• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ట్రంప్‌కు వెన్నుపోటు: వేడెక్కిన వాషింగ్టన్: రోడ్డెక్కిన లక్షలాది మంది: ఏం జరుగుతోంది?

|

వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్.. ఒక్కసారిగా వేడెక్కింది. లక్షలాది మంది నిరసనకారులతో నిండిపోయింది. రహదారులన్నీ కిటకిటలాడాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా నిలిచారు. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపిస్తోన్న ప్రస్తుత పరిస్థితులను కూడా పట్టించుకోలేదు. పూర్తిస్థాయిలో ఎన్నికల పలితాలు వెలువడిన వెంటనే నిరసనకారులు ఈ ఆందోళనను చేపట్టారు. కొత్త అధ్యక్షుడు జో బిడెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో మోసాలకు పాల్పడ్డారని, దొడ్డిదారిన ఎన్నికయ్యారంటూ నినదించారు.

  Trump Supporters Against Presidential Elections Results అక్రమంగా అధ్యక్ష స్థానం Jo Biden కైవసం ?
  వైట్‌‌హౌస్ వద్ద

  వైట్‌‌హౌస్ వద్ద

  అమెరికా కాలమానం ప్రకారం.. శనివారం ఉదయం డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్‌లో ఈ నిరసన ర్యాలీని చేపట్టారు. టీ పార్టీ కార్యకర్తలు ఇందులో పెద్ద సంఖ్యలోొ పాల్గొన్నారు. లక్షలాదిమందితో వాషింగ్టన్ రహదారులన్నీ క్రిక్కిరిసిపోయాయి. అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌కు వెళ్లే మార్గాలన్నీ ట్రంప్ మద్దతుదారులతో నిండిపోయాయి. వైట్‌హౌస్ సమీపంలోని ఫ్రీడమ్ పార్క్ వద్ద బైఠాయించారు. ట్రంప్‌కు మద్దతుగా బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శించారు. రిపబ్లికన్ పార్టీ ఎన్నికల గుర్తు ఉన్న జెండాలను ప్రదర్శించారు. `మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్..`, `వుయ్ వాంట్ ట్రంప్..` అంటూ నినాదాలు చేశారు.

  ఎన్నికల్లో అక్రమాలు..

  ఎన్నికల్లో అక్రమాలు..

  అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనేది వారి వాదన. జో బిడెన్ అక్రమంగా అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోబోతున్నారని ఆరోపించారు. ప్రజల తీర్పునకు వ్యతిరేకంగా ఆయన గద్దెనెక్కుతున్నారని విమర్శించారు. మిచిగాన్, మిన్నెసొటా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియాల్లో డెమొక్రాట్లు ఓట్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఆయా రాష్ట్రాల్లో అతి తక్కువ తొలుత భారీ ఆధిక్యతను సాధించిన డొనాల్డ్ ట్రంప్.. చివరికి ఎలా ఓడిపోయారని ప్రశించారు. డొనాల్డ్ ట్రంప్- జో బిడెన్ మధ్య ఉన్న ఆధిక్యత తేడా చాలా ఒక శాతం వరకే ఉందని చెప్పారు.

  నాలుగేళ్ల పాటు ట్రంప్..

  నాలుగేళ్ల పాటు ట్రంప్..

  మరో నాలుగేళ్ల పాటు డొనాల్డ్ ట్రంప్ పదవిలో కొనసాగాలంటూ మద్దతుదారులు డిమాండ్ చేశారు. నిరసనకారుల్లో మహిళలు పెద్ద సంఖ్యలో కనిపించారు. అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకోబోతోన్న జో బిడెన్‌ను తాము అధ్యక్షుడిగా గుర్తించలేమని టీ పార్టీ ప్రతినిధులు తేల్చి చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ.. తాము పెద్దగా బాధపడట్లేదని, అక్రమంగా, దొడ్డిదారిన ఆయనపై విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. పెన్సిల్వేనియాలో జో బిడెన్ అక్రమంగా గెలిచాడనే విషయం అందరికీ తెలుసునని చెప్పారు.

  అక్రమాలు జరిగాయనడానికి ఇంతకంటే సాక్ష్యాలా?

  అక్రమాలు జరిగాయనడానికి ఇంతకంటే సాక్ష్యాలా?

  అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయనడానికి ఇంతకంటే సాక్ష్యాధారాలు అవసరం లేదని డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. మద్దతుదారులను ఉద్దేశించిన ఆయన ట్వీట్లు చేశారు. రిపబ్లికన పార్టీ ఎన్నికల పర్యవేక్షకులను సైతం లోనికి రానివ్వకుండా బ్యాలెట్ పత్రాల లెక్కింపును చేపట్టారని, వాటిపై ఉన్న అనుమానాలను ఇప్పటికీ నివృత్తి చేయట్లేదని అన్నారు. మిచిగాన్, పెన్సిల్వేనియా, జార్జియా సహా ఇతర రాష్ట్రాల్లో నిర్వహించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తం రాజ్యంగానికి విరుద్ధంగా సాగిందని ఆయన పునరుద్ఘాటించారు.

  English summary
  Thousands of people turned up in the US capital on Saturday to show support to President Donald Trump and protest against the results of the presidential elections. Supporters gathered in Freedom Plaza near the White House starting early Saturday morning.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X