వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ డాడ్: పిల్లలకోసం తల్లిలా ముస్తాబై స్కూలుకెళ్లిన తండ్రి..వర్త్ రీడింగ్

|
Google Oneindia TeluguNews

పిల్లలకు తల్లి లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది. తల్లే వారి ప్రపంచం. పిల్లలు కడుపులో పిండంగా ఏర్పడిననాటి నుంచి భూమిపై పడే వరకు వారి బాధ్యతను తల్లి తీసుకుంటుంది. తల్లి లేనిదే ఆ పసిపిల్లలకు లోకం ఏమిటో తెలియదు. జాబిల్లి చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది అమ్మే. బుడిబుడి నడకలు నేర్పేది అమ్మ. అమ్మ ప్రేమ పొందడమంటే పూర్వ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుని ఉంటేగాని అలాంటి తల్లి కడుపున మళ్లీ పుట్టరు. కానీ మీరు చదవబోయే కథలో మాత్రం నాన్నే ఈ పిల్లలకు సూపర్ హీరో. ఎందుకంటారా మొత్తం కథను చదివితే మీరు కదిలిపోతారు.. హ్యాట్సాఫ్ టూ దిస్ వండర్‌ఫుల్ డ్యాడ్ అని కూడా అంటారు.

ఇదిగో ఇక్కడ ఆడవాళ్ల గెటప్‌లో కనిపిస్తున్నది చాచాయ్ పనుథై అనే తండ్రి. ఇతనికి కొన్నేళ్ల కిందట వివాహమైంది. ఈ దంపతులకు ఓ ఐదేళ్ల బాబు, మూడేళ్ల పాప ఉన్నారు. ఈ పిల్లలకు అన్నీ తానే అయి చూసుకుంటున్నాడు. ఇక తల్లి ఏమైందనేగా మీ డౌటు... కథ చివరిలో చెబుతాం. థాయ్‌ల్యాండ్‌లో ఉంటున్నాడు చాచాయ్ పనుథై. తన పిల్లలు స్కూళ్లో చదువుతున్నారు. ఇక స్టోరీ ఇక్కడే ట్విస్ట్ తీసుకుంటుంది. 1976 నుంచి థాయ్‌లాండ్‌లో ప్రతి ఏటా ఆగష్టు 12న మదర్స్ డే జరుపుతారు. ఇది ఆదేశ రాణి సిర్కిట్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆరోజున మాత‌ృదినోత్సవం అక్కడ జరుపుతారు.

This dad dressed up like a woman for his children who dont have mother

ఆగష్టు 12న స్కూలుకెళ్లే పిల్లలంతా తమ తల్లులను తీసుకుని స్కూలుకు వెళతారు. అక్కడ తల్లులతో కొన్ని గేమ్స్ ఆడించడంతో పాటు వారు చెప్పే కబుర్లు వింటారు. అయితే చాచాయ్ పిల్లలకు తల్లి లేదు. కానీ ఆ పిల్లలకు ఆలోటు తెలియకూడదని భావించి తనే తల్లి గెటప్‌లో పిల్లలతో పాటు స్కూలుకు వెళ్లాడు. ఓ గౌన్ ధరించి అచ్చం తన భార్య ఎలాగైతే తయారవుతుందో అలానే రెడీ అయి పిల్లలతో పాటు స్కూలుకు వెళ్లి వారికి తల్లి లేని లోటును తీర్చాడు. శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ వారి తల్లి ఏమైందనేగా మీ డౌటు.. అది కూడా చాచాయ్ చెప్పాడు. తన భార్య తనకు విడాకులు ఇచ్చి యూరోప్‌కు వెళ్లిపోయిందని ఇక అప్పటి నుంచి తన ఇద్దరి పిల్లలకు తల్లి అయినా తండ్రి అయినా తనే నని చెప్పాడు. పిల్లల ఆనందం కోసమే ఇలా మహిళలా తయారై వచ్చానని చెప్పాడు చాచాయ్.

This dad dressed up like a woman for his children who dont have mother

చాచాయ్ మాటలకు అక్కడ చేరివచ్చిన ఇతర పిల్లల తల్లులు ఫిదా అయ్యారు. లేచి నిలబడి సెల్యూట్ చేశారు. అతనిపై ప్రశంసల వర్షం కురిపించారు. మరి మీరు ఒప్పుకుంటారా ఇతను ఒక సూపర్ డాడ్ అని...

English summary
Chatchai Panuthai, ‘Sam’ has two children - five-year-old Ozone and three-year-old Imsome - and lives in Thailand. To give you a context, Mother's Day in Thailand has been celebrated on August 12 since 1976 in honour of Her Majesty Queen Sirikit's birthday, the Mother of all Thai people.Single dad Chatchai 'Sam' Panuthai didn't want his sons, Imsome and Ozone to be left out of the festivities at school and so he dressed in gown - just like their mum.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X