నగ్నంగా వేల మంది ఫోటోలకు ఫోజులు (ఫోటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హాల్: ప్రఖ్యాత అమెరికన్ ఆర్టిస్ట్ స్పెన్సర్ ట్యునిక్ యుకెలోని హాల్ నగరంలో ఓ వినూత్న ప్రదర్శనకు శ్రీకారం చుట్టాడు. ఆమెరికాలోని న్యూయార్క్ నగరానికి చెందిన ఆ పెయింటర్, ఫోటోగ్రాఫర్ కోసం సుమారు ఇరవై దేశాలకు చెందిన ప్రజలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.

హాల్ సిటీ కౌన్సిల్ తెలిపిన వివరాల ప్రకారం 3200 మంది నగ్నంగా ఫొటోలకు ఫోజులిచ్చారు. ట్యునిక్ చిత్రాలకు అభిమాని అయిన 80 ఏళ్ల స్టెఫానే జాన్సీన్ అనే మహిళ ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు అమెరికా నుంచి హాల్ సిటీకి రావడం జరిగింది. ఇలా ప్రపంచ వ్యాప్తంగా ట్యునిక్ వినూత్న ప్రదర్శనల్లో 20 సార్లు ఆమె పాల్గొన్నారు.

నగరంలోని వారసత్వ కట్టడాల వద్ద, ముఖ్యమైన ప్రాంతాల్లో ఇలా నగ్నంగా ఫొటోలకు ఫోజులివ్వాలని ట్యునిక్ ఇచ్చిన పిలుపు మేరకు ఆసక్తి ఉన్నవారు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న పురుష, మహిళల శరీరానికి నీలం రంగులలో నాలుగు షేడింగ్స్ కలిగిన పెయింట్‌ను వేశారు.

ఈ వినూత్న ప్రదర్శనపై ట్యునిక్ మాట్లాడుతూ వారసత్వ కట్టడాలు, ప్రకృతిసిద్ధమైన ఆస్తులను కాపాడుకోవాలని చెప్పాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని చెప్పారు. సముంద్రం, నదులలో నీళ్లంటే తనకెప్పుడూ ఇష్టమని వాటితో ఉన్న అనుబంధం కారణంగానే ఈ విధంగా నీలిరంగు పెయింట్‌ని ఉపయోగించామని అతడు తెలిపాడు.

ఇప్పటివరకు తాను చేసిన ప్రాజెక్టులన్నీ ఒక ఎత్తు అయితే, ఇది మరొక ఎత్తు అని అన్నారు. 2017లో తాను ఇప్పటివరకూ చేసిన ప్రాజెక్టులను ప్రజల ముందుకు తీసుకొస్తానని తెలిపారు. ఇక్కడికి తరలివచ్చిన వారికి ఫొటోలను పంపిస్తామని, ఇలాంటి ఘటనలు వారి జీవితంలో ఓ తీపి గుర్తులుగా మిగిలిపోతాయని తెలిపారు.

మార్చిలో ఈ వినూత్న ప్రదర్శనకి తాము శ్రీకారం చుట్టగా, ఇంత పెద్ద ఎత్తున స్పందన వస్తుందని తాము ఊహించలేదని ఫెరెన్స్ ఆర్ట్ గ్యాలరీకి చెందిన క్యూరేటర్ క్రిస్టెన్ సిమిస్టర్ తెలిపారు. ఈ వినూత్న ప్రదర్శన కోసం తొలి రోజు నుంచి కూడా ఎంతో ఆతృతగా తాను ఎదురు చూసినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

Images Credit: Press Association

వారసత్వ కట్టడాల కోసం హాల్ సిటీలో నగ్నంగా వేల మంది ఫోటోలకు ఫోజులు
  
English summary
Thousands of people have stripped and been painted blue as they starred in a huge installation to celebrate Hull's relationship with the sea. Hull City Council said 3,200 people took part in the event - the largest of its kind ever to be staged in the UK by New York-based artist Spencer Tunick.
Please Wait while comments are loading...

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి