వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరిహద్దులో 60వేల మంది చైనా సైనికులు..భారత్‌కు వెన్నుదన్నుగా అమెరికా...

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు అమెరికా వెన్నుదన్నుగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్ పాంపియో. భారత్ సరిహద్దులో చైనా భారీగా బలగాలను మోహరిస్తోందని... ఇప్పటివరకూ దాపు 60వేల మంది సైన్యాన్ని మోహరించిందన్నారు. ఇలాంటి తరుణంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ట్రంప్ నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ఏర్పడిన మిత్రుత్వం ఎలాంటి ముప్పునైనా తిప్పికొట్టగలదన్నారు.

ఢిల్లీకి మైక్ పాంపియో...

ఢిల్లీకి మైక్ పాంపియో...

ఇటీవల జపాన్‌లోని టోక్యో వేదికగా భారత్,ఆస్ట్రేలియా,జపాన్,అమెరికా మధ్య జరిగిన 'క్వాడ్' సమావేశంలోనూ మైక్ పాంపియో చైనాపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చైనా ఆధిపత్య ప్రయత్నాలను సమిష్టిగా ఎదుర్కోవాలని ఆ సమావేశంలో పాంపియో అభిప్రాయపడ్డారు. క్వాడ్ సమావేశానికి కొనసాగింపుగా త్వరలోనే ఢిల్లీకి వచ్చి భారత విదేశాంగ మంత్రి జైశంకర్,రక్షణ శాఖ సెక్రటరీలతో మైక్ పాంపియో సమావేశం కానున్నారు.మైక్ పాంపియోతో పాటు అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి మార్క్ ఎస్పర్ కూడా భారత పర్యటనకు రానున్నారు.

స్పందించిన భారత రాయబారి...

స్పందించిన భారత రాయబారి...

భారత్‌లో అమెరికా రాయబారి తరణ్‌జిత్ సింగ్ సాధు తాజా పరిణామాలపై స్పందించారు. భారత్-అమెరికా మధ్య సంబంధాలు వేగంగా బలపడుతున్నాయని... దీన్ని చైనాతో మాత్రమే ముడిపెట్టకుండా మరింత విస్తృత కోణంలో చూడాల్సి ఉంటుందన్నారు. మైక్ పాంపియో భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల బలోపేతంపై చర్చలు జరిగే అవకాశం ఉందన్నారు. రక్షణ శాఖ సహాయ సహకారాలకు సంబంధించి మున్ముందు మరింత సత్సంబంధాలు నెలకొంటాయని అన్నారు.

డ్రాగన్‌కు చుక్కలే...

డ్రాగన్‌కు చుక్కలే...

ఈ ఏడాది జూన్ జూన్ 25న తూర్పు లదాఖ్‌లో భారత్-చైనా మధ్య చోటు చేసుకున్న హింసాత్మక ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇరు దేశాల సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. సైన్యం ఉపసంహరింపుకు,ఉద్రిక్తతలను తగ్గించడానికి ఓవైపు చర్చలు జరుగుతున్నా పెద్దగా పురోగతి కనిపించట్లేదు. ఇప్పటికీ వాస్తవాధీన రేఖ వెంబడి చైనా తమ బలగాలను మోహరిస్తూనే ఉండటంతో మున్ముందు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న ఆందోళన నెలకొంది. అయితే సరిహద్దులో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్దంగా భారత్ సమాయత్తమవుతోంది. ఈ క్రమంలో భారత్‌కు అండగా నిలిచేందుకు అమెరికా కూడా ముందుకు రావడం గమనార్హం. చైనాను ఎదుర్కొనేందుకు భారత్‌తో అమెరికా కలిసొస్తే డ్రాగన్‌కు చుక్కలే అనడంలో అతిశయోక్తి లేదు.

English summary
US Secretary of State Mike Pompeo on Friday urged closer ties with India as he warned of China's growing might on its doorstep, amid a flurry of diplomacy between the world's two largest democracies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X