వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో: ఎనిమిదేళ్ల వేట కొనసాగిన తర్వాత దొరికింది ఈ భారీ మొసలి

|
Google Oneindia TeluguNews

కొన్ని మొసళ్లు అంతరించిపోతున్నాయి. అలా అంతరించిపోతున్న మొసళ్లను పట్టుకుని సంరక్షించాలని ఆస్ట్రేలియా జంతుసంరక్షణ శాఖ భావించింది. అలా అంతరించి పోతున్న మొసళ్లను ఎప్పటికప్పుడు పట్టుకుని వాటిని సంరక్షిస్తున్నారు. అలా ఓ అరుదైన భారీ మొసలి 2010లో కనిపించినట్లే కనిపించి నీళ్లలోకి జారుకుంది. ఇకదాదాపు 8 ఏళ్ల వేట కొనసాగించిన తర్వాత చివరకు ఆ భారీ మొసలిని పట్టుకున్నారు ఆస్ట్రేలియా అధికారులు. దీని వయసు 60 సంవత్సరాలు ఉంటుందని చెబుతున్నారు. దీని బరువు 600 కేజీలట. ఈ భారీ మొసలి పొడవు 4.7 మీటర్లు. సిడ్నీలోని కేథరిన్‌ నదిలో ఈ భారీ జంతువును అధికారులు పట్టుకున్నారు. 2010లో దీన్ని మొదట గుర్తించారు. ఇక ఆ మొసలిని పట్టుకునేందుకు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతూ వచ్చిన అధికారులకు నిరాశే మిగిలింది. దీన్ని పట్టుకునేందుకు చాలా కష్టపడ్డట్లు అధికారులు తెలిపారు.

వన్యప్రాణి సంరక్షకులు అంతరించిపోతున్న జంతువులను పట్టి ఒక దగ్గర సంరక్షిస్తారు. ఇలా ఏడాదికి వీరు 250 మొసళ్లను పట్టుకుంటూ ఉంటారు. ఉప్పు నీటిలో ఉండే మొసళ్లు కూడా అంతరించి పోతున్న జంతువుల జాబితాలో చేర్చబడ్డాయి. ఇవి ఎక్కువగా ఆస్ట్రేలియాలోని ఉత్తర ఉష్ణమండల ప్రాంతంలో నివసిస్తాయి. ఏడాదికి సరాసరిగా ఇద్దరి మనుషులను చంపేస్తుంటాయి.

This rear monster crocodile was caught after year hunt

ఈ మొసలి కేవలం ఉప్పునీరున్న ప్రాంతాల్లోనే సంచరిస్తుందని అధికారులు తెలిపారు. ఈ భారీ జంతువును చూస్తూ మర్యాద ఇవ్వాలనిపిస్తుందని...అధికారులు చెప్పారు. పట్టుకున్న వెంటనే ఈ మొసలిని కట్టేసి ఓ ప్రత్యేక ప్రాంతానికి తరలించారు.

English summary
An elusive monster saltwater crocodile weighing 600 kilograms (1,328 pounds) has finally been caught after an eight-year hunt in Australia, officials said on Tuesday.The 4.7-metre (15.4-foot) beast was found in a trap downstream from the northern outback town of Katherine after first being spotted in 2010.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X