• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదేం యాప్‌రా బాబూ...నిండుగా బట్టలు కప్పుకున్న వ్యక్తిని నగ్నంగా చూపించేస్తోంది..!

|

పెరుగుతున్న టెక్నాలజీతో కొత్తకొత్త యాప్‌లు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వారి అవసరాలకు అనుగుణంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. అయితే కొన్ని యాప్‌లు మాత్రం యువతను పెడదోవ పట్టిస్తున్నాయి. ఒకప్పుడు డీప్ ఫేక్స్ అనే యాప్ వచ్చింది. ఈ యాప్‌ ద్వారా ఇతర వ్యక్తులకు ఫేక్ కాల్స్ పంపడం వారిని ఆటపట్టించడంలాంటివి చేసే అవకాశం ఉంటుంది. ఇక కొత్తగా మరో యాప్ రాబోతోంది. అయితే ఇది మహిళలకు అసహ్యం కలిగించే యాప్. ఇప్పటికే ఈ యాప్ ఇంటర్నెట్‌లో నెటిజెన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. దీనిపై నెటిజెన్లు తెగ చర్చించుకుంటున్నారు.

 యాప్ ముందు వ్యక్తి ఫోటో ఉంచితే చాలు....

యాప్ ముందు వ్యక్తి ఫోటో ఉంచితే చాలు....

డీప్ నూడ్స్ యాప్...త్వరలో ఈ యాప్ ఎంట్రీ ఇవ్వనుంది. అన్ని యాప్‌లు ఉండగా ఈ యాప్‌పై ఎందుకంత ప్రత్యేక దృష్టి అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఈ యాప్ ప్రత్యేకించి మహిళల కోసమే డిజైన్ చేస్తున్నట్లు ఉన్నారు. కానీ ఈ యాప్ ఒక్క మహిళలకే కాదు అని కంపెనీ వివరిస్తోంది. నిండుగా దుస్తులు ధరించిన మహిళ ఈ యాప్‌ ఓపెన్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు నగ్నంగా కనిపిస్తుంది. ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది. పాశ్చాత్యదేశాల్లో ఇది వర్కౌట్ అవుతుందేమో కానీ.. సంప్రదాయాలు సంస్కృతులు చాలా కచ్చితంగా పాటించే భారత్‌లాంటి దేశాల్లో మాత్రం దీన్ని ప్రవేశంకు బ్రేకులు వేయక తప్పదు.

అప్లికేషన్ ఇలా పనిచేస్తుంది

అప్లికేషన్ ఇలా పనిచేస్తుంది

డీప్ న్యూడ్ అప్లికేషన్ ఇలా పనిచేస్తుంది. నిండుగా దుస్తులు ధరించి ఉన్న ఫోటోను యాప్ ముందు ఉంచితే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని నగ్నంగా చూపిస్తుంది. ఇప్పటికే సంస్థ యాప్‌ను టెస్ట్ చేసింది. స్పోర్ట్స్ మ్యాగజీన్ పై ఉన్న ఫోటోలను యాప్ ముందు ఉంచగా ఆ ఫోటోలోని క్రీడాకారిణి నగ్నంగా ఉన్న ఫోటో యాప్‌లో ప్రత్యక్షమవుతోంది. అయితే ప్రస్తుతానికి ఆ యాప్‌ వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఇంటర్నెట్‌ నుంచి తొలగించింది. ఇది వినియోగదారుల ఎంటర్‌టెయిన్మెంట్ కోసమే క్రియేట్ చేసినట్లు యాప్ కంపెనీ తెలిపింది.దీన్ని కొన్ని నెలల క్రితమే రూపొందించామని ప్రతినెలా కొన్ని సేల్స్ జరిగేవని వెల్లడించింది. అయితే టెస్టింగ్ సమయంలో అన్ని ఫోటోలకు ఇది పనిచేయడం లేదనే విషయాన్ని గ్రహించినట్లు చెప్పింది. అయితే యాప్ ఇంత వైరల్ అవుతుందని తాము అనుకోలేదని సంస్థ వెల్లడించింది.

మంచి కంటే చెడు కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నారు

మంచి కంటే చెడు కోసమే ఎక్కువగా వినియోగిస్తున్నారు

డీప్ న్యూడ్స్ యాప్‌కు కొన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకున్నప్పటికీ చాలామంది దీన్ని పాడుపనులకోసమే వినియోగిస్తున్నారని కంపెనీ వెల్లడించింది. ఈ విధంగా తాము డబ్బులు చేసుకోవాలని భావించడం లేదని సంస్థ తెలిపింది. ఇకపై ఎవరైనా తమ సంస్థకు చెందిన సాఫ్ట్‌వేర్‌ను ఇతర సోర్సెస్ నుంచి డౌన్‌లోడ్ చేస్తే అది తమ వెబ్‌సైట్ నియమాలకు విరుద్ధమని పేర్కొంది. ఇకపై డీప్‌నూడ్ కొత్త వెర్షన్‌ను విడుదల చేయబోదని స్పష్టం చేసింది. ప్రీమియం వెర్షన్‌ను యాక్టివేట్ చేసుకునేందుకు లైసెన్స్ కూడా విడుదల చేయమని చెప్పింది.

ఇంటర్నెట్ నుంచి తొలగించినా తిరిగి పొందొచ్చంటున్న టెక్కీలు

ఇంటర్నెట్ నుంచి తొలగించినా తిరిగి పొందొచ్చంటున్న టెక్కీలు

ఇప్పటికే విడుదలైన డీప్ నూడ్ యాప్‌కు సరైన టూల్స్‌ను వినియోగిస్తే దాన్ని తిరిగి పొందడం పెద్దగా కష్టం కాదని కొందరు టెక్కీలు చెబుతున్నారు.కేవలం ఇంటర్నెట్ నుంచే తొలగించడం జరిగిందికానీ మొత్తానికే తీసివేయలేదనే విషయాన్ని టెక్కీలు గుర్తుచేస్తున్నారు. ఒక్కసారిగా ఇంటర్నెట్‌లోకి ఎక్కిందంటే ఇక అది ఎప్పటికీ నిలిచిపోతుందనే విషయాన్ని సైతం వారు చెబుతున్నారు. యాప్ ను క్రియేట్ చేసి అమ్మకానికి ఉంచింది సంస్థ. భారత కరెన్సీలో ఈ యాప్ విలువ రూ. 3449/-గా ఉంది. డీప్ న్యూడ్స్ అనే యాప్ కొత్తగా వచ్చి ఉండొచ్చు కానీ ఇలాంటిది ఎప్పటినుంచో ఉన్నింది.

English summary
If you thought DeepFakes were bad, there's something else on the Internet that's far, far-worse: Deep Nudes.An app which has recently been grabbing the Internet's attention for all the wrong reasons promises something that is every woman's worst nightmare. It promises to create a nude picture out of a fully clothed body of a woman, with just one click.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X