వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'చెడ్డీస్‌' పదానికీ ఓ చరిత్ర ఉంది .. అందుకే ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో చేరింది

|
Google Oneindia TeluguNews

'చెడ్డీస్‌'... ఇప్పుడు ఈ పదం పై పెద్ద చర్చజరుగుతుంది. లో దుస్తుల్లో ఒక రకాన్ని ప్రత్యేకిస్తూ భారత్‌లోని కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉపయోగించే మాట అయిన చెడ్డీస్ ఇప్పుడు 'ఆక్స్‌ఫర్డ్‌ ఆంగ్ల నిఘంటువు'(ఓఈడీ)లో చేరింది. 'చెడ్డీస్‌'ని అధికారిక ఆంగ్లపదంగా గుర్తిస్తూ ఈ నిఘంటువులో చేర్చారు.

 The word CHEDDIES has a history and hence it was added in Oxford Dictionary

ఆక్స్‌ఫర్డ్‌ ఆంగ్ల శబ్దకోశం(ఓఈడీ)లో కొత్త పదాలు చేరాయి. మన దేశంలో విస్తృతంగా వాడుకలో ఉన్న కొన్ని పదాలకు ఇందులో చోటు లభించింది. భారత్‌, బ్రిటన్‌ దేశాల మధ్య శతాబ్దాల తరబడి ఉన్న దీర్ఘకాలిక బంధాన్ని ప్రతిబింబించే 'చెడ్డీ'(లో దుస్తులు) పదాన్ని డిక్షనరీలో చేర్చారు. ఉత్తర భారతంలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ పదాన్ని ఆంగ్లేయుల పాలనలోనే పలు గెజెట్లలో, ప్రచురణల్లోనూ పేర్కొన్నారు. అయితే 1990వ దశాబ్దంలో బీబీసీ టెలివిజన్‌లో ప్రసారమైన బ్రిటి్‌ష-ఆసియన్‌ కామెడీ సిరీస్‌ 'గుడ్‌నెస్‌ గ్రేసియస్‌ మి'లో నటులు కూడా వాడటంతో దీనికి బాగా ప్రాముఖ్యత వచ్చింది. చెడ్డీస్‌ అనే పదానికి షార్ట్‌ ట్రౌజర్స్‌, షార్ట్స్‌, అండర్‌వేర్‌, అండర్‌ప్యాంట్స్‌ సమానార్థకాలుగా ఓఈడీ వివరించింది. తిరస్కరణ, ఏవగింపు వంటి భావాలను వ్యక్తం చేసేటప్పుడు 'కిస్‌ మై చెడ్డీస్ ' అనే పదబంధాన్ని ఉపయోగిస్తారని పేర్కొంది.

జమ్ము కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ సంస్థ పై నిషేధం, జమ్ము కాశ్మీర్ లో యాసిన్ మాలిక్ సంస్థ పై నిషేధం,

ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీకి ఈనెలలో చేసిన అప్‌డేట్‌లో 650 పదాలు, పదబంధాలను కొత్తగా చేర్చారు
. అందులో చెడ్డీస్ అనే పదాన్ని డిక్షనరీలో చేర్చుతున్నట్లు ఓఈడీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ జొనాథన్ డెంట్ వెల్లడించారు. ఈ డిక్షనరీలో చడ్డీస్ అన్న పదానికి షార్ట్ ట్రౌజర్స్, షార్ట్స్ అన్న అర్థాన్నిచ్చారు. ఈ చెడ్డీలు అన్న పదాన్ని తొలిసారి 1858లో బ్లాక్‌వుడ్‌కు చెందిన ఎడిన్‌బర్గ్ మ్యాగజైన్‌లో వాడినట్లు ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. 1885 గెజటీర్ బాంబే ప్రెసిడెన్సీలోనూ ఈ పదాన్ని వాడినట్లు తెలిపింది. పురుషులు మోకాళ్ల వరకు ఉండే ఈ చెడ్డీలను ధరిస్తారని అందులో రాసి ఉంది. కొన్ని శతాబ్దాలుగా భారత్‌కు చెందిన ఎన్నో పదాలను ఈ డిక్షనరీలో చేర్చారు. అందులో లూట్, బంగ్లా, అవతార్, మంత్ర, చట్నీ, కాట్, డెకాయిట్, జుగర్‌నాట్, గురు, పండిత్, ఖాకీ, జంగిల్, నిర్వానా, పక్కా, పైజామాస్, వరండా, మహారాజా, పంచ్ అనే పదాలు ఉన్నాయి. తాజాగా ' చెడ్డీస్ 'కూడా చేరింది .

English summary
In the update made to Oxford Dictionary, 650 words and phrases were newly added .In which the word 'CHEDDIES' is included in the dictionary. The widespread word in some parts of India, especially a kind of innerware, is now added in the 'Oxford English Dictionary'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X