వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైవ్ న్యూస్ కవర్ చేస్తుంటే అనుకోని ఆటంకం: వైరల్ వీడియో..

లైవ్ టెలికాస్టు చేస్తున్న యూఎస్ వెదర్ ఛానెల్‌కు బస్సు రూపంలో ఆటంకం ఎదురైంది.

|
Google Oneindia TeluguNews

అట్లాంటా: బ్రేకింగ్ న్యూస్ కోసం మీడియా ఛానెళ్లు ఎంతగా పాకులాడుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వీక్షకులకు ఎక్స్‌క్లూజివ్ కవరేజ్ అందించేందుకు కొన్నిసార్లు మీడియా ప్రతినిధులు రిస్క్ కూడా చేస్తుంటారు.

అలాంటి సమయాల్లో అనుకోని అడ్డంకులు ఏర్పడి బ్రేకింగ్‌కు గండి కొడితే సదరు మీడియా ప్రతినిధులు పడ్డ కష్టమంతా వృథానే. తాజాగా యూఎస్ వెదర్ ఛానెల్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది. అమెరికాలోని అట్లాంటాలో జార్జియా డోమ్ స్టేడియంను కూల్చివేస్తున్న వేళ.. లైవ్ టెలికాస్టు చేస్తున్న యూఎస్ వెదర్ ఛానెల్‌కు బస్సు రూపంలో ఆటంకం ఎదురైంది.

సరిగ్గా స్టేడియం కూలిపోయే సమయంలో ఓ బస్సు వచ్చి కెమెరాకు అడ్డంగా ఆగింది. దీంతో లైవ్ కవరేజీకి ఆటంకం ఏర్పడింది. 20సెకన్ల పాటు అక్కడే ఆగిన బస్సు.. స్టేడియం మొత్తం కూలిపోయాక గానీ అక్కడి నుంచి కదలలేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

English summary
The Weather Channel might have captured the perfect shot of the Georgia Dome imploding after 25 years of use. If it weren’t for a bus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X