వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వావ్: ఉద్యోగస్తులకు భారీగా క్రిస్మస్ బోనస్ ప్రకటించిన సంస్థ..ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: మనదేశంలో దసరా లేదా దీపావళి పండగ సందర్భంగా పలు కంపెనీలు వారి ఉద్యోగస్తులకు భారీగా బోనస్‌లు ప్రకటించడం చూశాం. ఇక గుజరాత్‌లో అయితే ఓ వజ్రాల వ్యాపారి ఏకంగా తమ ఉద్యోగస్తులకు కార్లు, ఇళ్లు కూడా బహూకరించిన సందర్భాలను చూశాం. తాజాగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ క్రిస్‌మస్ సందర్భంగా వారి ఉద్యోగస్తులకు భారీ బోనస్‌లు ప్రకటించింది. ఏకంగా ఐదంకెల బోనస్‌ను ప్రకటించడం అక్కడ టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది.

 క్రిస్మస్ బోనస్ ప్రకటించిన రియల్ ఎస్టేట్ కంపెనీ

క్రిస్మస్ బోనస్ ప్రకటించిన రియల్ ఎస్టేట్ కంపెనీ

అమెరికాలో సాధారణంగా ఆయా కంపెనీలు క్రిస్మస్ సందర్భంగా తమ ఉద్యోగస్తులకు పెద్ద పార్టీని ఇస్తాయి. ఇక పార్టీ సందర్భంగా ఆ కంపెనీలో టార్గెట్స్ రీచ్ అయినవారికి లేదా కంపెనీ ఎదగడంలో కృషి చేసిన వారికి అత్యంత ప్రతిభ కనబర్చిన వారిని స్టేజ్‌ మీదకు పిలిచి సత్కరిస్తాయి లేదా అభినందిస్తాయి. కానీ ఓ రియల్ ఎస్టేట్ సంస్థ మాత్రం తమ ఉద్యోగులకు భారీ బోనస్‌ను ప్రకటించింది. 10 మిలియన్ డాలర్ల బోనస్ ప్రకటించడం ప్రస్తుతం టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. అంటే మన కరెన్సీలో రూ.70.8 కోట్లు 200 మంది ఉద్యోగస్తులకు బోనస్‌గా ప్రకటించింది. ఐదంకెల బోనస్ ప్రకటించడంతో ఉద్యోగులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.

 క్రిస్మస్ పార్టీ సందర్భంగా చెక్కులు ఇచ్చిన సంస్థ

క్రిస్మస్ పార్టీ సందర్భంగా చెక్కులు ఇచ్చిన సంస్థ

అమెరికాలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సెయింట్ జాన్ ప్రాపర్టీస్ తమ ఉద్యోగస్తులకు ఈ భారీ బొనాంజా ప్రకటించింది. అంతేకాదు క్రిస్మస్ పార్టీలోనే ఉద్యోగస్తులకు ప్రకటించిన బోనస్‌కు సంబంధించిన చెక్‌ను ఓ ఎన్‌వలప్‌లో ఉంచి అందజేసింది. ఆ తర్వాత ఉద్యోగస్తులు ఎలా ఫీల్ అయ్యారో మళ్లీ హెచ్‌ఆర్‌ మేనేజర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఉద్యోగస్తులు కవర్ ఓపెన్ చేసి చూడగానే చెక్‌పై ఉన్న అంకెను చూసి షాక్‌కు గురయ్యారని హెచ్‌ఆర్ మేనేజర్లు యాజమాన్యానికి తెలిపారు.

 సగటున ఒక్కో ఉద్యోగికి 50వేల అమెరికన్ డాలర్లు

సగటున ఒక్కో ఉద్యోగికి 50వేల అమెరికన్ డాలర్లు

ఇక ఒక్కో ఉద్యోగి కంపెనీలో ఎంతకాలంగా పనిచేస్తున్నారన్నదానిని పరిగణలోకి తీసుకుని దానికి తగ్గట్టుగా బోనస్ ఇచ్చారు. అయితే సగటుగా ఒక ఉద్యోగికి 50వేల అమెరికా డాలర్లను బోనస్‌గా ప్రకటించారు. మెయింటెనెన్స్ సిబ్బంది నుంచి మొదలు పెడితే రిసెప్షనిస్ట్, ఎగ్జిక్యూటివ్స్ వరకు అందరికీ బోనస్ ప్రకటించింది. ఇక కవర్లు తెరిచి చూడగానే ఉద్యోగస్తులు షాక్‌కు గురయ్యారు.

 టార్గెట్స్ అందుకోవడంతోనే భారీ నజరానా

టార్గెట్స్ అందుకోవడంతోనే భారీ నజరానా

కంపెనీ నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకోవడంతోనే భారీ స్థాయిలో ఉద్యోగస్తులకు బోనస్ ప్రకటించినట్లు సెయింట్ జాన్ రియల్‌ ఎస్టేట్ సంస్థ ఛైర్మెన్ ఎడ్వర్డ్ సెయింట్ జాన్ చెప్పారు. భారీగా బోనస్‌లు పొందిన ఉద్యోగస్తుల జీవితాల్లో పెను మార్పురావాలని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. కంపెనీ ఎదుగుదలకు కృషి చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి ధన్యవాదాలు తెలిపారు ఎడ్వర్డ్ జాన్. ఇంతకంటే వారికి ఏం చేయగలనో తనకు తెలియదని చెప్పారు.

English summary
Christmas is the time of giving and a company in the US has given a huge chunk of its profits to nearly 200 employees.ccording to reports, a commercial real estate company in the US gifted bonuses worth $10 million (Rs 70.8 crore) to its 198 employees during a Christmas party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X