వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాకు ధీటుగా చైనా! టెక్నాల‌జీ రంగంలో దూసుకెళ్తున్న కంపెనీలు!

టెక్నాల‌జీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్ వంటి అమెరిక‌న్‌ టెక్ దిగ్గ‌జాల స‌ర‌స‌న చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ కంపెనీలు చేరాయి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బీజింగ్: టెక్నాల‌జీ రంగంలో బాగా ప్రాచుర్యం పొందిన ఆపిల్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, మైక్రోసాఫ్ట్‌, అమెజాన్ వంటి అమెరిక‌న్‌ టెక్ దిగ్గ‌జాల స‌ర‌స‌న చైనాకు చెందిన అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ కంపెనీలు చేరాయి.

ఈ రెండు కంపెనీలు త‌మ దేశీయ మార్కెట్‌తో పాటు అంత‌ర్జాతీయ మార్కెట్‌లో కూడా త‌మ స‌త్తా చాటుతున్నాయి. దీంతో ఇంటెల్‌, సిస్కో, ఐబీఎం వంటి కంపెనీల లాభాల‌ను దాటేసి అమెరిక‌న్ టెక్ కంపెనీల‌తో పోటీ ప‌డుతున్నాయి.

పాశ్చాత్య ప్ర‌జ‌ల ఆన్‌లైన్ జీవితాల‌ను అమెరిక‌న్ కంపెనీలు ప్ర‌భావితం చేస్తుండ‌గా, అంత‌కంటే రెండు రెట్ల జ‌నాభా ఉన్న చైనా ప్ర‌జ‌ల ఆన్‌లైన్ జీవితాల‌ను అలీబాబా ప్ర‌భావితం చేస్తోంది.

The World’s Biggest Tech Companies Are No Longer Just American

మ‌రో ప‌క్క పాశ్చాత్య ప్ర‌జ‌ల కంటే చైనీయులు ఆన్‌లైన్ షాపింగ్‌పై మ‌క్కువ చూపించ‌డంతో అలీబాబా లాభాలు వేగంగా పుంజుకుంటున్నాయి. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం చైనాలో ఇతర దేశాల ఇంట‌ర్నెట్ సేవ‌లు అందుబాటులో ఉండ‌క‌పోవ‌డ‌మేన‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇక సోష‌ల్ మీడియా విభాగంలో టెన్సెంట్ కంపెనీ ఫేస్‌బుక్ స‌ర‌స‌న చేరింది. ఫేస్‌బుక్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా 2 బిలియ‌న్ల యూజ‌ర్లు ఉండ‌గా, టెన్సెంట్‌కి ఒక్క చైనాలోనే దాదాపు రెండు బిలియ‌న్ల యూజ‌ర్లు ఉన్నారు. త్వ‌ర‌లో వాట్సాప్ త‌ర‌హాలో మెసేజింగ్ యాప్‌ను చైనాలో ప్ర‌వేశ‌పెట్టేందుకు టెన్సెంట్ రంగం సిద్ధం చేస్తోంది.

టెక్నాల‌జీ రంగంలో అమెరికా కంపెనీల‌కు ధీటుగా త‌యారై, త్వ‌ర‌లోనే వాటి మార్కును అందుకునేందుకు అలీబాబా, టెన్సెంట్‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాన్ని చైనా ప్ర‌భుత్వం కూడా మెచ్చుకుంటోంది.

English summary
The technology world’s $400 billion-and-up club — long a group of exclusively American names like Apple, Google, Facebook, Microsoft and Amazon — needs to make room for two Chinese members. The Alibaba Group and Tencent Holdings, Chinese companies that dominate their home market, have rocketed this year to become global investor darlings. They are now among the world’s most highly valued public companies, each of them twice as valuable as tech stalwarts such as Intel, Cisco and IBM.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X