వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎందుకలాగా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్న ఈ రైతుకు జైలు శిక్ష విధించిన కోర్టు

|
Google Oneindia TeluguNews

టాస్మానియా: వెల్లుల్లి దిగుమతి చేసుకున్నందుకు ఓ రైతుకు 11 ఏళ్లు జైలు శిక్ష విధించింది కోర్టు. అదేంటి వెల్లుల్లి దిగుమతి చేసుకుంటే జైలు శిక్ష విధిస్తారా అనేగా మీ డౌటు... అవును నిజమే ఆ వెల్లుల్లి దిగుమతి చేసుకోవడంతో ఆ దేశంలోని మొత్తం వ్యవసాయ రంగాన్నే ప్రమాదంలో పడే అవకాశం ఉందట. ఇంతకీ ఆ వెల్లుల్లిని దిగుమతి చేసుకున్న రైతు ఎవరు..? ఏ దేశ వ్యవసాయ రంగం ప్రమాదంలోకి జారిపోయే పరిస్థితి ఉంది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పాక్‌కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్పాక్‌కి షాకిచ్చిన ఐక్యరాజ్యసమితి: మధ్యవర్తిత్వంపై తేల్చేసిన యూఎన్ చీఫ్

వెల్లుల్లిలో దాగి ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా

వెల్లుల్లిలో దాగి ఉన్న ప్రమాదకరమైన బ్యాక్టీరియా

ఆస్ట్రేలియాలోని టస్మానియాకు చెందిన లెటేటియా అన్నే వేర్ అనే మహిళా రైతు అమెరికా కెనడాల నుంచి 2,200 వెల్లుల్లి గడ్డలను దిగుమతి చేసుకుంది. అయితే ఇందులో పెద్ద విషయం ఏముందనే అందరికీ సందేహం కలగొచ్చు. ఈ వెల్లుల్లి గడ్డల్లోనే రహస్యమంతా దాగి ఉంది. దిగుమతి చేసుకున్న ఈ రకం వెల్లుల్లిలో క్సైలెల్లా ఫాస్టిడియోసా అనే బ్యాక్టీరియా ఉందట. పంటపొలాల్లో ఇది కలిసిందంటే మొత్తం పంటలే దెబ్బతింటాయట. వేర్ గత 18 నెలల్లో 21 రకాల వెల్లుల్లి గడ్డలను దిగుమతి చేసుకుంది. అందులో పంటలకు హాని కలిగించే ఓ రకం వెల్లుల్లికి మాత్రం "తోటలోకి మాత్రమే" అనే లేబుల్ అంటించమని దిగుమతి దారులకు చెప్పింది.

వెల్లుల్లి దిగుమతికి లేని అనుమతి

వెల్లుల్లి దిగుమతికి లేని అనుమతి

2015లో ఇలానే ఓసారి వెల్లుల్లిని దిగుమతి చేసుకోగా అధికారులు దీన్ని గుర్తించి పట్టుకున్నారు. ఆ సమయంలో రైతు వేర్‌కు ఓ హెచ్చరిక చేస్తూ లేఖ రాశారు. ఆ సమయంలో తాను చెప్పినట్లుగా లేబుల్స్ వేయనందుకు సప్లయర్లపై వేర్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే అంతకుముందే ఆమె ఆస్ట్రేలియా గార్లిక్ ఇండస్ట్రీ అసోసియేషన్ ఛైర్‌పర్సన్‌గా కూడా పనిచేసిన అనుభవం ఉన్నందున... అన్నీ తెలిసి మొక్కల జీవభద్రతకు భంగం వాటిల్లేలా ప్రయత్నించిందని కేసును విన్న హాబర్ట్ సుప్రీంకోర్టు జడ్జి గ్రెగొరీ గీసన్ చెబుతూ ఆమెకు శిక్షను ఖరారు చేశారు. పుట్టగొడుగులను దిగుమతి చేసుకునేందుకు ఆమెకు అన్ని అనుమతులు ఉన్నప్పటికీ వెల్లుల్లిని దిగుమతి చేసుకునేందుకు అనుమతులు లేవని న్యాయస్థానం పేర్కొంది. వేర్ చేసిన పనికి మొత్తం వ్యవసాయ రంగమే ప్రమాదకర పరిస్థితిలోకి పడిపోయేదని కోర్టు అభిప్రాయపడింది.

 ఇటలీలో ఈ బ్యాక్టీరియాతో ధ్వంసమైన లక్షల ఆలివ్ చెట్లు

ఇటలీలో ఈ బ్యాక్టీరియాతో ధ్వంసమైన లక్షల ఆలివ్ చెట్లు

మొక్కలకు కానీ పంటలకు కానీ ప్రమాదకరంగా మారే ఏ చర్యనైనా బోర్డు అంగీకరించబోదని ఆస్ట్రేలియన్ అగ్రికల్చరల్ ఇండస్ట్రీ వెల్లడించింది. ఇదిలా ఉంటే వేర్‌కు 18 నెలలు జైలు శిక్ష విధించారు జడ్జీ. అయితే కేవలం రెండు నెలలకే బయటకు వచ్చే అవకాశం ఉందని అయితే ఆమె 2వేల ఆస్ట్రేలియన్ డాలర్లు జరిమానాగా కట్టి రానున్న మూడేళ్లలో సత్ప్రవర్తనతో ఉంటానన్న షరతులపై సంతకం పెట్టాలని సూచించింది. అయితే వేర్‌ చేసిన పని క్షమించరానిదని శిక్ష సరైందేనని ఫెడరల్ వ్యవసాయశాఖ మంత్రి బ్రిడ్జెట్ మెకెంజీ తెలిపారు.

క్లీన్, గ్రీన్, సేఫ్ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా టాస్మానియాకు మంచి పేరుంది. క్సైలెల్లా ఫాస్టిడియోసా అనే బ్యాక్టీరియా అమెరికాలో కనుగొన్నారు. మొక్కలు ఎక్కువ నీరు తీసుకోకుండా అడ్డుకోగల శక్తి ఈ బ్యాక్టీరియాకు ఉంది. ఈ బ్యాక్టీరియాతో ఇటలీలో లక్షల సంఖ్యలో ఆలివ్ మొక్కలు పెరగకుండా ధ్వంసం చేసింది.

English summary
A Tasmanian farmer has been given an 11-month jail sentence for illegally importing garlic bulbs that could have put Australia’s agricultural sector at risk.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X