వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విశ్వాసం అంటే ఇదే: స్పృహలేని యజమానురాలి వెంటే ఉండి ఈ కుక్క ఏమి చేసిందో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

Recommended Video

స్పృహలేని యజమానురాలి వెంటే ఉండి ఈ కుక్క ఏమి చేసిందో తెలుసా..?

చైనా: కుక్క విశ్వాసానికి పెట్టింది పేరు. తన యజమానికి ఏమైనా ప్రమాదం వస్తుందని భావిస్తే ముందుగా ప్రాణాలు అడ్డువేసేది ఈ శునకమే. రోజూ ఒక ముద్ద అన్నం పెడితే చాలు... ఇక అన్నీ తానై చూసుకుంటుంది కుక్క. ఇంటి ముందే పడుకుని దొంగలు రాకుండా కాపలా కాస్తుంది. ఎవరైనా రాత్రి వేళల్లో ఇంటిమీదికొస్తే తన అరుపులతో కేకలతో ఇంటి యజమానిని నిద్రలేపుతుంది. ఇక ఇంటి పనులు చేయడంలో కూడా ముందుంటుంది ఈ శునకం .

This dog refuses to leave the fainted owner

తాజాగా చైనాలో ఓ ఘటన చోటుచేసుకుంది. యజమానురాలతో అలా బయటకు వాకింగ్ వెళ్లింది పెంపుడు కుక్క. యజమానురాలు వాకింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కళ్లు తిరిగి అక్కడేపడిపోయింది. యజమానురాలిని అలా చూసి తల్లడిల్లిపోయింది. ఏమైందో అర్థంకాలేదు. తన యజమానురాలును ఎవరైనా కాపాడండి అంటూ మొరుగుతోంది. తన బాధను వ్యక్తం చేస్తోంది. కుక్క మొరగటం గమనించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అంబులెన్స్ అక్కడకు చేరుకుంది. ఇద్దరు వ్యక్తులు యజమానిని అంబులెన్స్ ఎక్కించారు. కుక్క కూడా అంబులెన్స్ ఎక్కింది. అయితే తమపై కుక్క దాడి చేస్తుందేమోనని భయపడ్డారు అంబులెన్స్‌లో వచ్చిన వారు.

ఇక హాస్పిటల్‌కు తీసుకెళ్లే వరకు తన యజమానురాలితోనే కుక్క ఉన్నింది. కుక్కకు తన యజమానురాలిపై ఉన్న ప్రేమ అది ప్రవర్తించే తీరులోనే కనిపించింది. హాస్పిటల్‌లో కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది శునకం. "సాధారణంగా అంబులెన్స్‌లో పెంపుడు జంతువులను అనుమతించం. అయితే తన యజమానురాలు అంటే ఇది చూపిస్తున్న శ్రద్ధ, ప్రేమ చూసి మాత్రమే కుక్కను అంబులెన్సులోకి అనుమతించాం"అని డాక్టర్లు తెలిపారు. హాస్పిటల్‌కు చేరుకోగానే చికిత్స అందించామని డాక్టర్ వెల్లడించారు. స్పృహలోకి రాగానే యజమానురాలు ఆ కుక్కను కౌగలించుకుని ముద్దాడిందని డాక్టర్ తెలిపారు. ఈ ఆప్యాయతను చూసే కుక్కను అంబులెన్స్‌లో తీసుకొచ్చేందుకు అనుమతి ఇచ్చినట్లు వైద్యులు చెప్పారు. కుక్క అంబులెన్సులో ఎక్కి యజమానురాలికి చేస్తున్న సేవను అక్కడి స్థానికులు తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజెన్లు సైతం ఆ శునకాన్ని అభినందిస్తున్నారు. ఈ కుక్కకు ఫిదా అయిపోయారు.

English summary
In a heartwarming incident, a pet dog refused to leave his owner's side after she fainted on the street - even riding with her in the ambulance. The incident took place in the city of Daqing in Heilongjiang, China, and a video of it viral on Chinese social media earlier this week. According to the Shanghaiist, the golden retriever refused to leave his owner after she suddenly fainted on a sidewalk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X