వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారినీ దోచుకుంటున్నారు.. ఫేస్‌బుక్ వేదికగా మోసాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
పాయిజన్ సింబల్ తో మోసగాళ్లు

ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారికి ప్రాణం తీసే విషాన్ని విక్రయిస్తామంటూ ఎన్నో ఫేస్‌బుక్ పేజీల్లో ప్రకటనలు ఉండడాన్ని బీబీసీ పరిశోధన ఒకటి బయటపెట్టింది. అయితే.. మోసగాళ్లు పన్నుతున్న పన్నాగం. వారు ఇదంతా ఎలా చేస్తున్నారో ఈ పరిశోధన బయటపెట్టింది.

''నేను వాట్సాప్ ఓపెన్ చేసి చూడగానే ఒక డీలర్ పంపించిన మెసేజ్ కనిపించింది.

ప్రాణాలు తీసే విషపు మాత్రలు అమ్ముతానని అందులో ఆఫర్ చేశాడు’’''కనీసం 100 మాత్రలు కొనాలి.. ధర 150 పౌండ్లు(సుమారు రూ.4,500). జాగ్రత్తగా ప్యాక్ చేసి కేమరూన్ నుంచి పంపిస్తాం’’ అని మెసేజ్ పంపించాడు.

నేనెక్కడ ఉన్నాను... ఎన్ని మాత్రలకు ఆర్డర్ ఇస్తాననేది తెలుసుకోవాలనుకున్నాడు.

ఆ ఫేస్ బుక్ పేజీలో చెప్పినట్లు ఆ మాత్రలు నిజంగానే పనిచేస్తాయా.. దాంతో ప్రాణాలు తీసుకోవచ్చా అని అడిగాను.

''అందులో ఉన్నదంతా నిజం. అయితే, కేవలం అమ్మడం వరకే నా పని’’ అని సమాధానమిచ్చాడు.

ఆ తరువాత ఆ మాత్రలు ఎలా వాడాలి.. ? వాడిన తరువాత నాకు ఏమవుతుంది వంటివన్నీ వివరంగా చెప్పాడు.

నాకేమన్నా సాయం కావాలా..? లేకపోతే నేనీ మాత్రలు వేసుకున్న తరువాత ఏమవతుంది.. నా కుటుంబం, స్నేహితులపై నేను చేసే పని ఎలాంటి ప్రభావం చూపుతుంది వంటివేమీ ఆయనకు అవసరం లేదు.

అతడి దృష్టిలో ఇది మరో లావాదేవీ మాత్రమే.

అయితే, అతడికి తెలియని విషయం ఏంటంటే.. నేను, నా ప్రాణం తీసుకోవాలనుకోవడం లేదు. అంతేకాదు, అతడు అమ్ముతానని చెబుతున్న ప్రాణాంతక మాత్రలను కొనే ఉద్దేశమూ లేదు.

ప్రాణాంతక మందు

మరి, ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే దానికి కారణం ఉంది.

ఫేస్ బుక్‌లో నేనొక వీడియో చూశాను. అందులో ఒకరు తెల్లని మాత్రలున్న డబ్బా మూత తీస్తున్నారు.

ఈ మాత్రలు అమ్మే వ్యక్తి దాన్ని 99 శాతం స్వచ్ఛమైన విషమని చెబుతున్నాడు.ఆ మాత్రల్లో వాడిన రసాయనం (బీబీసీ ఆ పేరు వెల్లడించడం లేదు) సాధారణంగా పారిశ్రామిక అవసరాలకు వాడుతారు.

కానీ, ఈ విక్రేత మాత్రం ఆత్మహత్య చేసుకోవాలనుకునేవారు తన దగ్గర ఈ మాత్రలు కొనుగోలుచేయొచ్చని చెబుతున్నాడు.

ఆ పేజీలో వాటి ధర, ఎప్పటికి సరఫరా చేస్తారు వంటి వివరాలన్నీ చెప్పారు.

దాంతో.. నాకు ఆ మాత్రలు కావాలన్నట్లుగా నటిస్తూ ఆయనకు మెసేజ్ పెట్టాను. క్రిప్టో కరెన్సీలో డబ్బు చెల్లిస్తే వెంటనే పంపించేస్తానని చెప్పాడు. అలా చేస్తే అతడెవరో తెలిసే అవకాశం ఉండదు.

అయితే, యూకేలో లైసెన్సు లేకుండా ఆ రసాయనం కొనడం చట్టవిరుద్ధమని చెప్పాను.. కానీ, అదేమీ అడ్డంకి కాదని, తాను సరఫరా చేయగలనని నమ్మబలికాడు.

''చాలాకాలంగా ఎంతోమందికి మేం దీన్ని అమ్ముతున్నాం. సరకు మీ ఇంటికి చేరుతుంది’’ అని మెసేజ్ పెట్టాడు.

ప్రాణాంతక మందులు

ఫేస్ బుక్‌లో బహిరంగంగా..ఫేస్ బుక్‌లో ఇలాంటి పేజీలు 60కి పైగా చూశాను నేను.

వాటిలో చాలావరకు బహిరంగంగానే చెబుతున్నాయి. ఈ మాత్రలు కొని ఆత్మహత్య చేసుకోవచ్చని పేజీలో బహిరంగంగా చెబుతున్నాయి.

''జీవితంలో అలసిపోయారు.. చనిపోవాలనుకుంటున్నారా.. మరి, ఈ మాత్రలు కొంటున్నారా’’ అంటూ ఆ దిశగా ఆకర్షిస్తున్నారు.

