వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ విద్యార్థిని చుట్టూ ఎప్పుడూ 12 మంది పరిచారకులుంటారు..ఈమె ఎవరో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

యూకేలో ఓ విద్యార్థిని అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. సాధారణంగా విద్యార్థిణి లేదా విద్యార్థి అంటే స్కూలుకో లేదా కాలేజీకో వెళ్లి తిరిగి ఇంటికి చేరుకుంటారు. కానీ ఈ విద్యార్థి మాత్రం ఇంట్లో నుంచి కాలేజీకి వెళ్లేందుకు బయటకు అడుగు పెట్టాలంటే 12 మంది ఆమెకు సహాయం చేస్తారు. అంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న విద్యార్థిని ఎవరు.. అనేగా మీడౌటు. అక్కడికే వస్తున్నాం.

భారత సంతతికి చెందిన ఒక కోటీశ్వరుడి కుమార్తెనే ఆ విద్యార్థి. స్కాట్‌లాండ్‌లోని యూనివర్శిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుకుంటోంది. అక్కడే క్యాంపస్‌లో గది తీసుకుని ఉంటోంది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఆ గదిలో ఆమెకు సేవ చేసేందుకు 12 మంది పరిచారకులను తన తండ్రి అప్పాయింట్ చేశాడు. అందులో హౌజ్ మేనేజర్, ముగ్గురు హౌజ్ కీపర్స్, ఒక తోటమాలి, ఒక ఆడపనిమనిషి, ఒక మగపనిమనిషి, ఇంటికి వచ్చి పోయే గెస్టులకు కావాల్సిన ఏర్పాట్లు చేసేందుకు ముగ్గురు వ్యక్తులతో పాటు ఇద్దరు వంట మనుషులను పెట్టారు. వీరంతా త్వరలో అమ్మాయి కోసం కొనుగోలు చేసిన విలాసవంతమైన భవనానికి వెళ్లనున్నారు. యూనివర్శిటీలో గదులు సాధారణంగా ఉండటంతో అమ్మాయి తండ్రి కొన్ని కోట్లు పోసి ఈ భవంతిని కొనుగోలు చేశాడు

This student with 12 staff members is the richest student in UK

వీరిని అప్పాయింట్ చేసుకునేందుకు నెల రోజుల క్రితమే పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. ఒక ఇంట్లో పనిచేసేందుకు పలవురు వ్యక్తులు కావాలని ఆసక్తి ఉన్నవారు ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చంటూ పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. జీతం కూడా అడిగినంత ఇస్తామని ప్రకటించారు. దీంతో అప్లికేషన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. వీటిలో జాగ్రత్తగా వేరు చేసి ఇంటర్వ్యూలు చేసి అమ్మాయికోసం పరిచారకులుగా 12 మందిని నియమించారు.

అమ్మాయి వార్డ్‌రోబ్‌ బాధ్యతలు నిర్వర్తించేందుకు స్టాఫ్‌ను నియమించారు. ఆమె వ్యక్తిగత షాపింగ్ కూడా వీరే చేస్తారు. మగ పనిమనిషి ఆ అమ్మాయి టీచర్ల సంగతి చూసుకుంటాడు. అమ్మాయికి ఎప్పుడు చదవుకోవాలనిపిస్తే అప్పుడు ఆయన వెళ్లి టీచర్లను ఇంటికి తీసుకొస్తాడు. మరో ముగ్గురు వారికి భోజన వసతులు చూస్తారు. బ్రిటన్‌లోనే అత్యంత సంపన్న కుటుంబంగా పేరుగాంచిని ఈ భారత సంతతి కుటుంబం తన కుమార్తెకు చదువు చెప్పేందుకు వస్తే వారికి 30వేల పౌండ్లు చెల్లిస్తామని ప్రకటన ఇచ్చారు.

English summary
An unnamed Indian billionaire's daughter has been dubbed the "poshest" student in the UK after it was claimed that her family is hiring 12 staff members to help her during her studies at a Scottish university.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X