వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు విరుగుడు.. కీలక విషయాన్ని కనిపెట్టిన సూపర్ కంప్యూటర్..

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎంతగా భయపడుతుందో తెలిసిందే. వైరస్ కంటే దానికి మందు లేకపోవడం ప్రపంచ దేశాలను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అసలు వైరస్ జన్యుక్రమంపై ఇప్పటికీ స్పష్టమైన విశ్లేషణ లేకపోవడం.. దాని విరుగుడు తయారీ ప్రయత్నాలకు సవాల్‌గా మారింది. వ్యాక్సిన్ తయారీ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ.. అవి ఓ కొలిక్కి రావాలంటే కనీసం ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో నివారణ చర్యల పైనే అన్ని దేశాలు ఎక్కువగా దృష్టి సారించాయి. ఇలాంటి తరుణంలో ఓ ఆసక్తికర ఆశాజనకమైన కథనం తెర పైకి వచ్చింది.

ఆ కెమికల్స్‌ను గుర్తించిన సూపర్ కంప్యూటర్

ఆ కెమికల్స్‌ను గుర్తించిన సూపర్ కంప్యూటర్

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్ కరోనావైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించే రసాయనాలను గుర్తించింది. కృత్రిమ మేధస్సు(ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్)తో రూపొందించిన ఐబీఎం సూపర్ కంప్యూటర్.. ఏ డ్రగ్ కాంపౌండ్స్‌ వైరస్‌ను సమర్థవంతంగా ఆపగలవని విశ్లేషించేందుకు వేలాది సిములేషన్స్‌ను నిర్వహించింది. ఈ క్రమంలో వైరస్‌ను ధీటుగా ఎదుర్కొనే 77 డ్రగ్ కాంపౌండ్స్‌ను సూపర్ కంప్యూటర్ గుర్తించింది.ఓక్ రిడ్జి నేషనల్ లేబోరేటరీ పరిశోధకులు ChemRxiv అనే జర్నల్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు చికిత్స విధానాన్ని కనుగొనడంలో ఇది కీలకం కానుంది.

సూపర్ కంప్యూటర్ ప్రత్యేకతలు

సూపర్ కంప్యూటర్ ప్రత్యేకతలు

ప్రపంచ సమస్యల పరిష్కారం కోసం యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ 2014లో సమ్మిట్‌(సూపర్ కంప్యూటర్)ను నిర్మించింది. ఇది 200 పెటాఫ్లాప్‌ల శక్తిని కలిగి ఉంటుంది. అంటే ఒక సెకనుకు 200 క్వాడ్రిలియన్ లెక్కల కంప్యూటింగ్ వేగాన్ని కలిగి ఉంటుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఒక వేగవంతమైన ల్యాప్‌టాప్ కంటే 1 మిలియన్ రెట్లు ఎక్కువ శక్తివంతమైనది. అమెరికాలోని టెన్నెస్సీలో ఉన్న ఓక్ రిడ్జ్ నేషనల్ లేబోరేటరీలో ఉన్న సమ్మిట్ గతంలో అల్జీమర్స్ కణ వ్వవస్థలోని నమూనాలను గుర్తించింది. అలాగే క్లైమేట్ సిములేషన్స్ ఆధారంగా ఓపియాయిడ్ ఎడిక్షన్ వంటి లక్షణాలకు దోహదం చేసే జన్యువులను విశ్లేషించగలిగింది.

తాజా ఫలితాలను అలా భావించడానికి లేదు..

తాజా ఫలితాలను అలా భావించడానికి లేదు..

ఓక్ రిడ్జ్ పరిశోధకుడు మికోలస్ స్మిత్ జనవరిలో ప్రచురించిన పరిశోధనల ఆధారంగా కరోనావైరస్ స్పైక్ నమూనాను రూపొందించారు. సమ్మిట్‌తో, వైరల్ ప్రోటీన్‌లోని అణువులు మరియు కణాలు వేర్వేరు డ్రగ్ కాంపౌండ్స్‌కు ఎలా స్పందిస్తాయో తెలుసుకునేందుకు సూపర్ కంప్యూటర్ ద్వారా సిములేషన్స్ నిర్వహించారు. ఇందులో వైరస్ స్పైక్ ప్రోటీన్‌‌ను బంధించగల మొత్తం 8,000 కాంపౌండ్స్‌ సిములేషన్స్ నిర్వహించారు. వీటిల్లో వైరస్ వ్యాప్తిని పరిమితం చేయడంలో కీలకంగా వ్యవహరించే 77 డ్రగ్ కాంపౌండ్స్‌ను గుర్తించారు. ఒకరకంగా వైరస్‌ను అడ్డుకోవడానికి శక్తివంతంగా పనిచేసే డ్రగ్ కాంపౌండ్స్‌ని గుర్తించడంలో మొదటి దశ విశ్లేషణను సమ్మిట్ అందించింది. అయితే ప్రత్యేకించి ఏ రసాయనాలు వైరస్‌పై శక్తివంతంగా పనిచేస్తాయో నిరూపించడానికి ప్రయోగాత్మక అధ్యయనాలు అవసరమని చెబుతున్నారు. ఈ పరిశోధనల ఫలితాలు కరోనా వైరస్‌కు చికిత్సను లేదా నివారణను కనుగొన్నట్టు కాదని ఓక్ రిడ్జ్ నేషనల్ లేబోరేటరీ సెంటర్ ఫర్ మాలిక్యులర్ బయోఫిజిక్స్ డైరెక్టర్ జెరెమీ స్మిత్ ఒక ప్రకటనలో తెలిపారు.

English summary
Summit, IBM's supercomputer equipped with the "brain of AI," ran thousands of simulations to analyze which drug compounds might effectively stop the virus from infecting host cells.The supercomputer identified 77 of them. It's a promising step toward creating the most effective treatment.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X