• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నియంత నోట..యుద్ధం మాట: సెకెండ్ కొరియన్ వార్: మా బలాలు అవే: జోలికి రావట్లేదు

|

ప్యాంగ్యాంగ్: ఆధునిక నియంతగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఉత్తర కొరియా అధినేత కిమ్‌జొంగ్ ఉన్ నోట.. యుద్ధం మాట వినిపించింది. కొరియన్ వార్.. న్యూక్లియర్ వెపన్స్ వంటి పదాలు ఆయన నోటి వెంట వెలువడ్డాయి. అణ్వస్త్రాలను కలిగి ఉన్న శక్తిమంతమైన దేశంగా ఉత్తర కొరియా ఆవిర్భవించిందని, అందుకే తమ జోలికి ఎవరూ రావట్లేదని అన్నారు. ఈ పరిస్థితి ఏర్పడినందుకు న్యూక్లియర్ వెపన్లకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సి ఉంటుందని చెప్పారు.

ఉత్తర కొరియాలో తొలి కరోనా కేసు: వైరస్ లక్షణాలతో: నియంత కిమ్‌జొంగ్ ఏం చేశాడో తెలుసా?

కొరియన్ వార్ వార్షికోత్సవంలో..

కొరియన్ వార్ వార్షికోత్సవంలో..

1950-53 మధ్య కొనసాగిన కొరియన్ వార్ ముగిసి సోమవారం నాటికి 67 సంవత్సాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆర్మీ ఉన్నతాధికారులు, కొరియన్ యుద్ధంలో పాల్గొన్న వెటరన్స్‌తో కిమ్‌జొంగ్ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలతో కూడిన ప్రత్యేక కథనాన్ని కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ ప్రచురించింది. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. అగ్రరాజ్యం అమెరికా సైతం తమ జోలికి రావడానికి వెనుకాడుతోందని పరోక్షంగా చెప్పారు.

అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా..

అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా..

దీనికి ప్రధాన కారణం- అణ్వస్త్ర రంగంలో శక్తిమంతంగా ఎదగడమే ప్రధాన కారణమని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు అణ్వస్త్రాలను కలిగి ఉండటం ఒకరకంగా మంచిదేనని కిమ్ వ్యాఖ్యానించారు. యుద్ధమంటూ ఏర్పడితే అణ్వస్త్రాలను వినియోగించాల్సిన అవసరం తప్పక వస్తుందని, అది వినాశనాన్ని సృష్టిస్తుందని వ్యాఖ్యానించారు. న్యూక్లియర్ వెపన్స్ మిగిల్చే విధ్వంస పరిస్థితులను దృష్టిలో ఉంచుకోవడం వల్లే ఏ ఒక్క దేశం కూడా యుద్ధానికి సన్నద్ధం కావట్లేదని అన్నారు.

దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవడానికే

దౌత్యపరంగా సమస్యలను పరిష్కరించుకోవడానికే

దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను దౌత్యపరంగా పరిష్కరించుకోవడం వైపే మొగ్గు చూపుతున్నారని కిమ్‌జొంగ్ చెప్పుకొచ్చారు. సెకెండ్ కొరియన్ వార్ ఆవిర్భవించకపోవడానికి న్యూక్లియర్ వెపన్లే ప్రధాన కారణమని కిమ్ వ్యాఖ్యానించారు. యుద్ధాలను నివారించగలిగే శక్తి న్యూక్లియర్ వెపన్లకు ఉన్నాయనే విషయాన్ని తాను నమ్ముతున్నానని అన్నారు. తమతో యుద్ధానికి కాలుదువ్వే సాహసం పొరుగు దేశం చేయట్లేదని ఆయన దక్షిణ కొరియాను పరోక్షంగా ఉటంకించారు. అత్యంత శక్తిమంతం, అత్యాధునికమైన అణ్వస్త్రాలు దేశానికి రక్షణగా నిలిచాయని ఎలాంటి శక్తులనైనా ఎదిరించేలా ఉత్తర కొరియాను తయారు చేశాయని అన్నారు.

  India Extends Medical Support Of $1 mn To North Korea | కష్టకాలంలో ఉత్తరకొరియాకు ఆపన్నహస్తం !!
   అత్యాధునిక అణ్వస్త్రాలు..

  అత్యాధునిక అణ్వస్త్రాలు..

  సమీప భవిష్యత్తులో రెండో కొరియన్ యుద్ధం ఏర్పడే అవకాశమే లేదని చెప్పారు. తమ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కిమ్‌జొంగ్ ఉన్ మధ్య ఈ ఏడాది ఎలాంటి సమావేశాలు ఉండబోవంటూ కొద్దిరోజుల కిందటే అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. 2018 తరువాత వారిద్దరి మధ్య ఈ ఏడాది మరోసారి భేటీ కావాల్సి ఉంది. దీన్ని రద్దు చేయడం ఒకరకంగా కిమ్‌జొంగ్‌కు అసహనాన్ని తెప్పించిందని, అందుకే అమెరికాను సైతం ఆయన పరోక్షంగా విమర్శించి ఉండొచ్చని చెబుతున్నారు.

  English summary
  North Korea leader Kim Jong Un said his countrys hard-won nuclear weapons were a solid security guarantee and a reliable, effective deterrent that could prevent a second Korean War, state media reported Tuesday. Kim's comments before war veterans marking the 67th anniversary of the end of the 1950-53 Korean War again show he has no intention of abandoning his weapons as prospects dim for resuming diplomacy with the United States.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X