వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సూపర్ డాగ్: తన యజమానిని వీల్‌ఛైర్‌లో ఊరుమొత్తం తిప్పేస్తోంది

|
Google Oneindia TeluguNews

ఫిలిప్పీన్స్ : పెంపుడు జంతువుల్లో విశ్వాసమైనది ఏది అని అడిగితే మన నుంచి వెంటనే వచ్చే సమాధానం కుక్క. అవునండీ నిజంగానే శునకానికి ఉన్నంత విశ్వాసం మరే పెంపుడు జంతువుకు ఉండదు. ఇక్కడ కూడా అదే జరిగింది. డేనియల్ అలార్కాన్ అనే వ్యక్తికి కొన్నేళ్ల కిందట రోడుప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయన వెన్ను పూర్తిగా దెబ్బతినడంతో వీల్ ఛైర్‌కే పరిమితమయ్యాడు. అయితే తనకు అండగా నేనున్నానంటూ తన పెంపుడు కుక్క డిగాంగ్ ముందుకొచ్చింది.

వీల్‌చైర్‌లో డేనియల్ ఎక్కడికి వెళ్లాలన్నా డిగాంగ్ అనే ఈ కుక్కనే తీసుకెళుతుంది. తన తల ముక్కుతో వీల్‌చైర్‌ను తోస్తుంది. ఈ కుక్క వయస్సు ఎంతో తెలిస్తే షాక్ అవుతారు. కేవలం ఏడు నెలల చిన్న కుక్కపిల్ల డిగాంగ్. పుట్టినప్పటి నుంచి డేనియల్‌తోనే ఉండటంతో తన యజమాని పట్ల ఎనలేని విశ్వాసం ఆ శునకం చూపిస్తుంది. అలా ఫిలీప్పీన్స్ వీధుల్లో ఈ శునకం తన యజమానిని వీల్‌ఛైర్ పై తీసుకెళ్లడాన్ని చూసిన అక్కడి స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు.

This puppy is amazing: It is the best companion to the paralysed owner

వెంటనే ఆ దృశ్యాన్ని తమ కెమెరాల్లో బంధించారు. సోషల్ మీడియాలో ఆ వీడియోను పొందుపర్చడంతో అదికాస్త వైరల్‌గా మారింది. కుక్కలు యజమానులను తీసుకెళ్లడం కేవలం టీవీ షోలలోనే జరుగుతాయని అనుకున్నాం గానీ... ఇలా నిజంగానే రోడ్లపై చూస్తామని అనుకోలేదని అక్కడి వారు అంటున్నారు. కొందరైతే డేనియల్‌ను ఆ కుక్కతో కలిసి సెల్ఫీలు తీసుకోవడమే కాదు... వారిని బయట రెస్టారెంట్లకు తీసుకెళ్లి డేనియల్‌తో కలిసి భోజనం చేస్తున్నారు. వావ్ ఇది నిజంగా సూపరే కదా..!

English summary
Years ago, Danilo Alarcon had a motorcycle accident in which he suffered a spinal injury. Ever since, he’s been unable to walk and relies on a wheelchair to get him around. This would have been a much more difficult ordeal for the 46-year-old man had he not found a faithful companion his dog Digong.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X