వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సలాం స్పైడర్ మ్యాన్: చెత్తను తొలగించి పర్యావరణంపై అవగాహన కల్పిస్తున్న సాలీడు మనిషి

|
Google Oneindia TeluguNews

ఇండోనేషియా: గతేడాది చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మహాబలిపురం సందర్శన సందర్భంగా బీచ్‌లో చెత్తను ఏరిపారేశారు ప్రధాని నరేంద్ర మోడీ. మోడీ చెత్త తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తాజాగా ఇండోనేషియాలో కూడా ఓ వ్యక్తి వీధుల్లో పడ్డ చెత్తను బీచ్‌పై ఉన్న చెత్తను తీయడం కెమెరా కంటికి చిక్కింది. ఆ వ్యక్తి మామూలుగా తీసి ఉంటే పెద్దగా వార్తల్లోకి ఎక్కేవాడు కాదేమో.. కానీ స్పైడర్ మ్యాన్‌ దుస్తులు ధరించి చెత్తను ఏరివేయడంతో వార్తల్లోకి ఎక్కాడు.

స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న రూడీ

స్పైడర్ మ్యాన్ డ్రెస్‌లో ఆకట్టుకుంటున్న రూడీ

ఇండోనేషియాలోని ఓ కేఫ్‌లో పనిచేసే రూడీ హర్తోనో అనే వ్యక్తి ఆదర్శంగా నిలిచాడు. తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటూ కోరుతూ తాను స్పైడర్ మ్యాన్ గెటప్ వేసి బీచ్‌పై చెత్త తొలగించాడు. తాను స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించినందునే పబ్లిక్‌ దృష్టిని తనవైపు మరల్చుకోగలిగానని చెబుతున్నాడు. ఇండోనేషియా వీధుల్లో లేదా సముద్ర తీరంలో విపరీతమైన చెత్త ఉంటుంది. చెత్తను తొలగించేందుకు చాలా తక్కువ సిబ్బంది ఉండటంతో అది అలానే పేరుకుపోతోంది.

 ఇండోనేషియాలో ఏటా టన్నుల్లో చెత్త

ఇండోనేషియాలో ఏటా టన్నుల్లో చెత్త

ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద జనాభా ఉన్న దేశంగా ఇండోనేషియాకు గుర్తింపు ఉంది. ఏటా 3.2 మిలియన్ టన్నుల వేస్టేజ్‌ జనరేట్ అవుతుంది. అందులో సగం సముద్ర తీరంలోనే కనిపిస్తుందని 2015లో జర్నల్ సైన్స్ చేసిన స్టడీ ద్వారా వెల్లడైంది. కేఫ్‌లో పనిచేయడానికి ముందు స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకుని రూడీ చెత్త తొలగించే డ్యూటీ చేస్తాడు. ఆ తర్వాత అంటే సాయంత్రం 7 గంటలకు కేఫ్‌లో డ్యూటీ చేసేందుకు వెళతాడు. రూడీ చేసిన చిన్న ప్రయత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా అవగాహన తీసుకొచ్చింది. ఇప్పటికే ఆయన్ను పలు మీడియా ఛానెల్స్ ఇంటర్వ్యూ చేశాయి. ఆ సమయంలో కూడా పిల్లలకు ఎంతో ఇష్టమైన స్పైడర్ మ్యాన్ గెటప్‌లోనే కనిపించాడు.

ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ దేశాల్లో ఇండోనేషియా రెండో స్థానం

ప్లాస్టిక్ పొల్యూటెంట్స్ దేశాల్లో ఇండోనేషియా రెండో స్థానం


తాను స్పైడర్ మ్యాన్ డ్రస్ సరదాగా కొనుకున్నట్లు చెప్పిన రూడీ ఆ తర్వాత చెత్తను తొలగించేందుకు అవగాహన తీసుకురావాలంటే ముందుగా ప్రజల దృష్టిని తనవైపు మరల్చుకోవాలని భావించి స్పైడర్ మ్యాన్ డ్రస్ ధరించినట్లు చెప్పాడు. ఇక తాను నివాసముంటున్న పారేపారే ప్రాంతంలో 1,42000 మంది జనాభా ఉందని చెప్పారు. అక్కడ రోజుకు 2.7 టన్నుల వేస్టేజ్ జనరేట్ అవుతుందని చెప్పాడు. ఇక ఇండోనేషియాలో 17వేల చిన్న ద్వీపాలున్నాయి. ప్రపంచంలో ప్లాస్టిక్ కాలుష్య కారకాలను విడుదల చేసే దేశాల్లో ఇండోనేషియా రెండో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో చైనా ఉంది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

ఇప్పటికైనా ప్రభుత్వం చెత్తను తొలగించడంలో చర్యలు తీసుకుని ఇండోనేషియాను కాలుష్య రహిత దేశంగా తీర్చిదిద్దుతుందనే ఆశాభావం వ్యక్తం చేశాడు రూడీ. అంతేకాదు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ పై నిషేధం విధించి నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని కోరాడు రూడీ. ప్లాస్టిక్‌ను ఎంత తక్కువగా వినియోగిస్తే అంత మంచిదని చెప్పిన రూడీ ప్లాస్టిక్‌ను డీకంపోజ్ చేయడం కష్టమని చెప్పాడు.

English summary
This Indonesian man is grabbing eyeballs for dressing up as Spider-Man to clean up trash from streets and beaches in the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X