''ఫేస్ బుక్ వేదికగా జరుగుతున్న ఈ వ్యవహారం ఆత్మహత్యాయత్నాలకు రసాయనాలు, విషం కొనడంతో మాత్రమే కాదు మాదక ద్రవ్యాల క్రయవిక్రయాల గురించీ చెబుతుంది’’ అన్నారు కార్డిఫ్ యూనివర్సిటీ క్లినికల్ ఫార్మకాలజీ, టాక్సికాలజీ రీడర్ జేమ్స్ కౌల్సన్.

ఆన్ లైన్‌లో మాదకద్రవ్యాల అమ్మకం, ప్రకటనలు పెరుగుతుండడం కూడా చూస్తున్నాం అన్నారు జేమ్స్.ఈ రసాయనల గురించి ఉన్న పేజీలన్నీ జాగ్రత్తగా చూస్తే అర్థమైందేంటంటే.. అదంతా ఒక స్కామ్.

ఇలాంటి ప్రకటనలున్న పేజీల్లో రాసిన రాతల్లో చాలావరకు తప్పులుతడకలుగా ఉన్నాయి.

మాత్రలు, సీసాలు, రసాయనాల ఫొటోలు అన్నిట్లో దాదాపు ఒకేలా ఉంటూ పదేపదే పాప్ అప్ అవుతున్నాయి.

పైగా వాటికి రివ్యూలు. అన్నీ పనిగట్టుకుని రాసిన పాజిటివ్ రివ్యూలని అర్థమవుతున్నాయి.ఈ రివ్యూల గురించి పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ స్టడీస్ సీనియర్ లెక్చరర్ లీసా ఒక మాట చెప్పారు..

''ఆ రసాయనం కొంటున్నవారంతా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నవారు. అలాంటప్పుడు దాన్ని వాడిన తరువాత వారు రివ్యూ ఎలా రాస్తారు’’ అని ప్రశ్నించారు. అదీ నిజమే కదా.

అంటే, ఆ రివ్యూలన్నీ ఫేక్ అనే అర్థం.కొందరు నిపుణులకు ఈ వివరాలన్నీ ఇవ్వగా వారు పరిశీలించి ఇదంతా మోసగాళ్ల పని అని తేల్చారు.

హ్యాకర్

మోసం చేస్తారిలా..

విషపు గోళీలు విక్రయిస్తామంటూ ఫేస్ బుక్ పేజీలు క్రియేట్ చేసి వాటిని ఎక్కువ మందికి రీచయ్యేలా చేస్తారు.

ఆత్మహత్య ఆలోచనలున్నవారు వాటిని చూసినప్పుడు వారిని సంప్రదిస్తారు.

అయితే, వారు ఈ విక్రేతలకు డబ్బు చెల్లించినా ప్రోడక్ట్ మాత్రం వారికి చేరదు.

కారణం.. ఆత్మహత్య ఆలోచనలున్నవారి బలహీనతను ఈ విక్రేతలు సొమ్ము చేసుకుంటారే కానీ నిజంగా అలాంటి రసాయనాలు ఏవీ అమ్మరు.

ఇలా మోసపోయిన తరువాత బాధితులు ఫిర్యాదు చేయడానికి కూడా ముందు రారని మాజీ పోలీస్ అధికారి, ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థ ఈసెట్‌లో సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్టుగా ఉన్న జేక్ మూర్ చెప్పారు.

అందుకు కారణం కూడా ఆయన వివరించారు.. ''ఇలాంటి విషపూరిత రసాయనాలను ఎందుకు కొనాలనుకున్నారు’’ వంటి ప్రశ్నలు అడుగుతారన్న భయంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లరని చెప్పారు.

దాంతో ఇదంతా మోసమన్న సంగతి పెద్దగా బయటకు రాకుండా ఉండిపోతుందన్నారు మూర్.

ఈ రసాయనం కొనడానికి డీలింగ్ చేస్తున్న వ్యక్తికి నేను బీబీసీ రిపోర్టర్‌ను అని చెప్పాను. దాంతో కొద్దిరోజులు సైలెంటయిపోయాడు.ఆ తరువాత మళ్లీ సమాధానమిచ్చాడు.

తన వ్యాపారమేమీ చట్ట విరుద్ధం కాదని సమర్థించుకున్నాడు.అయితే, అతడి పేరు కానీ, చిరునామా కానీ చెప్పలేదు.ఫేస్‌బుక్‌కు ఫిర్యాదు చేయడంతో..నేను సంపాదించిన ఆధారాలన్నిటితో ఫేస్ బుక్ కార్యాలయానికి వెళ్లాను.

వాళ్లు ఇలాంటి కొన్ని పేజీలను తొలగించారు. మరికొన్నిటిని ప్రాంతాలవారీగా బ్లాక్ చేశారు.దీంతో చట్టవిరుద్ధంగా వీటిని కొనే అవకాశం ఉన్న దేశాల్లో ఈ పేజీలు కనిపిస్తాయి.

మళ్లీ వారిని సంప్రదించడంతో వారు నిర్ణయం మార్చుకుని ఆ పేజీలను పూర్తిగా తొలగించారు.అక్కడితో అయిపోలేదు..ఫేస్ బుక్ ఆ పేజీలన్నిటినీ తొలగించడంతో సమస్య పరిష్కారం కాలేదు.

మళ్లీ అలాంటి పేజీలు మరికొన్ని కొత్తగా పుట్టుకొచ్చాయి. మోసగాళ్లు ఏమాత్రం తగ్గరు.. మళ్లీ కొత్త రూపంలో వస్తారు అని జేక్ మూర్ అన్నారు.

ఆ రసాయనం పేరును ఫేస్‌బుక్ తన పేజీల్లో కనుక నిషేధిస్తే ఇలాంటి పేజీలు క్రియేట్ చేయడం కుదరదని.. అదే పరిష్కారమని మూర్ అన్నారు.

(మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Those who want to commit suicide are being exploited by few using social media as platform
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X