వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిట్‌కాయిన్: రూ.10 లక్షలు, బిట్ కాయిన్ సృష్టికర్త ఎవరు, బ్యాంకుల ఆందోళన

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Bitcoins : బిట్ కాయిన్ అంటే అదన్నమాట !

లండన్: ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనంగా మారిన ప్రముఖ డిజిటల్‌ కరెన్సీ బిట్‌కాయిన్‌. రికార్డులు సృష్టిస్తోంది. ఈ డిజిటల్‌ కరెన్సీని కొనుగోలు చేయాలంటే మన కరెన్సీలో దాదాపు పది లక్షలు (రూ.9.90 లక్షలు) వెచ్చించాల్సిందే.

రోజుకో రికార్డు మైలురాయిని అధిగమిస్తూ వస్తున్న ఈ క్రిప్టో కరెన్సీ తాజాగా 15,000 డాలర్ల స్థాయికి చేరుకుంది. బుధవారం నాడు బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ విలువ 15,242.99 డాలర్ల వద్ద సరికొత్త ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది.

మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 12,000 డాలర్ల వద్ద సరికొత్త రికార్డును నమోదు చేసుకున్న ఈ కరెన్సీ.. మరుసటి రోజే ఏకంగా మూడు వేల డాలర్లకు పైగా ఎగబాకడం విశేషం. గడచిన వారం రోజుల్లో బిట్‌కాయిన్‌ విలువ 50 శాతానికి పైగా పుంజుకుంది.

 బిట్ కాయిన్ అంటే ఏమిటీ?

బిట్ కాయిన్ అంటే ఏమిటీ?

బిట్‌ కాయిన్‌.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దీని గురించే చర్చ సాగుతోంది. డిజిటల్‌ (క్రిప్టో) కరెన్సీగా దీన్ని వ్యవహరిస్తారు. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి.. ఆన్‌లైన్‌లో మాత్రమే బదిలీ చేయడానికి, విక్రయించడానికి వీలున్న కరెన్సీ . దీని ద్వారా వస్తువుల క్రయవిక్రయాలు నిర్వహించాలంటే కూడా ఆన్‌లైన్‌లోనే చేయాలి. ఇందుకు ప్రత్యేక వ్యాలెట్లు ఉంటాయి. బిట్‌కాయిన్‌పై సెంట్రల్‌ బ్యాంకుల నియంత్రణ ఉండదు. ఒక స్వతంత్ర వ్యవస్థ ఆధారంగా బలమైన కంప్యూటర్లు, సర్వర్ల సాయంతో దీని లావాదేవీలు జరుగుతుంటాయి.

 బిట్ కాయిన్ ఎవరు సృష్టించారు

బిట్ కాయిన్ ఎవరు సృష్టించారు

జపాన్‌కు చెందిన సతోషి నకమొతో ఈ బిట్‌కాయిన్‌ సృష్టికర్త. 2008లో కాగితం రూపంలో దీన్ని తీసుకొచ్చారని చెబుతుంటారు. అనంతరం డిజిటల్‌ రూపంలో వ్యక్తుల నుంచి వ్యక్తులకు మార్చుకునే కరెన్సీగా ఇది రూపాంతరం చెందిందని చెబుతారు. అయితే సతోషి ఎవరనే విషయంపై ఇప్పటికీ స్పష్టత లేదు. బిట్‌కాయిన్‌ను ఓ ఇంజినీర్ల బృందం రూపొందించిందని చెప్పేవాళ్లూ లేకపోలేదు. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

బిట్‌కాయిన్‌కు చట్టబద్దమైన మారకం రేటు లేదు

బిట్‌కాయిన్‌కు చట్టబద్దమైన మారకం రేటు లేదు

చిన్న ఎన్‌క్రిప్టెడ్‌ సాఫ్ట్‌వేర్‌ కోడ్‌కు ప్రతిరూపమైన ఈ డిజిటల్‌ కరెన్సీ 2009లో వెలుగులోకి వచ్చింది. ఇప్పటివరకైతే ఈ డిజిటల్‌ కరెన్సీని ఏ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ కూడా అధికారికంగా ఆమోదించలేదు. అంతేకాదు ఈ కరెన్సీ కొనుగోలుకు చట్టబద్ధమైన మారకం రేటు కూడా లేదు.ఈ ఏడాది జనవరిలో 752 డాలర్లుగా ఉన్న బిట్‌కాయిన్‌ విలువ గత నెలలో అనూహ్యంగా, అసాధారణ రీతిలో పెరుగుతూ వచ్చింది. సంప్రదాయక ఇన్వెస్టర్లలో ఈ కరెన్సీకి పెరుగుతున్న ఆదరణే ఇందుకు కారణమవుతున్నది.

 ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్యాంకులు

ఆందోళన వ్యక్తం చేస్తున్న బ్యాంకులు

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌తోపాటు పలు దేశాల బ్యాంకింగ్‌ నియంత్రణ మండళ్లు ఈ కరెన్సీ విలువ అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశాయి. బిట్‌కాయిన్‌ విలువలో బుడగ ఏర్పడుతున్నదని, అది ఏ సమయంలోనైనా విచ్ఛిన్నం కావచ్చని, ఇది ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా పరిణమించవచ్చని ఫెడ్‌ రిజర్వ్‌ హెచ్చరించింది. ‘‘బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ విలువ బ్రేకుల్లేని ట్రైన్‌లా పరుగెడుతున్నది'' అని సిడ్నీకి చెందిన ఎఎ్‌సఆర్‌ వెల్త్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి షేన్‌ చానెల్‌ అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లోకి భారీ సంఖ్యలో కొత్త ఇన్వెస్టర్లు వచ్చి చేరుతున్నారన్నారు. అయితే, ఇన్వెస్టర్లలో మోజు తగ్గగానే భారీ కరెక్షన్‌రావచ్చని షేన్‌ చానల్‌ హెచ్చరించారు.

 బిట్‌కాయిన్ ప్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడింగ్స్

బిట్‌కాయిన్ ప్యూచర్ కాంట్రాక్ట్ ట్రేడింగ్స్

షికాగో మర్కంటైల్‌ ఎక్స్చేంజ్‌‌లో ఈనెల 18 నుంచి బిట్‌కాయిన్‌ ఫ్యూచర్స్‌ కాంట్రాక్టుల ట్రేడింగ్‌ను ప్రారంభించనుంది. అమెరికా నియంత్రణ మండలి ‘కమోడిటీ ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ కమిషన్‌' గతవారమే ఎక్స్చేంజ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. సిబిఒఇ ఫ్యూచర్స్‌ ఎక్స్ఛేంజ్‌లో ఈ వారాంతం నుంచే బిట్‌కాయిన్‌ ట్రేడింగ్‌ ప్రారంభం కానుంది. ఈ కరెన్సీలో ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌ను ప్రవేశపెట్టనున్నట్లు గతనెలలో సిఎంఇ ప్రకటించడమే బిట్‌కాయిన్‌ విలువ శరవేగంగా పుంజుకోవడానికి ప్రధాన కారణమైంది.

 ఆర్భీఐ హెచ్చరికలు

ఆర్భీఐ హెచ్చరికలు

బిట్‌కాయిన్‌ వంటి వర్చువల్‌ కరెన్సీలో పెట్టుబడులపై ఆర్‌బిఐ మరోసారి హెచ్చరించింది. ఈ మధ్యకాలంలో డిజిటల్‌ కరెన్సీల విలువ అనూహ్యంగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కరెన్సీలో పెట్టుబడులకు సెంట్రల్‌ బ్యాంక్‌ నుంచి ఎలాంటి హామీ ఉండదని, స్వంత పూచీపైనే లావాదేవీలు జరపుకోవాలని గతంలో ఆర్‌బిఐ పేర్కొంది.బిట్‌కాయిన్‌ను అధికారిక ఆర్థిక స్రవంతిలో చేర్చడంపై పెద్దఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

English summary
One of the most extravagant predictions sees bitcoin at $1 million within three years. But that's a story for another time. Bitcoin, undoubtedly the most talked about asset class today, has spurted over 1,500 per cent on a year-date-basis so far and over 115 per cent in the past one month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X