వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో దూసుకెళ్తున్న తెలుగువాళ్లు: ఏడేళ్లలో ఎంతంటే? 5పెద్ద నగరాల్లో సగం వీళ్లే! ఆసక్తికర అంశాలు

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికాలో వేగంగా పెరుగుతున్న భాష ఏమిటో ఊహించగలరా? ఇంగ్లీష్ లేదా ఇతర భాషల పేర్లు చెబితే తప్పే అవుతుంది. ఎందుకంటే మన మాతృభాష తెలుగు అమెరికాలో వేగంగా పెరుగుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి చాలామంది యువత అమెరికాకు వెళ్తున్నారు. ఇక్కడి యువత సాఫ్టువేర్, ఇంజినీరింగ్ చదువు, ఉపాధి కోసం అమెరికా వెళ్తున్నారు. 2015లో అమెరికా కాన్సులేట్ నుంచి ఇష్యూ అయిన వీసాలు హైదరాబాద్ నుంచే ఎక్కువగా ఉన్నాయి. భారత్‌లోని మరే ప్రాంతం నుంచి ఇన్ని వీసాలు ఇష్యూ కాలేదు.

ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)ట్రంప్ విమానం ఎక్కుతుంటే ఏం జరిగిందో చూడండి, జోకులు పేలుతున్నాయి (వీడియో)

హైదరాబాద్ ప్రాంతం నుంచి అమెరికాకు ఎక్కువ మంది యువత వెళ్తున్నారు. 2010 నుంచి 2017కు మధ్య తెలుగు మాట్లాడే వారి సంఖ్య అమెరికాలో అనూహ్యంగా పెరిగింది. ఏకంగా 86 శాతం పెరగడం గమనార్హం. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే అమెరికాలో నివసిస్తున్న దాదాపు సగం మంది తమ తమ ఇళ్లలో ఇంగ్లీష్ మాట్లాడటం లేదు. ప్రతి ఐదుగురిలో ఒకరు తమ ఇళ్లలో విదేశీ భాషనే మాట్లాడుతున్నారు. అంటే తమతమ భాషలు మాట్లాడుతున్నారు.

 2010 నుంచి 2017 మధ్య 86 శాతం పెరిగిన తెలుగువారు

2010 నుంచి 2017 మధ్య 86 శాతం పెరిగిన తెలుగువారు

అమెరికాలో తెలుగు తర్వాత ఇతర భాషలు కూడా వేగంగానే పెరుగుతున్నాయి. ఇందులో అరబిక్, హిందీ, ఉర్దూ, గుజరాతీ భాషలు ఉన్నాయి. సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) చేసిన సర్వేలో అమెరికాలో మాట్లాడే భాషల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కథనం ఇచ్చింది. 2010 నుంచి 2017 మధ్య అమెరికాలో 86 శాతం మంది తెలుగు మాట్లాడే వారు పెరిగారు. దేశంలోనే ఏ ఇతర భాషలతో పోల్చినా ఇది అత్యధికం. ఇక్కడ దాదాపు 4 లక్షల మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు.

తెలుగువారి పెరుగుదల అమెరికాలో ఇలా

తెలుగువారి పెరుగుదల అమెరికాలో ఇలా

2000 సంవత్సరంలో అమెరికాలో తెలుగు మాట్లాడే వారు 87,543 మంది ఉండేవారు. 2010లో 2,22,977గా ఉంది. కానీ తాజా లెక్కల ప్రకారం 4,15,414 మంది తెలుగు మాట్లాడే వారు ఉన్నారు. జూలై 01 2017 వరకు ఈ సర్వే చేశారు. భారత దేశం నుంచి ఇంజినీరింగ్ కోసం ఎక్కు మంది హైదరాబాద్ నుంచే వస్తున్నారు. 2008 నుంచి 2012 మధ్య 26వేల మంది విద్యార్థులు అమెరికాకు వచ్చారు. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, అడోబ్సిస్టమ్ సీఈవో శంతను నారాయణలు తెలుగువారే.

నైనా దేవులూరికి కిరీటం, ఉద్యోగాల్లో రెండోతరం తెలుగువారు

నైనా దేవులూరికి కిరీటం, ఉద్యోగాల్లో రెండోతరం తెలుగువారు

అమెరికాలో సాఫ్టువేర్ ఉద్యోగాలు పొందుతున్న అమెరికేతర వారిలో ప్రతి తొమ్మిదింట ఐదు ఉద్యోగాలు రెండోతరం తెలుగు వారు పొందుతున్నారు. 2013లో నైనా దేవులూరి మిస్ అమెరికా కిరీటం దక్కించుకున్నారు. ఆమె మూలాలు తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఉన్నాయి. 1980లలో నైనా దేవులూరి తల్లిదండ్రులు అమెరికా వచ్చారు. ఇద్దరు కూడా డాక్టర్లు. ఇక్కడి తెలుగు విద్యార్థులు స్పెల్లింగ్ బీ కాంపిటీషన్లోను గెలుస్తున్నారు.

