హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎవరీ 'మైక్రోసాఫ్ట్' సత్య నాదెళ్ల?: నగరంతో అనుబంధం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Satya Nadella
హైదరాబాద్: సత్య నాదేళ్ల స్వస్థలం అనంతపురం జిల్లా యల్లనూరు మండలం బుక్కాపురం. ఆయన తండ్రి మాజీ ఐఏఎస్ బిఎస్ యుగంధర్. గతంలో ప్రధానమంత్రి వ్యక్తిగత కార్యదర్శిగా, ప్రణాళిక సంఘం సభ్యుడిగా పని చేశారు. యుగంధర్ ఐఏఎస్‌కు ఎంపికయ్యాక హైదరాబాదులో స్థిరపడ్డారు. కుమారుడు సత్యను రాజధానిలోనే చదివించారు. పలు సందర్భాల్లో సత్య తన సొంతూరు బుక్కాపురం వెళ్లారు. ఇల్లు, పంట పొలాలు చూసి అనందించేవారు. అందరిని ఆత్మీయంగా పలకరించే గుణం.

తండ్రి యుగందర్ 1962 బ్యాచుకు చెందిన ఐఏఎస్ అధికారు. ఆయన హైదరాబాదులో స్థిరపడటంతో సత్య ప్రాథమిక విద్యాభ్యాసమంతా హైదరాబాద్‌లోనే సాగింది. మరో ఐఏఎస్ అధికారి కెఆర్ వేణుగోపాల్ కూతురు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లోనే చదివిన అనుపమను సత్య పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి. వాషింగ్టన్‌లో స్థిర నివాసం. పుస్తకాలు చదవడం, ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయడంపై సత్య ఆసక్తి చూపుతుంటారు.

సత్యకి ఇరవై రెండేళ్ల క్రితం పెళ్లైంది. అదే ఏడాది మైక్రోసాఫ్ట్‌లో చేరారు. విండోస్ ఎన్‌టీ ఆపరేటింగ్ సిస్టం ప్రాజెక్టులో పని చేశారు. సంస్థకు అత్యధిక లాభాలనిచ్చే సర్వర్ టూల్ బిజినెస్, అత్యధిక నష్టాలనిచ్చే బింగ్ బిజినెస్ రెండింటి బాధ్యతలూ నిర్వహించారు. భవిష్యత్తు ప్రపంచ టెక్నాలజీగా భావిస్తున్న 'క్లౌడ్' (ప్రత్యేకంగా 'అజూర్')పై పూర్తి పట్టుంది. క్రికెట్ మ్యాచ్‌లు చాలా ఇష్టంగా చూస్తారు. సత్య తల్లి పేరు ప్రభావతి. తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే ఉంటారు.

సత్య కుటుంబం తరుచూగా హైదరాబాద్ వస్తుంది. సత్య నాదేళ్ల ఆల్ రౌండర్. నిజాయతీపరుడు, సహాయకారి, సాంకేతిక నిపుణుడు, ఆలోచనాపరుడు, దార్శనికుడు, ఆత్మవిశ్వాసం గల నాయకుడు. సాధాసీదాగా ఉంటారు. ఎదుటి వారు చెప్పేది శ్రద్ధగా వింటారు. ఈ స్వభావాలే ఆయన్ని అందలానికి చేర్చాయంటారు సన్నిహితులు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చురుగ్గా మెలిగేవాడు. స్కూల్ క్రికెట్ టీంలో సత్య కూడా సభ్యుడే.

బృందంతో సమన్వయంగా వ్యవహరించడం, నాయకత్వ లక్షణాలను క్రికెట్ నుంచే నేర్చుకున్నట్లు ఆయన ఇప్పటికీ చెబుతుంటారు. హెచ్‌పిఎస్ పూర్వ విద్యార్థుల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. గత ఏడాది జరిగిన స్కూల్ 90వ వార్షికోత్సవంలో కూడా సత్య పాల్గొన్నారు. మైక్రోసాఫ్ట్ సహకారంతో ప్రస్తుతం స్కూలులో విద్యార్థుల కోసం ఓ ప్రాజెక్టును కూడా నిర్వహిస్తున్నారు. పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదివారు.

1988లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బిఈ పూర్తి చేశారు. అమెరికాలోని విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, చికాగో యూనివర్సిటీ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లోనూ మాస్టర్స్ డిగ్రీ చేశారు. కొంతకాలం సన్ మైక్రో సిస్టమ్స్‌లో పనిచేసిన తర్వాత 1992లో మైక్రోసాఫ్ట్‌లోకి అడుగుపెట్టారు. వ్యాపార సేవల విభాగంలో కీలక పాత్ర పోషించి ఐదేళ్లలోనే కంపెనీ వ్యాపారాన్ని దాదాపు రూ.9 వేల కోట్ల నుంచి రూ.31 వేల కోట్లకు చేర్చారు.

తాను హైదరాబాదులో పెరిగానని, అది తనను ఎంతగానో ప్రభావితం చేసిందని సత్య నాదెళ్ల చెబుతుంటారు. హైదరాబాదు పబ్లిక్ స్కూల్లో చదివిన సమయంలో క్రికెట్ ఆడేవాడినని, అది తనకు టీంతో ఎలా పని చేయాలో నేర్పిందని, నాయకత్వ లక్షణాలు నేర్పించిందని అంటారు. కాగా, సత్య నాదెళ్ల పూర్తి పేరు నాదెళ్ల సత్యనారాయణ చౌదరి.

English summary

 Along with the appointment of India-born Satya Nadella as its CEO, Microsoft also announced on Tuesday that its charismatic cofounder Bill Gates would step down from his ceremonial post of board chairman to "devote more time to the company" and to support Nadella "in shaping technology and product direction".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X