వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"దేశంలో మార్పులు చేస్తే వారసుడ్ని చంపేయండి"

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా: దేశంలో తిరిగి సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే తన కుమారుడిని కాల్చి చంపేయాలని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తన ముఖ్య అనుచరులకు, నమ్మకస్తులైన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

తన కుమారుడిని హత్య చెయ్యడానికి అవసరం అయ్యే అత్యాధునికంగా వెండితో తయారు చేసిన తుపాకు (పిస్తోల్)లను ఆయన వారికి అందించారు. ఉత్తర కోరియాలో కొత్తగా విడుదలైన పుస్తకంలో ఈ విషయాలు ఉన్నాయని తాజాగా వెలుగు చూసింది.

ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ కుటుంబం కిందే నడుస్తున్న విషయం అందరికి తెలిసిందే. జాంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జాంగ్ ఇల్, ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ దేశ పాలన చూస్తున్నారు.

The whole system inevitably collapses. He could not let that happen.

ప్రస్తుతం ఉన్న విధానాలతోనే దేశం ముందుకు వెళ్లాలని, కాదని తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలనలో మార్పులు చేసేందుకు తన వారుసులు ప్రయత్నిస్తే కాల్చి చంపేయాలని గట్టిగానే చెప్పినట్లు ఆ పుస్తకం చెబుతున్నది.

దక్షిణ కొరియా మాజీ నిఘా విభాగం చీఫ్ రా జంగ్ యిల్ ఈ పుస్తకాన్ని రాశారు. రా జంగ్ యిల్ మీడియాతో మాట్లాడుతూ మార్పులు చేర్పులకు ప్రయత్నించిన సోవియట్ యూనియన్ ఎంత పతనమైందో కిమ్ ఇల్ సంగ్ స్వయంగా చూశారని అన్నారు.

తన తరువాత వచ్చే వారసులు ఈ మార్పులు చేర్పులు చేసే విషయంలో జోక్యం చేసుకుంటే దేశం విచ్చిన్నం అవుతుందని, అందుకే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నానని ఆయన తన నమ్మకస్తులకు తుపాకులు ఇచ్చారని రా జంగ్ యిల్ మీడియాకు వివరించారు.

English summary
Pistol with orders to kill his son if he ever tried to reform the stalinist North Korea Country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X