వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో బైకుల ప్రవాహం.. ఎన్ని బండ్లో లెక్క పెట్టడం కష్టమే (వీడియో)

|
Google Oneindia TeluguNews

చైనా : వాయు కాలుష్యంతో నగరాలు కుదేలవుతున్నాయి. ఫ్యాక్టరీల నుంచి వెలువడే పొగతో నగరాల్లో నివసించే ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోంది. అదలావుంటే వాహనాల నుంచి వెలువడే కాలుష్యం కూడా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతోంది. లెక్కకు మించిన వాహనాలు రోడ్లపై పరుగులు తీస్తుంటే ఎయిర్ పొల్యూషన్ మరింత ఇబ్బందులు తెచ్చిపెడుతోంది.

నగరాల్లో సాధారణంగా రోజుకీ ఎన్ని వాహనాలు రోడ్లమీదకు వస్తాయో లెక్క లేదు. మారుతున్న కాలంతో యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డ జనాలు ఉరుకులు పరుగులతో.. ప్రభుత్వ రవాణా సౌకర్యాలను వినియోగించడం తక్కువై పోతోంది. ఆ మేరకు సొంత వాహనాలు సమకూర్చుకుంటూ తమ పనులు కానిచ్చేస్తున్నారు. ఆఫీసులకు వెళ్లాలన్నా.. ఇతరత్రా పనుల మీద బయటకు వెళ్లాలన్నా సొంత వాహనాల మీద ఆధారపడుతున్నారు. దాంతో రోడ్ల మీదకు లెక్కకు మించి చేరే వాహనాలతో కాలుష్యం వీపరీతంగా పెరిగిపోతోంది.

thousands of two wheelers in china viral video

సరదా కొంప ముంచింది.. నర్సుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చిన టిక్ టాక్ (వీడియో)సరదా కొంప ముంచింది.. నర్సుల ఉద్యోగాలకు ఎసరు తెచ్చిన టిక్ టాక్ (వీడియో)

చైనాలో తీసిన వీడియో ఒకటి నగర కాలుష్యంపై ఆలోచింపజేసే విధంగా ఉంది. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న ఆ వీడియో చూస్తే కాలుష్యపు కోరలు కళ్లముందు కదలాడుతుంటాయి. చైనాలోని ఓ నగరంలో రెడ్ సిగ్నల్ పడింది. దాంతో వేల సంఖ్యలో బైకులు నిలిచిపోయాయి. అయితే గ్రీన్ సిగ్నల్ పడగానే రయ్‌మంటూ ముందుకు దూసుకెళ్లాయి.

అదంతా కూడా ఓ బిల్డింగ్ పై అంతస్తు నుంచి వీడియో తీయడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆ బైకుల ప్రయాణ ప్రవాహం ఔరా అనిపిస్తోంది. అన్ని వేల బైకులు ఒక నగరంలో తిరుగుతున్నాయా అనే డౌట్ వస్తుంది. ఇక ఓ సిగ్నల్ దగ్గరే అన్నీ వేల బైకులు కనిపిస్తుంటే.. ఇక ఆ నగరంలో మరెన్ని బైకులు ఉంటాయోననే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టాప్ వ్యూ ద్వారా చీమల్లాగా కనిపిస్తున్న ఆ బైకులను నెటిజన్లు అలాగే కళ్లప్పగించి చూస్తున్నారట. వామ్మో ఇన్ని బైకులా అంటూ కంగుతింటున్నారట.

English summary
China Video Viral In Social Media About Huge Number Of Two Wheelers Caught In Camera. When Green Signal Lights At One Circle, Some One Taken Video how the bikes going. The Bikes are looks like ants from top view.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X