వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈఓలతో ట్రంప్ సమావేశం

By Narsimha
|
Google Oneindia TeluguNews

దావోస్: దావోస్‌ జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌ యూరోపియన్ వ్యాపార ప్రతినిధుల బృందంతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టాప్‌ 15 కంపెనీల సీఈవోలతో ట్రంప్‌ డిన్నర్‌కు హాజరయ్యారు. డైన్‌ విత్‌ గ్లోబల్‌ బిజినెస్‌ లీడర్స్‌ కార్యక్రమంలో ముఖ‍్యంగా భారత సంతతికి చెందిన ముగ్గురు సీఈవోలు పాల్గొన్నారు.

నోవార్టిస్‌ సీఈవో వాస్‌ నరసింహన్, నోకియా సీఈవో రాజీవ్ సూరి , డెలాయిట్‌ సీఈవో పునీత్‌ రెన్జెన్‌ ట్రంప్‌తో ఈ డిన్నర్‌లో పా​ల్గొన్న ప్రముఖులు. మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థి అయిన నరసింహన్ సెప్టెంబరు 2017 లో నోవార్టిస్‌ సీఈవోగా ఎంపికయ్యారు.

Three Indian-origin CEOs dine with Donald Trump in Davos

రోహ్‌తక్‌లో జన్మించిన పునీట్ రెన్జెన్ జూన్ ,2015లో డెలాయిట్ సీఈవోగా నియమితులయ్యారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు తన ప్రయత్నాలలో భాగంగా అమెరికాలో పెట్టుబడులు పెట్టమని ట్రంప్‌ టాప్‌ సీఈవోలను ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తన హయాంలో అభివృద్ధి చెందుతున్న అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడారు. తన పన్ను విధానాలు, డీరెగ్యులేషన్ లతోపాటు అమెరికన్ వ్యాపారవృద్ధిలో తన కృషి గురించి వివరించారు.

English summary
US President Donald Trump’s dinner with a European business delegation in Davos on the sidelines of the World Economic Forum meeting was attended by three Indian-origin CEOs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X