వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ హాంకాంగ్‌ ‘పోకిరి’.. 299 మంది గ్యాంగ్‌స్టర్‌లను పట్టించాడు!

పోకిరి సినిమా చూశారా? అందులో పోలీస్‌ అధికారి అయిన హీరో అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా మాఫియాలో చేరి వారిని తుదముట్టిస్తాడు. అచ్చం అలాగే హాంకాంగ్‌కు చెందిన ఓ పోలీసాఫీసర్‌ చేశాడు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హాంకాంగ్‌: పోకిరి సినిమా చూశారా? అందులో పోలీస్‌ అధికారి అయిన హీరో అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో భాగంగా మాఫియాలో చేరి వారిని తుదముట్టిస్తాడు. అచ్చం అలాగే హాంకాంగ్‌కు చెందిన ఓ పోలీసాఫీసర్‌ చేశాడు.

దాదాపు 11 నెలల పాటు అండర్‌కవర్‌ ఆపరేషన్‌లో పాల్గొని 299 మంది గ్యాంగ్‌స్టర్‌లను పట్టించాడు. దీనికోసం సదరు పోలీసు అధికారి తన ప్రాణాలను సైతం ప్రమాదంలో పెట్టాడు. ఈ దశాబ్దంలో ఇదే అత్యంత ప్రమాదకర ఆపరేషన్‌ అని హాంకాంగ్‌ పోలీస్‌ శాఖ పేర్కొంది.

 The undercover Hong Kong policeman who helped bust 299 gangsters

హాంకాంగ్‌లో పెరిగిపోతున్న మాఫియా ఆగడాలను అరికట్టడానికి ఓ పోలీస్‌ అధికారి అండర్‌కవర్‌ ఆపరేషన్‌కు సిద్ధపడ్డాడు. పేరు మార్చుకున్నాడు, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పూర్తిగా సంబంధాలు తెంచుకున్నాడు. తనని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు దాదాపు 13 కిలోల బరువు తగ్గాడు.

ఆ తర్వాత ఎలాగోలా కష్టపడి మాఫియాలో చేరిపోయాడు. అయితే గ్యాంగ్‌స్టర్‌ల నమ్మకాన్ని చూరగొనడానికి ఎంతో కష్టపడ్డాడట. మొదట్లో అతణ్ని చాలామంది నమ్మలేదట. అతనికి కఠినమైన పరీక్షలు పెట్టేవారట.

అండర్‌ కవర్‌ ఆపరేషన్‌ నేపథ్యంలో తెరకెక్కిన 'ఇన్‌ఫెర్నల్‌ ఆఫైర్స్‌' సినిమాలోని పాటలు పాడుతూ ఇతని ముఖకవళికలు గమనించేవారట. అలా అనుక్షణం ప్రాణభయంతో పనిచేస్తూనే గ్యాంగ్‌స్టర్‌ల స్థావరాల గురించి పోలీసులకు సమాచారమిచ్చాడు ఆ పోలీస్‌ అధికారి.

అలా 299 మంది గ్యాంగ్‌స్టర్‌లను పట్టించాడట. నిజానికి ఇలాంటి అండర్‌కవర్‌ ఆపరేషన్‌లు ఆర్నెల్లకు మించి సాగవని, ఇది అత్యంత ప్రమాదకర సాహసమని పోలీస్‌ బాస్‌లు కూడా పేర్కొంటున్నారు.

ప్రస్తుతం ఆ అధికారి సెలవులో ఉన్నాడని, భద్రత కారణాల దృష్ట్యా అతనికి ప్రభుత్వం తపాకీని కూడా అందజేసిందని తెలిపారు. అతను తిరిగి విధుల్లో చేరిన తర్వాత అతనికి పదోన్నతి కల్పిస్తామని వారు పేర్కొన్నారు.

English summary
A police officer who infiltrated a triad gang for 11 months in one of Hong Kong’s most dangerous undercover operations, leading to the arrest of 299 gangsters, is now allowed to carry a pistol to guard against revenge, sources say. Force insiders revealed on Wednesday how the officer was tested by gang leaders in the final months of the operation, singing songs to him from films such as the hit Infernal Affairs, an undercover police drama, to check his response. They said the officer now weighed only 41kg after losing 13kg during the 11-month sting, which ended with a major crackdown. Hundreds of police officers raided suspects’ homes and unlicensed venues in the New Territories, starting on Monday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X