వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టార్టప్: పెళ్లి చేసుకుంటే రుణం, విడిపోతే వడ్డీతో సహా..

|
Google Oneindia TeluguNews

సియాటెల్: ఓ వినూత్న ఆలోచనతో వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో మొదలైందో స్టార్టప్ కంపెనీ. ఎంతో కొత్తగా ఆలోచించిన ఈ సంస్థ.. ఎవరైనా వివాహానికి సిద్ధపడితే, వారికి 10 వేల డాలర్లను (సుమారు రూ. 6.5 లక్షలు) అప్పుగా ఇస్తుంది. ఇక వారి కాపురం సజావుగా సాగినంత కాలం ఒక్క రూపాయి కూడా చెల్లించక్కర్లేదు.

ఒకవేళ విడాకులు తీసుకుంటే మాత్రం డబ్బిచ్చిన నాటి నుంచి వడ్డీతో కలిపి చెల్లించాల్సిందే. ఎంత వడ్డీ అన్నది ముందే నిర్ణయిస్తారు కూడా. వినడానికి కాస్తంత క్రేజీగా ఉన్నప్పటికీ.. ముందు ముందు అప్పుతీసుకున్న వారి నుంచి ఈ సంస్థకు భారీ లాభాలే రావచ్చని నిపుణులు భావిస్తున్నారు.

This startup bets up to $10,000 that your marriage will end badly

ఈ స్టార్టప్ పేరు 'స్వాన్ లవ్'. దీన్ని స్కాట్ అవీ అనే వ్యక్తి స్థాపించారు. తన మిత్రుడికి పెళ్లి కుదిరి, ఆపై వివాహ ఖర్చుల గురించి తనతో ప్రస్తావించిన వేళ ఈ ఆలోచన తట్టిందని స్కాట్ చెబుతున్నారు.

తమ సంస్థలోకి పెట్టుబడులతో ఇన్వెస్టర్లు వస్తారా? రారా? అన్న ఆలోచన ఇప్పటి వరకూ లేదని అంటున్నారు. పాశ్చాత్య దేశాల్లో ఈ ఆలోచన లాభాలను తెచ్చి పెట్టవచ్చేమో కానీ.. మన దేశం లాంటి దేశాల్లో మాత్రం ఆ కంపెనీకి నష్టాలే మిగులుతాయి.

English summary
A new startup in Seattle will fund your wedding. Up to $10,000. Even the nacho cheese fondue fountain. The catch: If your union crumbles, at six months or 25 years, you must pay them back — with interest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X