వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూర్యుడి అంతం వరకు ఉండే జీవి ఇదే!

మిగతా నక్షత్రాల్లా సూర్యుడికి నిర్దిష్ట జీవిత కాలం ఉంది. అది ముగిశాక సూపర్ నోవా ద్వారా అంతమవుతుంది. ఈ పరిణామానికి చాలా ముందే మానవులు సహా జీవజాలం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటి వరకు భావించారు.

|
Google Oneindia TeluguNews

లండన్: మిగతా నక్షత్రాల్లా సూర్యుడికి నిర్దిష్ట జీవిత కాలం ఉంది. అది ముగిశాక సూపర్ నోవా ద్వారా అంతమవుతుంది. ఈ పరిణామానికి చాలా ముందే మానవులు సహా జీవజాలం మొత్తం తుడిచిపెట్టుకుపోతుందని ఇప్పటి వరకు భావించారు.

అయితే, నీటి ఎలుగుబంటిగా వ్యవహరించే టార్డిగ్రేడ్లు మాత్రం సూర్యుడు అంతమయ్యే వరకు ఉంటాయని పరిశోధనలో వెల్లడయింది. మరో వెయ్యి కోట్ల ఏళ్ల వరకు ఇవి ఉండనున్నాయి. వీటిని నిర్మూలించే పరిణామం ఏదీ లేదని గుర్తించారు.

These animals can survive until the end of the Earth, astrophysicists say

భూమిపై ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కోగల జీవిగా బొద్దింకను చెబుతారు. వీటికన్నా టార్డిగ్రేడ్లు చాలా దృఢమైనవని అధ్యయనంలో వెల్లడయింది. టార్డిగ్రేడ్లు నీటిలో జీవిస్తాయి. ఎనిమిది కాళ్లు ఉంటాయి. ఇది అర మిల్లీ మీటరు పెరుగుతుంది.

ఆహారం, నీళ్లు లేకుండా ముప్పై ఏళ్లు కూడా జీవించగలదని ఆక్స్‌ఫర్డ్, హార్వార్డ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. 150 డిగ్రీల సెల్సియస్ వేడిని తట్టుకోగలవు. ఎంతో రేడియో ధార్మికతను తట్టుకోగలవు. సగటున 60 ఏళ్లు జీవిస్తాయి.

అయితే, సముద్రాలు ఆవిరయ్యే ఉష్ణాన్ని కలిగించే పరిస్థితులు మాత్రమే టార్డిగ్రేడ్లను నిర్మూలించగలవు. ఇవి గ్రహ శకలాల దాడిని కూడా తట్టుకోగలవని గుర్తించారు.

English summary
Tardigrades have a reputation as the toughest animals on the planet. Some of these microscopic invertebrates shrug off temperatures of minus 272 Celsius, one degree warmer than absolute zero. Other species can endure powerful radiation and the vacuum of space. In 2007, the European Space Agency sent 3,000 animals into low Earth orbit, where the tardigrades survived for 12 days on the outside of the capsule.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X