వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో కాల్పులు: పోలీస్ సహా ముగ్గురు మృతి

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్‌ పట్టణంలోని ఓ ఆస్పత్రి సమీపంలో దుండుగుడు కాల్పులకు తెగబడ్డాడు. కాల్పుల్లో ఓ పోలీసు అధికారి సహా ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగురు పోలీసులు, నలుగురు పౌరులకు గాయాలయ్యాయి. అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11.30గంటల సమయంలో ఆస్పత్రి వద్దకు వచ్చిన దుండగుడు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడు.

సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. నిందితుడు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు, ఒక పోలీసు అధికారి మృతి చెందారు. ఐదు గంటల ఆపరేషన్‌ తర్వాత నిందితుడ్ని పోలీసులు సజీవంగా పట్టుకోగలిగారు.

 Three killed in Colorado shooting: mayor

కాల్పులకు తెగబడిన నిందితుడిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆరాతీశారు. పోలీసు ఉన్నతాధికారుల నుంచి ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాల్పుల్లో గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.

కాగా, గాయపడ్డ 11 మందికి ప్రాణాపాయం లేదని కొలరాడో స్ప్రింగ్స్ మేయర్ జాన్ సుతెర్స్ చెప్పారు. అయితే కాల్పుల ఘటనలో ధైర్యవంతుడైన ఓ పోలీసు అధికారిని కోల్పోయామని అన్నారు.

ఐదు రోజుల కిందటే న్యూ ఆర్లియాన్స్ ప్రాంతంలోని ఓ పార్క్‌లో ఇరు వర్గాలకు మధ్య చోటుచేసుకున్న కాల్పుల్లో 10 మరణించిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఘటనలు అమెరికాలో తరచు జరుగుతుండటంతో అక్కడి ప్రజలు కొంత ఆందోళనకు గురవుతున్నారు.

English summary
Three people have been killed and nine wounded when a gunman opened fire at a family planning centre in Colorado, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X