వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మద్యం సేవిస్తే పక్షుల పలుకులు తడబడుతాయట

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: మద్యం సేవిస్తే మనుషులు తూలడం, మాటలు పేలడం చేస్తూనే ఉంటారు. వారి మాటలు కూడా తడబడుతాయి. అయితే, మద్యం సేవిస్తే పక్షులు కూడా మనుషుల్లాగానే తూలుతాయట. వాటి పలుకులు తడబడుతాయట. ఇటీవల నిర్వహించిన ఓ సర్వే ఆ విషయాన్ని వెల్లడించింది. మద్యం ప్రభావంతో తాత్కాలికంగా భాషా వైకల్యం ఏర్పడుతుందని, విషయాలను అర్థం చేసుకునే శక్తి నశిస్తుందని పరిశోధకులు తేల్చారు.

శబ్ద ఉత్పత్తి, జ్ఝానం తదితర అంశాల ఆధారంగా ఓ ప్రత్యేక విధానంతో జీబ్రా ఫించేస్ అనే సింగింగ్ బర్డ్స్ (పాటలు పాడే పక్షులు)చడ లండన్‌లోని ఓరెగాన్ హెల్త్ అండ్ సైన్స్ యూనివర్శిటీ అధ్యాపకులు పరిశోధనలు చేశారు. కొద్దిపాటి జ్యూస్‌లో ఆల్కహాల్ కలిపి వాటి పంజరాల్లో పెట్టామని, జిబ్రా ఫించ్ పక్షులు ఆ ద్రవాన్ని తాగిన తర్వాత సాధారణ ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరించాయని, అవి వెలువరించే ధ్వనుల్లో తేడా కనిపించిందని పరిశోధకులు వెల్లడించారు.

This is what it sounds like when drunk birds slur their songs

పక్షుల్లో అయోమయ స్థితి, శ్రవణ సంబంధిత అంశాల్లో స్పష్టమైన ప్రభావం కనిపించిందని చెప్పారు. మద్యం సేవించిన తర్వాత పక్షుల పలుకుల్లో తొట్రుపాటు కనిపించిందని అన్నారు. జీబ్రా ఫించెస్ పక్షులు మానవ నమూనాకు దగ్గరగా ఉంటాయి. కంఠ ధ్వనులకు సంబంధించిన న్యూరల్ నిర్మాణం బాగా అర్థమవుతుందని, దాన్ని అధ్యయనం చేయడం శాస్త్రవేత్తలకు సులభమని అంటున్నారు. ప్రజలు మాట్లాడడం నేర్చుకున్నట్లుగానే ఆ పక్షులు పాటలు నేర్చుకుంటాయని చెబుతున్నారు.

మావన మెదడుపై మద్యం ప్రభావాన్ని వాటి ద్వారా అధ్యయనం చేయడం సాధ్యమవుతుందని అబిప్రాయపడుతున్నారు. పక్షులు మద్యం సేవిస్తాయని, మద్యం సేవించిన తర్వాత వాటి పాటల్లో తేడా వస్తుందని పరిశోధకులు గుర్తించారు. మద్యం సేవించిన తర్వాత నిద్రమత్తులోకి జారుకోలేదని, ఎగిరే లక్షణాన్ని కోల్పోలేదని, అయితే వాటి పాటల్లో తేడా వచ్చిందని పరిశోధకులు గుర్తించారు.

English summary
When researchers at Oregon Health & Science University wanted to study one of the ways that alcohol affects the brain, they turned to zebra finches -- and got them drunk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X