వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాలివే..

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: 2019 సంవత్సరానికి గాను ప్రపంచంలో అత్యంత నివాస యోగ్యమైన నగరాల జాబితాను ది ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ విడుదల చేసింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా వరుసగా రెండోసారి అగ్రస్థానంలో నిలిచింది. దాదాపు ఏడేళ్లపాటు తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ నగరాన్ని వెనక్కి నెట్టి 2018లో అగ్రస్థానానికి చేరిన వియన్నా ఆ స్థానాన్ని మళ్లీ ఈ ఏడాది కూడా దక్కించుకుంది.

టాప్‌లో వియన్నా..

టాప్‌లో వియన్నా..

వియన్నా మొదటి స్థానంలో ఉండగా.. మెల్బోర్న్, సిడ్నీ, ఒసాకా, కాల్గరీ, వాంకోవర్, టోరంటో, టోక్యో, కోపెన్‌హాగన్, అడిలాయడ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ సర్వేను మొత్తం 140 నగరాల్లో నిర్వహించారు. జీవన ప్రమాణస్థాయి, నేరాల నమోదు, ప్రయాణ, మౌలిక సదుపాయాల కల్పన, విద్య, వైద్యం, రాజకీయ, ఆర్థిక స్థిరత్వం లాంటి అంశాలను ఆధారంగా చేసుకుని ఈ జాబితాను రూపొందించారు.

పాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతిపాకిస్థాన్: కిడ్నాప్, మతం మార్చి పెళ్లి: ఎట్టకేలకు క్షేమంగా ఇల్లు చేరిన సిక్కు యువతి

అనువైన ప్రాంతాలు..

అనువైన ప్రాంతాలు..


ఈసారి పర్యావరణ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవడం గమనార్హం. ప్రాంతాల వారీగా పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికాలు నివాసానికి అనువైన ప్రాంతాలుగా పేర్కొంది. కాగా, తొలి 20 నగరాల్లో 8 ఐరోపా దేశాలే ఉండటం గమనార్హం. అయితే పర్యాటక నగరంగా పేరున్న ప్యారిస్ మాత్రం 8 స్థానాలు దిగజారి 25వ స్థానంలో నిలిచింది.

100లో మన నగరం ఒక్కటీ లేదు..

100లో మన నగరం ఒక్కటీ లేదు..

అత్యంత నివాస యోగ్యమైన సూచీలో తొలి 100 నగరాల్లో భారతదేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేకపోవడం గమనార్హం. గత ఏడాది 112వ స్థానంలో నిలిచిన ఢిల్లీ మరింత దిగజారి 118వ స్థానానికి చేరింది. ముంబై కూడా 117వ స్థానం నుంచి 119కి దిగజారింది.
మరే ఇతర నగరాలు కూడా చెప్పుకోదగ్గ స్థానంలో లేవు.

చివరి స్థానంలో ఈ నగరాలు..

చివరి స్థానంలో ఈ నగరాలు..


ఇక ఫైనాన్షియల్ హబ్స్‌గా చెప్పుకునే లండన్, న్యూయార్క్ నగరాలు వరుసగా 48, 58వ స్థానాలు దక్కించుకున్నాయి. ఉగ్రవాదుల బాంబు మోతాలతో మారుమోగే సిరియా రాజధాని డమస్కస్ చివరిస్థానంలో నిలిచింది. ట్రిపోలి, ఢాకా, కరాచీ దానికి ముందు స్థానాల్లో ఉన్నాయి.

English summary
Vienna took the No. 1 spot in the Economist Intelligence Unit’s liveability ranking for the second year running, confirming that life is officially better on the banks of the Danube than it is by the Yarra River in Melbourne, which took second place.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X