వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెన్సేషనల్ ఫిజిక్స్ ప్రొఫెసర్: మాష్టారూ..మాష్టారూ..మాంచి లెక్చర్ ఇచ్చారూ..!

|
Google Oneindia TeluguNews

Recommended Video

#WatchVideo Of Science Professor Gone Viral For His Incredible Stunts In Class || Oneindia Telugu

వర్జీనియా: వయస్సు అనేది శరీరానికే తప్ప మనస్సుకు కాదు. 70 ఏళ్ల వయస్సులోనూ 17 ఏళ్ల కుర్రాడిలా చాలా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు ఈ ఫిజిక్స్ ప్రొఫెసర్. ఈయన చెప్పే పాఠాల కోసం విద్యార్థులు ఎదురుచూస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు క్లాస్‌ రూంకు వస్తారా ఆయన పాఠాలు ఎప్పుడెప్పుడు విందామా అని ఉత్సాహంతో విద్యార్థులు ఎదురుచూస్తారు. అయితే ఈ ప్రొఫెసర్‌ టీచింగ్‌ను ఈ విద్యార్థులు ఎందుకు ఇష్టపడతారు.. ఆయనలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి..? తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

లోకేష్‌ 70, చంద్రబాబు 25 ఏళ్ల వయస్సు వారిలా ...! అసెంబ్లీలో అంబటి లోకేష్‌ 70, చంద్రబాబు 25 ఏళ్ల వయస్సు వారిలా ...! అసెంబ్లీలో అంబటి

 ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రొఫెసర్ డేవిడ్ రైట్

ఇంటర్నెట్ సెన్సేషన్ ప్రొఫెసర్ డేవిడ్ రైట్

ఇదిగో ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఈ పిజిక్స్ ప్రొఫెసర్ పేరు డేవిడ్ రైట్. వర్జీనియాలోని టైడ్‌వాటర్ కమ్యూనిటీ కాలేజ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈయన ఇంటర్నెట్ సెన్సేషన్‌గా మారారు. ఎందుకంటారా.. అక్కడికే వస్తున్నాం. ఆయన చేసే బోధనా విధానం ఒక్క విద్యార్థులకే కాదు... మీరు చూస్తే మీకు కూడా నచ్చుతుంది. వెంటనే మిమ్మలను మీ కాలేజ్ డేస్‌కు తీసుకెళతుంది. డేవిడ్ రైట్ చెప్పే పాఠాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఫిజిక్స్‌ను ఎలా అప్లయ్ చేయొచ్చో చెబుతూ తాను ప్రాక్టికల్‌గా చేసి చూపిస్తారు. అందుకే విద్యార్థులు ప్రొఫెసర్ డేవిడ్ టీచింగ్ అంటే చాలా ఇష్టపడతారు.

న్యూటన్ సెకండ్‌ లాను అర్థమయ్యేలా చెప్పారు

ఇక డేవిడ్ రైట్ క్లాస్‌రూంలో చెబుతున్న పాఠాలను ఎరిక్ అనే విద్యార్థి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసింది. ఆ బోధనలన్నీ రికార్డు చేసి కంపైల్ చేసి ఒక వీడియోగా తయారు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో 70 ఏళ్ల ప్రొఫెసర్‌ను చూసి అంతా వావ్ అంటున్నారు. న్యూటన్ రెండో సిద్ధాంతంను రుజువు చేసేందుకు మేకులు ఉన్న పరుపుపై పడుకుని విద్యార్థులకు చూపించారు. గ్రావిటీ గురించి విద్యార్థులకు అర్థమయ్యేందుకు పోగో స్టిక్ వినియోగించి చూపించాడు. అంతేకాదు విద్యార్థులకు ఒకే మూస ధోరణిలో పాఠాలు చెబితే నచ్చదన్న నగ్న సత్యం తెలుసుకున్న డేవిడ్ రైట్... బోధనలో కొన్ని ఫన్ అంశాలను జోడించి సరదాగా పాఠాలు బోధించడం ప్రారంభించారు.

ఫిజిక్స్‌ను చాలా ఫన్నీగా చెబుతారు డేవిడ్ రైట్

ఇక డేవిడ్ రైట్ టీచింగ్‌ను ఎంతగా ఇష్టపడతారో అతని వీడియోలను చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది. విద్యార్థుల్లో ఏ దశలోనూ ఇంట్రెస్ట్ తగ్గకుండా కేవలం సబ్జెక్ట్‌పై ఫోకస్ చేసేలా జాగ్రత్తలు తీసుకుంటారు డేవిడ్ రైట్. సెమిస్టర్‌ చివరి వరకు తాను బోధించిన పాఠాలను ఎరికా వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మా ఫిజిక్స్ ప్రొఫెసర్ టీచింగ్‌లో భాగంగా కొన్ని క్రేజీ అంశాలను బోధించారంటూ ట్వీట్ చేసింది. 70 ఏళ్ల వయస్సులోను ఈయన యాక్టివ్‌గా ఉన్నారంటే హ్యాట్సాప్ అని పేర్కొంది.

 నెటిజెన్ల హృదయాలను గెలిచిన డేవిడ్ రైట్

నెటిజెన్ల హృదయాలను గెలిచిన డేవిడ్ రైట్

ట్విటర్‌లో డిసెంబర్ 12న పోస్టు చేసిన ప్రొఫెసర్ డేవిడ్ రైట్ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనంగా మారింది. నెటిజెన్ల నుంచి పెద్ద ఎత్తున పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. 19.6 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకు వచ్చాయి. అదే సమయంలో 1.5 మిలియన్ లైక్స్ వచ్చాయి. అంతేకాదు డేవిడ్ రైట్ ఈ టీచింగ్ ప్రొఫెషన్‌లోకి ఎలా వచ్చారో అని చెబుతున్న వీడియోను కూడా పోస్టు చేసింది. అంతేకాదు తన ఇష్టమైన టీచింగ్ ప్రొఫెషన్‌పై వయస్సు ప్రభావం పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అనేది కూడా వీడియోలో ప్రొఫెసర్ డేవిడ్ రైట్ వివరించారు.

మొత్తానికి ప్రొఫెసర్ డేవిడ్ రైట్ తన బోధనతో నెటిజెన్ల మనస్సును గెలిచారు. కొందరు తాను చెప్పే విధానంకు జై కొట్టారు. మరికొందరు కష్టమైన ఫిజిక్స్ సబ్జెక్టును ఫన్నీగా చెప్పడాన్ని స్వాగతించారు. ఇందుకే డేవిడ్ రైట్ ఇంటర్నెట్ సెన్సేషన్ అయ్యారు.

English summary
A professor from Tidewater Community College, Virginia, is the new Internet sensation. Professor David Wright, a teacher of physics became viral on Twitter when a clip of his exciting teaching technique was shared by a student attending his class.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X