వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: గోల్డ్ చైన్ కొట్టేసి పారిపోదామనుకున్నాడు.. తీరిగ్గా వచ్చి ఇచ్చేశాడు, ఏం జరిగిందంటే?

|
Google Oneindia TeluguNews

బ్యాంకాక్: థాయ్‌లాండ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ 27 ఏళ్ల వ్యక్తి నగల దుకాణంలో దొంగతనం చేయబోయి అడ్డంగా బుక్కయ్యాయాడు. అతడు పట్టుబడిన తీరు అందరికీ నవ్వు తెప్పించేలా ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవలే జరిగిన సంఘటన

ఇటీవలే జరిగిన సంఘటన

అతను బంగారు నగల దుకాణంలోకి రావడం, ఆ తర్వాత నగను దొంగిలించే ప్రయత్నాలు చేయడం, అతను పట్టుబడిన దానికి సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన నవంబర్ 30వ తేదీ శుక్రవారం రోజు జరిగినట్లుగా ఉంది.

బంగారు గొలుసు అడిగాడు

బంగారు గొలుసు అడిగాడు

27 ఏళ్ల వ్యక్తి ఓ బంగారు దుకాణంలోకి వచ్చాడు. ఆ సమయంలో దుకాణంలో జరే నితికరుణ్ అనే 41 ఏళ్ల యజమాని ఉన్నాడు. నిందితుడు దుకాణ యజమాని వద్దకు వచ్చాడు. తనకు ఓ మెడలో వేసుకునే ఓ బంగారు చైన్ కావాలని, చూపించమని అడిగాడు. అతను కొనుగోలు చేసేందుకే వచ్చాడని భావించిన యజమాని ఓ బంగారు చైన్ తీసి అతని చేతికి ఇచ్చాడు.

బంగారు గొలుసు తీసుకొని పారిపోదామని భావించాడు

బంగారు గొలుసు తీసుకొని పారిపోదామని భావించాడు

నిందితుడు బంగారు గొలుసును తన మెడలో వేసుకున్నాడు. దానిని కాసేపు మెడలోనే సర్దుతూ కనిపించాడు. మెడలో వేసుకొని చూస్తున్నట్లుగా నటించాడు. ఆ తర్వాత యజమాని పక్కకు చూస్తుండగా ఒక్కసారిగా పరుగుల లంఘించుకున్నాడు. గొలుసు తీసుకొని పారిపోదామని భావించాడు. కానీ అక్కడే అతనికి అసలు దెబ్బ పడింది.

ఆటోమేటిక్ లాక్ డోర్ వల్ల దొరికిపోయాడు

ఆటోమేటిక్ లాక్ డోర్ వల్ల దొరికిపోయాడు

అతను గొలుసును మెడలో వేసుకొని పరుగెత్తి, తలుపు (డోర్) తీయబోయాడు. కానీ అది రాలేదు. ఎందుకంటే అది ఆటో లాక్ డోర్. అతని తీరు గమనించి యజమాని డోర్‌ను ఆటోమేటిక్‌గా లాక్ చేశాడు. ఆ సౌకర్యం ఉంది. ఆ డోర్ రాకపోయేసరికి తీరిగ్గా వెనక్కి నడుచుకుంటూ వచ్చి ఆ బంగారు గొలుసును యజమానికి ఇచ్చేశాడు. అతను పోలీసులను పిలిపించి, పట్టించాడు. దీనిపై నిందితుడు మాట్లాడుతూ.. తాను బైక్ పైన దుకాణానికి వచ్చానని, తన వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని, ఇటీవలే తన ఉద్యోగం పోయిందని, కాబట్టి డబ్బుల కోసం అలా చేశానని చెప్పాడు. అతని పైన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, జైలుకు పంపించారు.

English summary
Suphachai Panthong was caught on CCTV walking into a jewellery shop in Chonburi, Thailand looking for a new chain to wear last Friday, 30 November, reported Pattayaone News.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X