వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓరి దేవుడో: ఈయనకు 17 మంది భార్యలు... 84 మంది పిల్లలట..!

|
Google Oneindia TeluguNews

ఈ రోజుల్లో ఒక పెళ్లితోనే తల ప్రాణం తోకకు వచ్చేస్తోందంటూ చెప్పే మగవారిని చూస్తున్నాం. అలాంటిది రెండు లేదా మూడు పెళ్లిళ్లు చేసుకుని కాపురం చేసే మగవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించొచ్చు. కానీ యూఏఈకి చెందిన దాద్ మోహ్మద్ అల్ బలూషీ మాత్రం ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మందిని పెళ్లి చేసుకుని 84 మంది పిల్లలకు జన్మనిచ్చాడు. ఇంతకీ బలూషి వయస్సు ఎంతో తెలుసా.. అక్షరాల 71 ఏళ్లు. ఇప్పటికే బలూషీకి 50 మంది మనవళ్లు మనవరాండ్రు ఉన్నారు.

తను ఒక మంచి తండ్రిని అని బలూషీ చెప్పుకుంటారు. తను ఇతర దేశాల మహిళలను వివాహం చేసుకున్నట్లు చెప్పాడు. ఫిలిప్పీన్స్ మోరొక్కో, పాకిస్తాన్ ఇలా అన్ని దేశాలకు చెందిన మహిళలను వివాహం చేసుకున్నట్లు చెప్పారు. అయితే విడాకులు తీసుకున్న మహిళలను, లేదా భర్తకోల్పోయిన మహిళలను తాను పెళ్లి చేసుకోలేదని స్పష్టం చేశారు. అయితే తాను పెళ్లి చేసుకున్న ప్రతి భార్య వారి పిల్లలతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నట్లు బలూషీ తెలిపాడు. ప్రతి భార్యకు ఒక ఇళ్లు ఉందని దాంతో పాటు ఒక కారు, పనిమనిషి కూడా ఉందని చెప్పాడు.

This UAE man has 17 wives and 84 children

ఇక తామంతా వారంలో ఒకరోజు మనమాలోని తన పాత ఇంటిలో కలుస్తామని చెప్పారు. జనన మరణాలు భగవంతుడి చేతిలో ఉంటాయని చెబుతున్న బలూషీ... అన్నీ సవ్యంగా సాగితే వంద మంది పిల్లలకు జన్మనిస్తానని చెబుతున్నాడు. తాను మృతి చెందే నాటికి 100 మంది పిల్లలకు తండ్రినవుతానని తాను యూఏఈ దివంగత రాజు షేక్ జైద్‌కు మాట ఇచ్చినట్లు చెప్పారు.ఇదిలా ఉంటే 1995లో జరిగిన రోడ్డు ప్రమాదంలో బలూషీ ఓ కాలును పోగొట్టుకున్నట్లు చెప్పాడు. ఆర్టిఫిషియల్ కాలు కోసం జైపూర్‌కు వెళ్లాలని భావిస్తున్నట్లు బలూషీ చెప్పారు. భారత్‌లో కూడా ఓ మహిళ కోసం చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇక తన తండ్రి 110 ఏళ్లు బతికినట్లు చెప్పిన బలుషీ అతనికి నలుగురు భార్యలని 27 మంది సంతానం అని చెప్పాడు.

English summary
Daad Mohammed Al Balushi, UAE's super dad who has 90 children from 17 wives is all set to marry once again.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X