వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మెక్సికో స్కూల్లో కాల్పులు: ముగ్గురు మృతి
మెక్సికన్ సిటీ: న్యూమెక్సికో హై స్కూల్లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని అధికారులు వెల్లడించారు. అజ్టెక్లోని అజ్టెక్ హైస్కూల్లో కాల్పులు జరిపిన దుండగుడు కూడా పోలీసుల కాల్పుల్లో మరణించినట్లు తెలిసింది.

కాగా, ఈ కాల్పుల ఘటనలో మరో 15మంది గాయాలపాలయ్యారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో సమీపంలోని అన్ని పాఠశాలలు మూసివేశారు. పిల్లలందర్నీ ఇంటింటికి పంపించేసినట్లు అధికారులు తెలిపారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!