• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

న్యూయార్క్‌లో అర్ధరాత్రి కలకలం.. ప్యాట్రోలింగ్ వేళ పోలీసులపై అనూహ్య దాడి...

|

జార్జ్ ఫ్లాయిడ్ హత్యోదంతం తర్వాత ఆందోళనలతో అట్టుకుడుతున్న అమెరికాలో అశాంతికి తెరపడట్లేదు. ప్రజల ఆగ్రహ జ్వాలలను చల్లార్చడం కష్ట సాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో బుధవారం అర్ధరాత్రి న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. గుర్తు తెలియని దుండగుడు ఒకరు ఓ పోలీస్ అధికారి మెడపై కత్తితో దాడి చేశాడు. దీంతో అక్కడే ఉన్న ఇద్దరు పోలీసులు అతనికి తుపాకీ ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి.

అసలేం జరిగింది..

అసలేం జరిగింది..

పోలీసుల కథనం ప్రకారం.. బుధవారం రాత్రి 11.45గం. సమయంలో ముగ్గురు పోలీస్ అధికారులు చర్చ్ అవెన్యూ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వీధిలో నుంచి దూసుకొచ్చిన దుండగుడు ఓ పోలీస్ అధికారి మెడపై కత్తితో పొడిచాడు. దీంతో అక్కడే ఉన్న మరో ఇద్దరు పోలీస్ అధికారులు వెంటనే అప్రమత్తమై అతనిపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో దుండగుడు కూడా వారిపై కాల్పులు జరపగా.. ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ దుండగుడి పరిస్థితి విషమంగా ఉండగా.. పోలీసుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు కింగ్స్ కౌంటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

పోలీస్ కమిషనర్ ఏమంటున్నారు..

పోలీస్ కమిషనర్ ఏమంటున్నారు..

కాల్పుల్లో గాయపడ్డ ఇద్దరు పోలీసుల్లో ఓ అధికారి చేతిలో బుల్లెట్ దిగినట్టు గుర్తించారు. మరో అధికారి చేయికి కూడా బుల్లెట్ గాయమైనట్టు గుర్తించారు. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కమిషనర్ డెర్మట్ షియా మాట్లాడుతూ.. సర్వైలైన్స్ వీడియో ఆధారంగా ఘటనపై విచారణ జరుపుతామని చెప్పారు. దుండగుడు కత్తిపోట్లకు తెగబడటంతో చాలామంది పోలీసులు అతని వైపు కాల్పులు జరిపారని చెప్పారు. తాను దాడి చేసిన పోలీస్ వద్ద నుంచి ఆ దుండగుడు గన్ లాక్కున్నాడని.. అయితే అతను కాల్పులు జరిపాడో లేదో స్పష్టత లేదన్నారు.

  California earthquake : A magnitude 5.5 earthquake near Ridgecrest
  ఆగని ఆగ్రహజ్వాలలు..

  ఆగని ఆగ్రహజ్వాలలు..

  జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యోదంతంపై నిర‌స‌నలు రోజురోజుకు తీవ్రమవుతుండటంతో అమెరికాలో ఇప్పటికే 40 నగరాల్లో కర్ఫ్యూ విధించారు. దాదాపు 20 రాష్ట్రాల్లో ఆందోళ‌న‌లతో అట్టుడుకుతున్నాయి. 'ఐ కాంట్ బ్రీత్' నినాదంతో ఫ్లాయిడ్‌కు న్యాయం జ‌ర‌గాలంటూ అమెరికన్లు నిర‌స‌న‌లు చేస్తున్నారు. మ‌రోవైపు అధ్య‌క్షుడు ట్రంప్ ఆందోళనలను ఎక్కడికక్కడ అణచివేయాలని.. ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందకుండా చూడాలని ఆదేశాలిచ్చారు. నిర‌స‌న‌కారులు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకపోతే ఆర్మీని దింపాల్సి ఉంటుందని ఇదివరకు ఆయన వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఆర్మీ మోహరింపుపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, నగరాల మేయర్లు, సొంత పార్టీ రిపబ్లికన్‌ నేతల నుంచే వ్యతిరేకత రావడంతో ట్రంప్ ఆ ఆలోచన విరమించుకున్నారు.

  English summary
  Three NYPD officers were hospitalized after a violent confrontation with a knife-wielding suspect in Brooklyn late Wednesday night, a police spokesperson said.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X