వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతరిక్షంలో 196 రోజుల మిషన్ పూర్తి - క్షేమంగా భూమికి చేరిన ముగ్గురు వ్యోమగాములు - వీడియో

|
Google Oneindia TeluguNews

ప్రత్యేక మిషన్ కోసం అంతరిక్షంలో 196 రోజులపాటు గడిపిన ముగ్గురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి తిరిగొచ్చారు. బుధవారం రాత్రి 7:32 గంటలకు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి బయలుదేరిన వ్యోమగాములు అదేరోజు రాత్రి 10:54 గంటలకు కజకిస్తాన్లోని డెజ్కాజ్గాన్ పట్టణానికి సమీపంగా సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.

100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి100ఏళ్ల తర్వాత ఏపీలో భూసర్వే -1.22లక్షల చ.కిమీ, 4500 టీమ్స్ - సీఎం జగన్ రివ్యూ -దేశంలో తొలిసారి

ఈ మిషన్ లో పాల్గొన్న ముగ్గురు వ్యోమగాముల్లో ఒకరు అమెరికన్ కాగా, మిగతా ఇద్దరు రష్యన్లు. నాసా వ్యోమగామి క్రిస్ కాసిడీ, రష్యన్ వ్యోమగాములు ఇవాన్ వాగ్నెర్, అనాటోలీ ఇవానిషిన్ భూమికి తిరిగి చేరిన వెంటనే సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించారు.

Three astronauts returns to Earth after 196-day mission

ల్యాండింగ్ సైట్ వద్ద ప్రాథమిక వైద్య తనిఖీలు నిర్వహించిన అనంతరం ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తారు. క్రిస్‌ కాసిడీ నాసా విమానంలో హ్యూస్టన్‌కు.. వాగ్నెర్, ఇవానిషిన్ రష్యాలోని స్టార్ సిటీకి వెళ్లనున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 6 నెలల మిషన్ సందర్భంగా.. కాసిడీ ఎక్స్‌పెడిషన్ 63 కమాండర్‌గా పనిచేశారు.

కరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూకరోనా వ్యాక్సిన్‌పై అనూహ్య ప్రకటన -ఓట్లేస్తే ఉచితంగా ఇస్తామన్న బీజేపీ -చావు భయాన్ని అమ్ముతున్నారంటూ

స్టేషన్ బ్యాటరీలను అప్‌గ్రేడ్ చేయడానికి కాసిడీ, బెహ్ంకెన్ మొత్తం 23 గంటలు 37 నిమిషాలపాటు నాలుగు స్పేస్‌వాక్‌లను పూర్తి చేశారు. 10 అంతరిక్ష నడకలను పూర్తి చేసిన నలుగురు అమెరికా వ్యోమగాములలో వీరు కూడా ఉన్నారు. కాసిడీ స్పేస్ లో మొత్తం 378 రోజులు గడపడం ద్వారా ఎక్కువకాలం అక్కడున్న యూఎస్ వ్యోమగాముల్లో ఐదో వ్యక్తిగా నిలిచారు.

Three astronauts returns to Earth after 196-day mission
English summary
This evening, three astronauts who have been living on board the International Space Station for the last six months will return back to Earth in a Russian Soyuz capsule, landing in the middle of the Kazakhstan desert. The trio have lived in space for nearly the entirety of the COVID-19 pandemic and are now returning as cases are rising again across the world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X