వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వే సత్యాలు: వివాదాలకు కేరాఫ్‌గా ఉండే ట్రంప్ దొరకు ట్విటర్‌లో యమ ఫాలోయింగ్..!

|
Google Oneindia TeluguNews

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎక్కువగా తన వివాదాస్పద వ్యాఖ్యలతోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. చాలామంది విదేశీయులు ఆయనంటే కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ... ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని ఓ సర్వే వెల్లడించింది. బయటదేశాల్లో ట్రంప్‌కు ఉన్న అభిమానుల విషయాన్ని పక్కనబెడితే.... సొంతదేశం అమెరికాలో మాత్రం ట్రంప్‌కు విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నట్లు ది ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్టు సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం అమెరికాలో ట్విటర్ వినియోగదారుల్లో దాదాపు 19శాతం వినియోగదారులు డొనాల్డ్ ట్రంప్‌ను ఫాలో అవుతున్నట్లు ఈ సర్వే స్పష్టం చేసింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా ట్విటర్‌పై ట్రంప్‌ను ఫాలో అవుతున్న వారి సంఖ్య దాదాపు 60 మిలియన్ మంది ఉన్నట్లు సర్వే తెలిపింది. ముఖ్యంగా ట్రంప్ తీసుకునే సాహసోపేతమైన నిర్ణయాలకు ఆకర్షితులై ఆయన్ను ఫాలో అవుతున్నారని సర్వే వెల్లడించింది. ఈ నిర్ణయాలు వివాదాస్పదంగా మారడంతో చాలామంది ట్విటర్ యూజర్లు ట్రంప్‌ను ఫాలో అవుతున్నారని సర్వే వివరించింది. అమెరికాలో 2,388 మంది అడల్ట్ ట్విటర్ యూజర్లను పరిగణలోకి తీసుకుంది సర్వే. డిసెంబర్ 2018 నుంచి 2019 వరకు ఈ సర్వే నిర్వహించారు. ప్రతి 10 మందిలో ముగ్గురు డొనాల్డ్ ట్రంప్ ట్విటర్‌ను ఫాలో అవుతున్నట్లు చెప్పుకొచ్చింది.

Three in 10 Twitter users follows Donald Trump: Survey

ఇక ట్రంప్ బాధ్యతలు, పాలనపై 54 శాతం మంది ట్విటర్ ఫాలోవర్లు సంతృప్తి వ్యక్తం చేశారు.ఇక ట్విటర్‌పై ఫాలో చేయనివారు 24 శాతం మంది ఉన్నట్లు పేర్కొంది. ట్రంప్‌ను ట్విటర్‌పై ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నప్పటికీ ఆయన చాలా పరిమితంగానే ట్విటర్‌పై పోస్టు చేస్తూ ఉంటారు. ఇది ఎంతలా అంటే అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ట్విటర్‌ వినియోగం కంటే ట్రంప్‌ వినియోగమే తక్కువని ప్యూ సంస్థ పేర్కొంది. నలుగురు డెమొక్రాటిక్ కాంగ్రెస్ మహిళా సభ్యులపై విమర్శలు సంధిస్తూ తమ రంగు గురించి మాట్లాడుతూ వారిని తమ దేశాలకు వెళ్లిపోవాల్సిందిగా ట్రంప్ అన్న నేపథ్యంలో ఈ సర్వే రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్ ఒక అధ్యక్ష పదవిలో ఉండి జాత్యాహంకార వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శిస్తోంది డెమొక్రటిక్ పార్టీ.

English summary
Nineteen per cent of US Twitter users follow President Donald Trump on the social platform, and a majority of those people approve of his job performance, a survey showed Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X