వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ బుడతడిని చూడండి... ఆ తర్వాత మీకే తెలుస్తుంది

|
Google Oneindia TeluguNews

ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడతడి పేరు డేనియల్ సాల్వేమి. ఫిలిప్పీన్స్‌కు చెందిన ఇతని ఎడమ భుజం గమనించారా...?కండలు తిరిగిన వీరుడిలా లేడూ...? మరి కుడి చేయి భుజం మాత్రం సాధారణంగా ఉంది. ఇక్కడే మీకు అనుమానం వచ్చి ఉంటుంది. ఒక్క చేయికి మాత్రమే కండలు తిరిగి మరో చేయి సాధారణంగా ఉడటం ఏంటబ్బా అని మీరు అనుకోవచ్చు. అలా ఒక చేయి కండలు తిరిగి కనపడటం మరో చేయి సాధారణంగా ఉండటం ఒక వ్యాధిగా వైద్యులు గుర్తించారు.

ఇక అసలు విషయానికి వద్దాం.. 11 ఏళ్ల డేనియేల్ తను నాలుగేళ్ల వయసుల్లో ఎడమ చేయి పైభాగంపై కొంత వాపు వచ్చింది. అలా కొన్ని ఏళ్లు గడిచేసరికి ఆ వాపు మరింత ముదిరి పాకాన పడింది. దీంతో ఒక బాడీ బిల్డర్ ఎలాగైతే కండలు పెంచుతాడో ఆ స్థాయిలో డేనియేల్ ఎడమ చేయి కండలు పెరిగాయి. తన క్లాస్‌రూమ్‌లో తోటి పిల్లలు డేనియేల్‌ను ఏడిపించేవారు. అయితే ఈ బుడతడు మాత్రం ధైర్యంగా వారికి సమాధానం చెప్పేవాడు. తను కార్టూన్ హీరో పాప్ఐ అని... ఇలా ఒక చేయికి మాత్రమే కండలు పెరగడం వలన బాధపడాల్సిందేమీ లేదని చెప్తాడు.

This young kid dubbed ‘Popeye’ after mystery condition gives him huge biceps

ఒక్క చేయికి కండలు రావడం మరో చేయి సాధారణంగా ఉండటంపై తనకేమీ బాధ లేదని చెబుతున్నాడు డేనియేల్. తను బాడీ బిల్డర్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పాడు డేనియేల్. అంతేకాదు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యత సంపాదించాలని కోరుకుంటున్నాడు. బాడీ బిల్డర్ అయి తన స్నేహితులకు గట్టి సమాధానం ఇవ్వాలని ఉందని తెలిపాడు. తనకున్న మైనస్‌నే పాజిటివ్‌గా మలుచుకుని తనను హేళన చేసిన వారికి బుద్ధి చెబుతానని డేనియేల్ చెప్పడం చూస్తే తన ఆత్మవిశ్వాసానికి సలాం కొట్టలేక ఉండలేం.

English summary
The 11 year old kid who suffered from a mystery illness has dubbed himself as Popeye. Daniel from phillipines was left with a huge swollen biceps.Daniel’s classmates at his school in Rizal, the Philippines, bullied him over the abnormal appearance but he hit back - telling them that he was like cartoon hero Popeye.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X