వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: మృతదేహంతో మాట్లాడేందుకు వెళ్లిన రిపోర్టర్.. నెటిజెన్లు కామెడీ కామెంట్స్

|
Google Oneindia TeluguNews

ఈ మధ్యకాలంలో వార్తా ఛానెళ్లు విపరీతంగా పెరిగిపోయాయి. ఎవరి కవరేజ్‌ల కోసం వారు పాకులాడుతున్నారు. అదే సమయంలో రిపోర్టింగ్ ఏం చేస్తున్నారో అన్న సంగతిని కూడా మరిచిపోయి రిపోర్టింగ్ చేస్తూ ఉన్నదీ లేనిదీ చెబుతున్నారు. ఇలా అమెరికాలోని ఓ టీవీ ఛానెల్ మహిళా రిపోర్టర్ ఏకంగా చనిపోయిన వ్యక్తితో మాట్లాడేందుకు తన దగ్గరకు వెళితే తను అందుబాటులో లేడంటూ లైవ్‌లో చెప్పింది. ఇదే వీడియోను మరో జర్నలిస్టు ట్విటర్ వేదికగా షేర్ చేయడంతో అది కాస్త వైరల్ అయ్యింది.

అమెరికాలోని లాస్ ఏంజిలెస్ నగరంలోని వార్తా ఛానెల్ కేటీఎల్‌ఏలో రిపోర్టర్‌గా పనిచేస్తోంది సారా వెల్క్‌ అనే మహిళ . దక్షిణ కాలిఫోర్నియాలో జరిగిన ఓ ఘటనపై ఆమె రిపోర్టింగ్ చేస్తూ నోరు జారింది. ఇది లైవ్ టెలికాస్ట్ కావడంతో ఒక్కసారిగా ఆ తప్పు ప్రపంచవ్యాప్తంగా ప్రసారమైంది. ఇంతకీ ఆమె రిపోర్టింగ్ చేస్తూ ఏమి చెప్పిందో తెలుసా..? ఘటనపై స్పందన తెలియజేయాల్సిందిగా మృతి చెందిన వారిని అడిగేందుకు వెళితే వారు అందుబాటులో లేరని చెప్పింది. అంతేకాదు ఓ చనిపోయిన వ్యక్తి దగ్గరకు కూడా తాను వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. ఇదంతా జరిగి ఒక ఏడాది కాలం అవుతోంది. కానీ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్‌గా మారింది.

This woman reporter was targetted for trying to contact dead man for comment

మరో జర్నలిస్టు యాషర్ అలీ అనే వ్యక్తి ఈ వీడియోను షేర్ చేశారు. తను నవ్వు ఆపుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో ఒక్కసారిగా వీడియో వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసిన ఇతర నెటిజెన్లు కూడా తమదైన శైలిలో కామెంట్స్ రాస్తున్నారు. ఇక ఈ వీడియో గురించి కథనం రాస్తున్నప్పటికే ట్విటర్‌లో వీడియో 24,600 సార్లు షేర్ అయ్యింది. 98,300 లైకులు వచ్చాయి. ఇక నోరు పెద్దదిగా చేసింది కానీ మెదడును మాత్రం మూసేసిందంటూ ఓ నెటిజెన్ వ్యాఖ్యానించాడు. అయితే ఈమె రిపోర్టింగ్‌తో న్యూస్ యాంకర్ రియాక్షన్ ఎలా ఉన్నిందో చూడాలని ఉందని మరో వ్యక్తి ట్వీట్ చేశారు.

English summary
A lady TV reporter said that she had reached out to a dead man for his comment while reporting on an incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X