వార్నీ! ఫాంటసీ బ్రా అట.. ధర మాత్రం అడక్కండి.. కళ్లు తిరిగి పడిపోతారు!
మహిళలు ధరించే బ్రా తెలుసు కదా? నాణ్యతను బట్టి దాని ఖరీదు మహా ఉంటే వెయ్యి నుంచి రూ.5 వేలు ఉండొచ్చు. కానీ ఒక్క బ్రా ఖరీదు రూ.13 కోట్లు ఉంటుందా? ఉంటుంది.. మీరే చూడండి!
Recommended Video
షాంఘై: మహిళలు ధరించే బ్రా తెలుసు కదా? నాణ్యతను బట్టి దాని ఖరీదు మహా ఉంటే వెయ్యి నుంచి రూ.5 వేలు ఉండొచ్చు. కానీ ఒక్క బ్రా ఖరీదు రూ.13 కోట్లు ఉంటుందా? ఉంటుంది.. మీరే చూడండి!
ఇక్కడ చిత్రంలో కనిపిస్తున్న మోడల్ పేరు.. లాయిస్ రిబీరో. విక్టోరియా సీక్రెట్ మోడల్ 2017గా గుర్తింపు తెచ్చుకున్న లాయిస్.. ఈ నెల 28న షాంఘైలో జరగనున్న ఫ్యాషన్ షోలో పాల్గొననుంది.
అందరిలాంటి మోడల్ అయినా.. లాయిస్కు మాత్రం ఈమె ధరించిన బ్రా వల్లే ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ షోలో పాల్గొనేందుకు ఆమె ఏకంగా 13 కోట్ల రూపాయల విలువైన బ్రాను ధరించనుంది.
ఫాంటసీ బ్రాగా చెప్పుకునే దీనిని 24 కారెట్ల బంగారంతో రూపొందించారు. ఇందులో 6 వేల విలువైన రత్నాలును, నీలిరంగు పుష్పరాగాలు, ఖరీదైన వజ్రాలను ఇందులో ప్రత్యేకంగా కూర్చారు. దీని తయారీకి 350 గంటల సమయం పట్టిందట.
సుమారు 13 కోట్ల రూపాయల విలువైన బ్రా ధరించిన ఆమె.. ఈ సందర్భంగా తీసుకున్న ఫొటోలు, వీడియోను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా బాగా వైరల్ అవుతున్నాయి. మీరూ ఓ లుక్కేయండి మరి!