికిత్స చేయబడుతోంది. స్కార్లటీన మరియు స్కార్లెట్ ఫీవర్ అనే పదాలు పరస్పర మార్పుచెందు పదాలుగా కూడా ఉపయోగించవచ్చు.

English summary
After decades of decline, scarlet fever is once again on the rise in the UK and other places around the world, and doctors are scrambling to figure out why.దశాబ్దాల తర్వాత స్కార్లెట్ ఫీవర్ యూకేతో పాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కలకలం రేపుతోంది. ఈ వ్యాధి పరిష్కారానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X