వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వికీపీడియాలో టాప్15 ఎడిటెడ్ అంశాల్లో భారత్, బ్రిట్నీ

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: వికీపీడియా ప్రారంభించి పదిహేనేళ్లు పూర్తయ్యాయి. ఇందులో ఏ అంశం గురించి అయినా సమాచారం దొరుకుతుంది. వికీపీడియా ప్రారంభించి పదిహేనేళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్కువసార్లు ఎడిట్ చేసిన అంశాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ వెల్లడించింది.

అందరికంటే ఎక్కువగా అమెరికా మాజీ అధ్యక్షులు జార్జ్ డబ్ల్యు బుష్‌కు సంబంధించిన పేజీ ఎక్కువ ఎడిట్ అయింది. ఆ తర్వాత పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్, హిట్లర్ తదితరాలు నిలిచాయి. భారత్ (ఇండియా) కూడా ఎక్కువసార్లు ఎడిట్ అయింది.

These are the top 15 most edited Wikipedia pages of all time

టాప్ 15 అంశాల వివరాలు... జార్జ్ డబ్ల్యూ బుష్ 45,862 సార్లు, డబ్ల్యూడబ్ల్యూఈ వ్యక్తుల జాబితా 42,836సార్లు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 35,742 సార్లు, వికీపీడియా 33,958 సార్లు, మైకేల్‌ జాక్సన్‌ 28,152 సార్లు ఎడిట్ అయి టాప్ 5 అంశాలుగా నిలిచాయి.

క్యాథలిక్‌ చర్చ్ 26,421 సార్లు, ఏబీఎస్ సీబీఎన్‌లో కార్యక్రమాలు 25,188 సార్లు, ఏసుక్రీస్తు 25,084 సార్లు, బరాక్‌ ఒబామా 24,708 సార్లు, హిట్లర్ 24,612 సార్లు, బ్రిట్నీ స్పియర్ 23,802 సార్లు, రెండో ప్రపంచ యుద్ధం 23,739 సార్లు, 2013లో మరణాలు 23,802 సార్లు, ది బీటిల్స్ 22,399 సార్లు, భారత్ 22,271సార్లు ఎడిట్ అయింది.

English summary
Online encyclopaedia Wikipedia has marked its 15th birthday with a list of the most edited pages on the site.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X