వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రేమంటే ఇదేనేమో: ఈ 98 ఏళ్ల పెద్దాయన రోజు 6మైళ్ల దూరం నడిచివెళతాడు..ఎందుకో తెలుసా?

|
Google Oneindia TeluguNews

మీకిష్టమైన వారు కష్టాల్లో ఉన్నారని తెలిసి మీరెంత దూరం వారికోసం వెళ్లగలరు... ఒకే ఊరిలో ఉన్నప్పటికీ వారిని వెళ్లి కలవడం కష్టంగా భావిస్తాం కదూ. కానీ ఇక్కడ మాత్రం ఓ 98 ఏళ్ల పెద్దాయన తన భార్య కోసం ప్రతిరోజు ఆరుమైళ్లు నడిచి వెళతాడు. తన భార్య అంటే తనకు అంత ఇష్టం మరి. తన భార్యే ప్రపంచంగా ఇన్ని రోజులు బతికినట్లు ఈ పెద్దాయన చెబుతాడు. ఇంతకీ తన భార్య ఎక్కడుందనేగా మీ అనుమానం... అయితే ఇది చదవండి.

ఒక రోజు డాన్ బుక్ హార్ట్ అనే వ్యక్తి న్యూయార్క్‌లో కారులో వెళుతుండగా హైవేపై ఒక వ్యక్తి తారసపడ్డాడు. అతని ముఖంలో ఏదో కోల్పోయిన భావం కనిపించిందట. వెంటనే అతన్ని తన కారులోకి ఎక్కించుకున్నాడు డాన్ బుక్ హార్ట్. అయితే ఆ వ్యక్తి తన పేరైతే చెప్పలేదుగానీ తన కథను మాత్రం చెప్పాడట. తనకు 98 ఏళ్ల వయస్సు ఉందని... కొరియా యుద్ధం సమయంలో తాను నావికుడిగా పనిచేసినట్లు చెప్పుకొచ్చాడట. అయితే తాను రోజు ఇదే దారిలో దాదాపు ఆరుమైళ్లు నడుచుకుంటూ వెళతానని చెప్పాడట. ఎక్కడికి వెళతావని బుక్ హార్ట్ ఆ వ్యక్తిని ప్రశ్నించగా తాను హాస్పిటల్‌కు వెళుతున్నట్లు చెప్పాడట.

This 98 year old man walks 6 miles daily to visit his paralyzed wife in hospital

ఇంతకీ హాస్పిటల్‌కు ఎందుకు వెళుతున్నావు అని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు బుక్ హార్ట్. దానికి ఆ వ్యక్తి వద్ద నుంచి వచ్చిన సమాధానంతో షాక్‌కు గురయ్యాడు బుక్ హార్ట్. తన భార్య ఆస్పత్రిలో ఉందని తన కోసమే ఆరుమైళ్లు నడిచి వెళ్లి తిరిగి ఆరుమైళ్లు నడిచి ఇంటికి వెళతానని చెప్పాడట. తన భార్యకు 2009లో కేన్సర్ వచ్చిందని ఇక ఐదేళ్లకంటే ఎక్కువగా బతకదని డాక్టర్లు ఆరోజే చెప్పారని ఆ వ్యక్తి బుక్‌హార్ట్‌తో చెప్పాడు. కానీ డాక్టర్లు చెప్పినట్లుగా ఐదేళ్లు దాటింది. తన భార్య మాత్రం అలా మంచానికే పరిమితమైంది. తన భార్యే తన ప్రపంచమని ఆవ్యక్తి చెప్పాడట. కేవలం ఆమెను చూసేందుకే 98 ఏళ్ల వయస్సులో 12 మైళ్లు నడిచి వెళతాడట.

ఆ వ్యక్తి చెప్పని కథను డాన్ బుక్ హార్ట్ తన ఫేస్‌బుక్ పేజ్‌పై పోస్టు చేయడంతో ఈ కథకు అప్పుడే 3300 లైకులు, 1600 కామెంట్లు 7వేల షేర్లు వచ్చాయి. పోస్టు చేసిన కొద్ది గంటల్లోనే వైరల్ అయ్యింది. ఈ పోస్టును ఆ వ్యక్తి కూతురు లుతేటా కూడా చదివింది. వెంటనే ఆమె కూడా పోస్ట్ చేసింది. లుతేటా తల్లిని ఆమె తండ్రి ముద్దాడే ఫోటోలు, తన తండ్రితో దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. అయితే తన తండ్రికి నడవటం అంటే ఇష్టమని లుతేటా చెప్పుకొచ్చారు. తను ఈ వయస్సులో కూడా ఇంత ఆరోగ్యంగా ఉన్నాడంటే అందుకు కారణం రోజు తను 12 మైళ్లు నడవడమే అని ఆయన హెల్త్ సీక్రెట్ చెప్పింది. తన భార్య అంటే తనకు చాలా ఇష్టమని... ఆమె తన బెస్ట్ కప్ ఆఫ్ టీ అని పలుమార్లు చెప్పినట్లు గుర్తు చేసింది లుతేటా. తన కథను చదివిన చాలామంది విరాళాలు కూడా ఇచ్చారు. తన భార్య హాస్పిటల్ ఖర్చు కోసం విరాళాలు ఇప్పటికీ ఇస్తున్నారు కొందరు మనసున్న మారాజులు.

English summary
How far can you go for love without thinking about yourself? In the world full examples of betrayal and sadness, this 98-year-old man is setting an example of what love is all about and never fades away if you have the will and immense amount of love for your partner.On a regular day, a Dan Bookhart saw a man walking on the highway in Rochester, New York and picked him on his way. It was later that he found out that he 98-years-old who walks 6 miles daily to the hospital to visit his paralyzed wife in the hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X