వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

6వేలమంది ఒకేసారి నడిరోడ్డుపై బట్టలిప్పేసి..

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొలంబియా: వేలాది మంది కొలంబియన్లు ఒకేసారి నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది. అమెరికన్ ఫోటోగ్రాఫర్ స్పెన్సర్ ట్యూనిక్ మనుషుల్ని సామూహికంగా నగ్న చిత్రాలు తీయడంలో నేర్పరి.

ఆయన సూచనల మేరకు ఆరువేలమంది కొలంబియా ప్రజలు సోమవారం నాడు తమ ఒంటి పైన ఉన్న వస్త్రాలను విప్పేశారు. ఏడు డిగ్రీల చలివాతావరణాన్ని కూడా లెక్క చేయకుండా శరీరం పైన నూలుపోగు లేకుండా బొగోటా నగరంలోని మెయిన్ సెంటర్లో నిల్చొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Thousands of Colombians brave chilly morning to pose naked

గత ఆరేళ్ల కాలంలో సదరు ఫోటో గ్రాఫర్ సామూహిక నగ్న చిత్రాలలో ఇదే పెద్దది. కొలంబియాలోని లెఫ్టిస్ట్ తిరుగుబాటుదారులతో ప్రభుత్వం శాంతి చర్చలు జరపాలన్న నినాదంతో వీరు సామూహిక నగ్న ఫోటో సెషన్‌లో పాల్గొన్నారు.

తామంతా నగ్నంగా మారిపోవడం సంతోషంగా ఉందని, తాము గర్వాన్ని పక్కన పెట్టి శాంతిగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఇది ఐక్యతకు చిహ్నంగా ఉంటుందని, ఇది కొత్త అనుభవమని, మనం ప్రపంచంలోకి ఎలా వస్తామో అలాగే పాల్గొన్నామని.. ఫోటో సెషన్లో పాల్గొన్న వారు చెప్పారు.

English summary
Thousands of Colombians brave chilly morning to pose naked 'in the name of peace' for US photographer Spencer Tunick's latest installation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X