వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐల్యాండ్ కాదు బోట్ ల్యాండ్ (వీడియో)

|
Google Oneindia TeluguNews

ప్యారీస్: యాట్ ఐల్యాండ్ డిజైన్ నిర్వహకులు సముద్రంలో తేలియాడే ఓ అందమైన యాట్ ను తయారు చేశారు. ఆ యాట్ లో అచ్చంగా కృత్రిమ దీవిని సృష్టించారు. కరేబియన్, పాలనీసియా దీవుల స్పూర్తితో దీన్ని తయారు చేశారు.

సుమారు 300 అడుగుల పోడవు ఉండే ఈ సూపర్ యాట్ అడుగు భాగాన్ని ఉక్కుతో నిర్మించారు. పై భాగం ఫైబర్, అల్యూమినియం, రీఎన్ ఫోర్స్ డ్ ప్లాస్టిక్ తో తయారు చేశారు. యాట్ వెనుక భాగంలో అగ్నిపర్వతం లాంటి పర్వతం సృష్టించారు.

అయితే అగ్నిపర్వతం నుంచి వచ్చే లావా కాకుండా ఇక్కడి నుంచి నీరు వస్తుంది. అది జలపాతంలో ప్రవహించి ముందు ఉన్న స్విమ్మింగ్ పూల్ కు చేరుతుంది. స్విమ్మింగ్ పూల్ పక్కనే కృత్రిమ బీచ్ ఉంటుంది.

 The super yacht that comes with its own Volcano

దాని చుట్టు కాటేజీలు, వాటి చుట్టు పచ్చటి చెట్లు ఉన్నాయి. నిజంగా ఓ దీవిలో ఉన్న అనుభూతిని కలిగిస్తాయని యాట్ ఐల్యాండ్ డిజైన్ నిర్వహకులు చెబుతున్నారు. ఈ దీవిలో ఉన్న చెట్లు అన్ని సహజమైనవే.

అంతే కాకుండా ఈ కృత్రిమ దీవిలో సినిమా హాల్, జిమ్, లైబ్రరీతో సహ అనేక ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి. 100 మంది ప్రయాణించే ఈ యాట్ ని యాట్ ఐల్యాండ్ డిజైన్ సంస్థ నిర్మించింది. ఇది గంటకు 15 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.

గత ఐదు సంవత్సరాల క్రితం ఈ యాట్ డిజైన్ తయారైయ్యింది. అయితే ఈ ఏడాదిలో నిర్మాణం పూర్తి చేసుకుంది. ఈ యాట్ లో ప్రయాణించడానికి పలువురు పోటీ పడుతున్నారు.

English summary
The extravagant 295ft ship boasts a towering volcano with a cascading waterfall which feeds the swimming pool.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X