వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

షాపులో చోరీకి వచ్చి.. బామ్మ డబ్బులిస్తా అంటే వద్దని... నుదుటన ముద్దుపెట్టి.... (వీడియో)

దొంగలలో కొందరు మంచి దొంగలు కూడా ఉంటారు. మంచి అంటే వారు కూడా దొంగలే కానీ కాస్త మానవత్వం ఉంటుంది. ఇతర దొంగల్లా పైశాచికంగా ప్రవర్తించరు. సాధారణ ప్రజలను ఇబ్బంది పెట్టకుండా తమ లక్ష్యంపైనే ఫోకస్ చేస్తుంటారు. అచ్చంగా బ్రెజిల్‌‌లో కూడా ఇలాగే జరిగింది. మంగళవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ దొంగ, బామ్మ సంభాషణ చర్చకు దారితీసింది.

అదరలేదు.. బెదరలేదు..

అదరలేదు.. బెదరలేదు..

మంగళవారం మధ్యాహ్నం.. బ్రెజిల్ వీధిలో గల జీ 1 ఫార్మాసీ షాపులో కొందరు జనం ఉన్నారు. తమకు కావాలసిన మందులను కొనుగోలు చేస్తున్నారు. అంతా స్తబ్ధుగా ఉండగా.. అప్పుడే ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఇంకేముంది అక్కడ ఉన్న వారు ఆందోళనకు గురయ్యారు. కానీ ఓ బామ్మ మాత్రం అదరకుండా బెదరకుండా ఉండిపోయింది.

దొంగతో మాటలు

దొంగతో మాటలు

ఇంతలో ఓ దొంగతో ఆమె మాటలు కలిపింది. తన వద్ద ఉన్న నగదును తీసుకోవాలని కోరింది. కానీ ఆ దొంగ అందుకు నిరాకరించాడు. తనకు మీ డబ్బులు వద్దని చెప్పాడు. తనపై మమకారం చూపించిన బామ్మ నుదుటున ముద్దు కూడా పెట్టాడు. అది కాస్త సీసీటీవీలో రికార్డైంది. తర్వాత కొందరు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఆ దొంగ మంచి దొంగ అని.. అతనికి సాధారణ జనంపై అభిమానం అని కామెంట్లు పెడుతున్నారు.

మీ డబ్బులొద్దు

ఆ తర్వాత బామ్మతో దొంగ మాట్లాడినట్టు స్థానిక మీడియా పేర్కొంది. డబ్బులు ఇవ్వబోతే తనకు మీ డబ్బులు వద్దని చెప్పినట్టు తెలుస్తోంది. కానీ మీరు నిశ్శబ్దంగా ఉండాలని మాత్రం కోరారు. వీరి మధ్య సంభాషణ చర్చకు దారితీసింది. ఆ దొంగ మనసున్న మంచి వాడని కొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు తన బామ్మ అనుకున్నారో ఏమో అంటూ ట్వీట్లు చేస్తున్నారు.

240 డాలర్లు, వస్తువులు కూడా

240 డాలర్లు, వస్తువులు కూడా

ఆ షాపు నుంచి 240 డాలర్ల నగదు, ఇతర వస్తువులను దొంగలు దోచుకెళ్లారు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారికి మాస్క్ ఉండటంతో పట్టుకోవడానికి ప్రతిబంధకంగా మారింది. కానీ ఇద్దరు దొంగలను త్వరలోనే పట్టుకుంటామని బ్రెజిల్ పోలీసులు చెప్తున్నారు.

English summary
elderly woman was visiting a pharmacy near her home in Brazil and as fate would have it, two robbers invaded the store at that time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X