వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్ష ఆర్మీ తయారుచేస్తున్న చైనా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం అంతరిక్షంపై అజమాయిషీ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచంలో నెంబర్ వన్‌గా నిలవాలని కాంక్షించే చైనా కూడా ఈ విషయంలో తానేమీ వెనకలేనని నిరూపిస్తోంది. సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలో అన్ని దేశాల కన్నా ముందుండే డ్రాగన్ కంట్రీ అంతరిక్షంపై పెత్తనం కోసం పెద్ద ప్రణాళికనే సిద్ధంచేసింది. శత్రుదేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ అంతరిక్ష ఆర్మీని తయారు చేస్తోంది.

చైనా అంతరిక్ష ఆర్మీ

చైనా అంతరిక్ష ఆర్మీ

శత్రువులకు ముచ్చెమటలు పట్టించే మూడు ఆయుధాల తయారీలో చైనా బిజీగా ఉంది. ఇతర దేశాల ఉపగ్రహాలను నాశనం చేసే లేదా పనిచేయకుండా డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్, మొబైల్ పల్స్ నరేటర్స్, ఎలక్ట్రోమాగ్నటిక్ పల్సెస్ అనే మూడు టెక్నాలజీల తయారీలో దూసుకుపోతోంది. ఈ మూడింటి శక్తిని ఎవరూ ఊహించలేరని నిపుణులు అంటున్నారు. ఇలాంటి ఆయుధాల తయారీలో అమెరికా ఇప్పటికే ఒక అడుగు ముందుండగా.. తాజాగా చైనాలోనూ అలాంటి బేస్‌లే కనిపిస్తున్నాయి.

శాటిలైట్ ట్రాకింగ్‌లో నెంబర్ వన్

శాటిలైట్ ట్రాకింగ్‌లో నెంబర్ వన్

శాటిలైట్స్ ట్రాకింగ్‌లో చైనా ప్రపంచదేశాలన్నింటి కన్నా ముందుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ట్రాకింగ్ సెంటర్లు ఏర్పాటు చేయగా.. టిబెట్ లోని ఎన్గరీ ఇందులో ఒకటి. ప్రతి శాటిలైట్ కు చెందిన సమాచారాన్ని ఈ సెంటర్ అందిస్తుంది. ఆ తర్వాతి పనిని డైరెక్ట్ ఎనర్జీ వెపన్స్..డీఈడబ్ల్యూ చూసుకుంటుంది. చైనాలో ప్రస్తుతం ఐదు డీఈడబ్ల్యూ సెంటర్లున్నాయి. వీటిలో జిన్జియాంగ్ లోని బేస్ ఒకటి. ఇక్కడ ఉన్న నాలుగు బిల్డింగుల సైజును బట్టి కెమికల్ లేజర్లు, నియోడిమియం లోహాలను ఆయుధాల్లో వాడుతున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

ఆయుధాలపై ఒత్తిడి పెంచే ఈఎంపీ

ఆయుధాలపై ఒత్తిడి పెంచే ఈఎంపీ

చైనా జిన్ జియాంగ్ పర్వతాల్లో ఎలక్ట్రో మాగ్నటిక్ పల్సెస్ ను ఏర్పాటు చేసింది. భారీ పర్వతానికి పెద్ద కలుగు చేసి లోపల పెద్ద పెద్ద స్తంభాలపై ఎలక్ట్రో మాగ్నటిక్ పల్సెస్ పరికరాలు అమర్చింది. అతి శక్తివంతమైన ఈ పల్సెస్ ఆయుధాలపై అధిక ఒత్తిడి కలిగిస్తాయి. ఇలాంటి బేస్ అమెరికాలోని మేరీల్యాండ్ నావల్ ఎయిర్ స్టేషన్ లో ఉంది. ప్రస్తుతం చైనా తన వద్ద ఉన్న ఆయుధాలను మరింత శక్తివంతంగ మార్చేందుకు ఈఎంపీని డెవలప్ చేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

భారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిందో..! పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరికభారత్‌పై మరో ఉగ్రదాడి జరిగిందో..! పాకిస్థాన్ కు అమెరికా హెచ్చరిక

శాటిలైట్లను నిర్వీర్యం చేసే ఎంపీజీ

శాటిలైట్లను నిర్వీర్యం చేసే ఎంపీజీ

శత్రుదేశాల శాటిలైట్లను క్షణాల్లో పనిచేయకుండా చేయగల సత్తా ఎంపీజీకి ఉంది. వీటిని కూడా చైనా జిన్జియాంగ్ లోనే ఏర్పాటు చేసింది. ఇవి నాన్ న్యూక్లియర్ పల్స్ జనరేటర్స్ గా పనిచేస్తాయి. ఎలక్ట్రోమాగ్నటిక్ తరంగాలను సృష్టిస్తూ ఉపగ్రహాలను పనిచేయకుండా చేస్తాయి.

English summary
China has made great advancements in future weapons systems, many of which suggest that the Asian giant is planning a lethal battle against its adversaries, especially when it comes to space denial and disabling or destroying satellites.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X