తెలుగువారికి కొన్ని విషాదాలు

తెలుగువారికి కొన్ని విషాదాలు

అమెరికాలో కొందరు తెలుగువారు అక్కడి వారి ఘాతుకానికి బలైన సందర్భాలు ఉన్నాయి. విద్వేష హత్యలు, దోపిడీలకు వీరు బలయ్యారు. కాగా, ఇండియన్ ఇమ్మిగ్రేంట్స్‌కు అమెరికా మరో హోమ్ టౌన్‌గా మారుతోంది. కాగా, భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల నుంచి, ఎన్నో భాషలు ఉన్నప్పటికీ తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రం అధికంగా అమెరికాకు వెళ్తున్నారు.

ఏ భాష మాట్లాడేవారు ఎంత మంది అంటే?

ఆయా భాషల విషయానికి వస్తే తెలుగు భాష మాట్లాడే వారు 86 శాతం పెరగగా, అరబిక్ మాట్లాడే వారు 42 శాతం, హిందీ మాట్లాడే వారు 42 శాతం, ఉర్దూ మాట్లాడే వారు 30 శాతం, చైనీస్ మాట్లాడే వారు 23 శాతం, గుజరాత్ మాట్లాడే వారు 22 శాతం పెరిగారు.

 బెంగాళీలు, తమిళులు కూడా పెరుగుతున్నారు

బెంగాళీలు, తమిళులు కూడా పెరుగుతున్నారు

అమెరికాలో బెంగాళీ మాట్లాడేవారు 3,50,000 మంది, తమిళం మాట్లాడేవారు 2,80,000 మంది ఉన్నారు. వీరు కూడా వేగంగానే పెరుగుతున్నారు. బెంగాళీ మాట్లాడే వారు 57 శాతం పెరగగా, తమిళం మాట్లాడే వారు 55 శాతం పెరిగారు. భారతదేశంలో హిందీ మాట్లాడే రాష్ట్రాలు, జనాభా ఎక్కువ. కానీ అమెరికాలో తెలుగు మాట్లాడే వారి శాతం మాత్రం చాలా వేగంగా పెరుగుతోంది.

భారతదేశంలోని భాషల పరంగా ఇదీ లెక్క

భారతదేశంలోని భాషల పరంగా ఇదీ లెక్క

మొత్తంగా చూస్తే, అమెరికాలో భారతదేశంలో మాట్లాడే భాషల పరంగా ఏ భాష వారు ఎంతమంది ఉన్నారంటే... హిందీ మాట్లాడే వారు 8,63,077, ఉర్దూ మాట్లాడేవారు 5,07,329, గుజరాతీ మాట్లాడేవారు 4.34,264, తెలుగు మాట్లాడేవారు 4,15,414, బెంగాళీ మాట్లాడే వారు 3,50,000, పంజాబీ మాట్లాడేవారు 3,10,650, తమిళం మాట్లాడేవారు 2,86,732 మంది ఉన్నారు. 2010 నుంచి 17 మధ్య హిందీ మాట్లాడే వారి సంఖ్య పెరుగుదలలో మూడో స్థానంలో ఉంది.

అమెరికాలోని 5 పెద్ద నగరాల్లో దాదాపు సగం మంది విదేశీయులు

2010 నుంచి 2017 మధ్య అన్ని భాషలను తీసుకుంటే చైనీస్ మాట్లాడేవారు 6,53,000 మంది, అరబిక్ మాట్లాడేవారు 3,63,000, హిందీ మాట్లాడే వారు 2,54,000, తెలుగు మాట్లాడేవారు 1,92,000, టగలోగ్ మాట్లాడే వారి సంఖ్య 1,73,000, హైటియన్ క్రియోల్ మాట్లాడే వారి సంఖ్య 1,40,000, బెంగాళీ మాట్లాడే వారి సంఖ్య 1,28,000, ఉర్దు మాట్లాడే వారి సంఖ్య 1,18,000, వియత్నామీలు 1,17,000 పెరిగారు. మొత్తంగా చూస్తే అమెరికాలో 21.8 శాతం మంది విదేశీ భాషలు మాట్లాడుతున్నారు. అమెరికాలోని అయిదు పెద్ద నగరాల్లో విదేశీ మాట్లాడే వారి సంఖ్య దాదాపు సగం వరకు ఉంది.

English summary
Between 2010 and 2017, the number of native Telugu speakers in the US surged 86%—the largest uptick in a foreign language speaking group—the results of a September 2018 study by Center for Immigration Studies (CIS) show. This was the highest jump among the most widely spoken foreign languages in the country, among those that had over 400,000 people speaking it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X