వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: ఆరేళ్లుగా జాబ్‌కు డుమ్మా, ఎవరూ గుర్తించలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లండన్: ఒకరోజు, రెండు రోజులు కాదు.. ఏకంగా ఆరేళ్ల పాటు ఉద్యోగానికి వెళ్లకుండా డుమ్మా కొట్టాడు ఓ వ్యక్తి. ఆరేళ్ల పాటు ఉద్యోగానికి వెళ్లకపోయినప్పటికీ ఎవరూ గుర్తించలేదు! 69 ఏళ్ల జాక్విన్ గర్సియా ఓ వాటర్ కంపెనీలో పని చేస్తున్నాడు.

సుదీర్ఘకాలంగా విధులను నిర్వహిస్తున్న వారికి అవార్డులు ఇవ్వాలని భావించిన సంస్థ జాక్విన్‌ను గుర్తించింది. తీరా చూస్తే అతను ఆరేళ్ల నుంచి ఒక్క రోజు కూడా విధులకు హాజరు కాలేదని తెలుసుకున్నారు. అది తెలుసుకొని అవాక్కవడం వారి వంతయింది.

 This guy didn’t show up to work for six years and no one noticed

ఉన్నతాధికారుల మధ్య ఉన్న విభేదాలను ఆసరాగా చేసుకొని విధులకు ఎగనామం పెట్టడం ప్రారంభించాడట. ఇరవై ఏళ్ల పాటు సేవలు చేసిన వ్యక్తిగా అతనికి మొమెంటోను ఇవ్వాలని భావించిన సంస్థ అప్పుడు అసలు విషయాన్ని గుర్తించింది.

ఈ కేసు కోర్టుకు ఎక్కింది. అతని వార్షిక జీతంలో పన్ను మినహాయించి 27 వేల యూరోలను జరిమానా విధించింది. ఈ ఆరేళ్లూ అతను కనిపించకపోయినా వేతనాన్ని చెల్లిస్తూ వచ్చిన కంపెనీకి చివాట్లు పెట్టింది. తాను కార్యాలయానికి వెళితే, అక్కడ పని ఉండటం లేదని, ఆ కారణం చేతనే వెళ్లడం మానేశానని గార్సియా కోర్టుకు తెలిపాడట.

English summary
This guy didn’t show up to work for six years and no one noticed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X