వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాక్ దూల తీరింది... కశ్మీర్ హింసకు ఆధారాలు లేవన్న పాకిస్థాన్ ఐసిజే న్యాయవాది..!

|
Google Oneindia TeluguNews

కశ్మీర్ సమస్యపై భారత దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో దోషిగా నిలబెట్టాలని పాకిస్థన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా దెబ్బతీస్తున్నాయి.ఇప్పటికే కశ్మీర్ సమస్యపై అంతర్జాతీయ దేశాల అధ్యక్షులకు మొరపెట్టుకున్న పాకిస్థాన్‌ను అన్ని చోట్ల చుక్కెదురైంది. ఇతర దేశాలే కాదు అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడ పాకిస్థాన్‌కు ఎదురుదెబ్బ తగులుతోంది. ఈ నేపథ్యంలోనే కశ్మీర్‌లో మారణహోమం జరుగుతుందంటూ పాకిస్థాన్ చేసిన చేస్తున్న ఆరోపణలకు ఎలాంటీ ఆధారాలు లేవని పాకిస్థాన్ తరుపున అంతర్జాతీయ న్యాయ స్థానంలో వాదిస్తున్న న్యాయవాది ఖావర్ ఖురేషి తేల్చిచెప్పాడు. దీంతో ఇమ్రాన్ ఖాన్ ఆశలపై ఐసిజే లాయర్ నీళ్లు చల్లినట్టైంది.

<strong>ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష .. నలుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు..చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్</strong> ఎమ్మెల్యే శ్రీదేవిపై కుల వివక్ష .. నలుగురు టీడీపీ నేతలపై అట్రాసిటీ కేసు..చంద్రబాబుపై ఎమ్మెల్యే ఫైర్

కశ్మీర్‌ లో మారణహోమం జరుగుతోంది...

కశ్మీర్‌ లో మారణహోమం జరుగుతోంది...


కశ్మీర్‌లో మారణహోమం, లేదా దాడులు జరుగుతున్నాయని ఎలాంటీ ఆధారాలు లేనప్పుడు అంతర్జాతీయ న్యాయస్థానం తీసుకెళ్లడం చాల కష్టం అని పాకిస్థాన్ తరఫున ఐసిజే వాదించే న్యాయవాది అన్న మాటలు ఇవి. దీంతో పాకిస్థాన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానంలో కూడ కేసులు వేసేందుకు అవకాశం లేకుండా పోయింది. ఇప్పటికే కశ్మీర్ అంశాన్ని ఐక్యారాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లిన పాకిస్థాన్ అక్కడ సరైన మద్దతు లభించకపోవడంతో అంతర్జాతీయ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది.

 మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ కోరిన పాకిస్థాన్,

మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ కోరిన పాకిస్థాన్,

కశ్మీర్ అంశంపై మధ్యవర్తత్వం వహించాలని అమేరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను, కోరిన విషయం తెలిసిందే.దీంతోపాటు తమకు మద్దతు ఇవ్వాలంటూ అనేక దేశాల మద్దతును కోరాడు. అయితే ఇటివల ఫ్రాన్స్‌లో జరిగిన జీ7 దేశాల సదస్సులో ప్రధాని మోడీ ట్రంప్‌తో భేటి అయ్యారు. ఆ తర్వాత కశ్మీర్ సమస్య భారతదేశం మరియు పాకిస్థాన్ దేశాల ద్వైపాక్షిక అంశమని ఇతర దేశాల మధ్యవర్తిత్వం అవసరం లేదని మోడిని కోరిన నేపథ్యంలోనే ట్రంప్ సైతం అంగీకరించారు. దీంతో ప్రపంచదేశాల్లో పెద్దన్న పాత్ర వహించే అమేరికా మద్దతు లభించకపోవడంతో పాకిస్థాన్ ఐసిజేను ఆశ్రయించింది.

 రాహుల్ గాంధీ, హర్యాణ సీఎంల వ్యాఖ్యలతో లేఖ

రాహుల్ గాంధీ, హర్యాణ సీఎంల వ్యాఖ్యలతో లేఖ

కాగా పాకిస్థాన్ కొద్ది రోజుల క్రితం యూఎన్ఓ లేఖ రాసిన అంశంలో కూడ సరైన ఆధారాలు చూపించలేక పోయింది. కశ్మీర్‌లో హింస జరిగిందనేదానికి భారత దేశ నేతలు చేసిన వ్యాఖ్యలనే కోడ్ చేస్తూ లేఖ రాసింది. కశ్మీర్‌లో మానవ హక్కులు హరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దీంతో పాటు హర్యాణ ముఖ్యమంత్రి ఖత్తార్ కూడ కశ్మీర్ యువతులను పెళ్లీలు చేసుకోవచ్చంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో వీళ్లు చేసిన వ్యాఖ్యలనే ఆధారాలుగా చూపిస్తూ పాకిస్థాన్ లేఖ రాసింది. కాని పాకస్థాన్ వద్ద ఎలాంటీ ఆధారాలు లేకపోవడంతో పాక్ మరోసారి గట్టిడెబ్బ తగలనుంది.

English summary
Pakistan's lawyer in the International Court of Justice (ICJ) has managed to embarrass Pakistan PM Imran Khan's hopes of pulling up India over the Kashmir issue. ICJ lawyer Khawar Qureshi has admitted that there is no significant evidence to back its claims of genocide in Kashmir.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X